-
-
కొన్ని ఆసక్తికర సంఘటన తరువాత చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి
Date & Time : 12:05 AM September 06, 2019
-
వివాహవేదిక సిద్ధమైంది. కథలో విలన్ మాత్రం హీరోయిన్ ని పెళ్లిచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు
Date & Time : 11:57 AM September 06, 2019
-
కథలోని మలుపులు,భావోద్వేగాలు చివరిదశకు చేరుకున్నాయి. మూవీ క్లైమాక్స్ దిశగా వెళుతుంది
Date & Time : 11:52 AM September 06, 2019
-
నటులు నరేష్, గొల్లపూడి మధ్య పశ్చాత్తాపానికి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి. సన్నివేశాలలో కొత్తదనం లోపించింది.
Date & Time : 11:45 AM September 06, 2019
-
ఎటువంటి మలుపు లేకుండా సాగుతున్న కథలో ప్రస్తుతం మూవీ లోని విలన్ కోణానికి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:38 AM September 06, 2019
-
ఇప్పుడు భావోద్వేగ సన్నివేశాలు నడుస్తున్నాయి. పడే పడే ఒకే రకమైన సన్నివేశాలు వస్తున్న భావన కలుగుతుంది.
Date & Time : 11:30 AM September 06, 2019
-
మూవీలో విలన్ కి సంబంధిచిన సన్నివేశాలు వస్తున్నాయి. చిత్రం మాత్రం నిరుత్సహంగా సాగుతుంది. దర్శకత్వం బాగోలేదు.
Date & Time : 11:25 AM September 06, 2019
-
విరామం తరువాత మొదటి పాట వస్తుంది. శ్రద్దాను దక్కించుకోవడానికి ఆది వాళ్ళ నాన్నను ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అందుకు ఆది ఆయన కంపెనీలోనే ఉద్యోగిగా చేరాడు.
Date & Time : 11:20 AM September 06, 2019
-
సన్నివేశాలు అసలు కథ నుండి ప్రక్కదారి పట్టాయి. పొంతనలేని సన్నివేశాలతో చిత్రం నిరుస్తాహంగా నడుస్తుంది.
Date & Time : 11:12 AM September 06, 2019
-
ఇప్పుడే స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన మరో కమెడియన్ సత్య మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 11:04 AM September 06, 2019
-
ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరో తండ్రి ఇబ్బందులకు సంబందించిన సన్నివేశాలు, ఇప్పటివరకు జరిగిన ప్రేమకధా నేపధ్యాన్ని ప్రక్కదారి పట్టించేలా ఉంది.
Date & Time : 10:58 AM September 06, 2019
-
విరామం తరువాత మూవీలోని అసలు ట్విస్ట్ బయటపడింది. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 10:50 AM September 06, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: సింపుల్ కథని కొంచెం ఆహ్లాదంగా తెరకెక్కించారు. రొటీన్ కథ చెప్పే క్రమంలో కొంచెం సాగతీతకు గురైందన్న భావన కలిగింది. చాలా అనవసర సన్నివేశాలు మూవీ నెమ్మదించేలా చేశాయి. ఇక మూవీ రెండవ భాగమే కీలకం
Date & Time : 10:44 AM September 06, 2019
-
ఒక పోరాట సన్నివేశం అనంతరం నాటకీయంగా ఆది, శ్రద్దాల ప్రేమ బ్రేకప్ అయ్యింది. మూవీ మొదటి సగం పూర్తయింది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:43 AM September 06, 2019
-
కథలో ఓ చిన్న మలుపు చోటు చేసుకుంది. చిత్రం ఇంటర్వెల్ వైపుగా నడుస్తుంది.
Date & Time : 10:40 AM September 06, 2019
-
హీరో హీరోయిన్ల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ వస్తుంది. ఐతే సన్నివేశాలు అసలు కథ నుండి ప్రక్కదారి పడుతున్న భావన కలుగుతుంది.
Date & Time : 10:30 AM September 06, 2019
-
హీరో హీరోయిన్ల మధ్య ఓ గుడి నేపథ్యంలో సన్నివేశాలు నడుస్తున్నాయి. చీరలో శ్రద్దా శ్రీనాధ్ చాలా అందంగా ఉన్నారు. సన్నివేశాలు ఆహ్లదంగా ఉన్నా, మూవీ ప్రధాన కథలోకి ఇంకా ప్రవేశించలేదు.
Date & Time : 10:25 AM September 06, 2019
-
హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. వీరిద్దరి మధ్య వస్తున్న రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. శ్రద్దా శ్రీనాధ్ చాలా అందంగా ఉన్నారు.
Date & Time : 10:20 AM September 06, 2019
-
కమెడియన్సత్య పై నడుస్తున్న కామెడీ సీన్స్ నవ్వులు కురిపిస్తున్నాయి. కమెడియన్ గా ఆయన నటన బాగుంది. మూవీ అసలు కథలోకి ఇంకా ప్రవేశించనప్పటికీ సన్నివేశాలు ఆహ్లదంగా సాగుతున్నాయి.
Date & Time : 10:05 AM September 06, 2019
-
సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీ రావు పాత్ర పరిచయమైంది. ఆయన పాత్ర వలన విలన్ పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు పాత్రలు మరియు ఆది మధ్య ఓ కీలక మలుపుతో కూడిన సన్నివేశం వస్తుంది.
Date & Time : 09:55 AM September 06, 2019
-
హీరోయిన్ శ్రద్దా శ్రీనాధ్ పాత్ర పరిచయమైంది. మొదటి చూపులోనే ఆది ఆమెతో ప్రేమలో పడ్డాడు. సన్నివేశాలు కొంచెం ఆహ్లాదంగా సాగుతున్నాయి.
Date & Time : 09:48 AM September 06, 2019
-
ఆది బాల్యానికి సంబంధిచిన సన్నివేశాలు నడుస్తున్నాయి. క్రికెట్ బెట్టింగ్ వ్యసనపరుడిగా నరేష్ కనిపిస్తున్నాడు.
Date & Time : 09:40 AM September 06, 2019
-
ఓ సింపుల్ ఇంట్రడక్షన్ సన్నివేశంతో హీరో ఆది పాత్ర పరిచయమైంది. ఆయన తన తండ్రి చర్యల పట్ల అసహనంగా కనపరుస్తున్నాడు. ఆది గతం గురించి చెవుతుండటంతో మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. నరేష్ పాత్ర కూడా పరిచయం అయ్యింది.
Date & Time : 09:35 AM September 06, 2019
-
హాయ్! 136 నిమిషాల నిడివి గల జోడి మూవీ ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:30 AM September 06, 2019