-
-
మొత్తానికి ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండబోతుంది అంటూ హింట్ ఇచ్చి కథను సుఖాంతం చేసారు.ఇక పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 12:46 PM December 21, 2018
-
చిత్రం క్లైమాక్స్ దిశకు చేరుకుంది.కొన్ని కీలక సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 12:40 PM December 21, 2018
-
ఆ మైనింగ్ ప్రాంతంలో కష్టాలు పడుతున్నటువంటి పేదవారిని,నిస్సహాయులని చూసి యాష్ వారికి అండగా నిలబడాలని నిర్ణయించుకుంటాడు.ఇప్పుడు మరో పోరాట సన్నివేశానికి తెర లేచింది.
Date & Time : 12:25 PM December 21, 2018
-
కే జి ఎఫ్ వద్ద హీరో యాష్ తన తిరుగుబాటుని మొదలుపెట్టాడు.అక్కడ బానిసలుగా బతుకుతున్నటువంటి ప్రజలకి అతనే ఒక ఆశా జీవుడిగా కనిపిస్తున్నాడు.
Date & Time : 12:10 PM December 21, 2018
-
బంగారు మైన్స్ ఉండే ఏరియా కి సంబందించిన కొన్ని సీన్లు వస్తున్నాయి.ఇవి కాస్త కీలక పాత్ర పోషించేలా ఉన్నాయి.
Date & Time : 11:47 AM December 21, 2018
-
ఇంటర్వెల్ తర్వాతే మరో యాక్షన్ సన్నివేశానికి రంగం సిద్ధమయ్యింది.ఈ ఫైట్ మాత్రం కాస్త ఆసక్తికరంగా సాగేలా కనిపిస్తుంది.
Date & Time : 11:34 AM December 21, 2018
-
ఫస్టాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు ఫస్టాఫ్ అంతటిని గమనించినట్లయితే ఒక్క హీరోని ఎలివేట్ చేసే సీన్లను మినహాయించి మిగతా అంతా పెద్ద ఆకట్టుకోలేదు.కానీ సెకండాఫ్ లో మాత్రం అసలు కథ మొదలవ్వబోతుంది అని మాత్రం చెప్పొచ్చు.
Date & Time : 11:25 AM December 21, 2018
-
సినిమా సగానికి చేరుకుంది.హీరో ఎక్కడైతే పుట్టాడో అక్కడికే ఇప్పుడు సన్నివేశాలు చేరుకున్నాయి.ఇప్పుడు విరామం.
Date & Time : 11:21 AM December 21, 2018
-
హీరోని ఎలివేట్ చేసే సీన్లు ఇంకా ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి.
Date & Time : 11:11 AM December 21, 2018
-
ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా ఐటెం సాంగ్ వస్తుంది.తమన్నా మరో సారి తన అద్భుత డాన్స్ స్టెప్పులతో అదరగొట్టేస్తున్నారు.
Date & Time : 11:08 AM December 21, 2018
-
తల్లి సెంటిమెంట్ ను ప్రతిబింబిస్తూ చక్కటి సన్నివేశం వస్తుంది.
Date & Time : 10:58 AM December 21, 2018
-
ఇప్పుడే ఈ చిత్ర హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఎంట్రీ ఇచ్చారు.ప్రధాన పాత్రధారుల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:44 AM December 21, 2018
-
హీరో యొక్క ఇంట్రో సాంగ్ ఇప్పుడు వస్తుంది.ముంబై పోర్ట్ ప్రాంతంలో ఈ పాటను చిత్రీకరించారు.
Date & Time : 10:35 AM December 21, 2018
-
కన్నడ సూపర్ స్టార్ యాష్ ఎంట్రీ అదిరిపోయే రేంజ్ లో ఇచ్చారు.ఇప్పుడొక భారీ పోరాట సన్నివేశం వస్తుంది.
Date & Time : 10:30 AM December 21, 2018
-
ఇక హీరో యాష్ ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది.సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:18 AM December 21, 2018
-
హీరో యొక్క చిన్నప్పటి జీవితానికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:18 AM December 21, 2018
-
హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ కొన్ని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 10:10 AM December 21, 2018
-
హాయ్ 156 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది...
Date & Time : 10:07 AM December 21, 2018