-
-
సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 06:35 AM April 19, 2019
-
ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ అంతా పూర్తయ్యి 2019కు చేరుకుంది.కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 06:20 AM April 19, 2019
-
భార్య భర్తల నడుమ ఓ ఎమోషనల్ సీన్ నడుస్తుంది.ఇప్పుడు ముంబైతో ఫైనల్స్ మ్యాచ్ మొదలయ్యింది.
Date & Time : 06:05 AM April 19, 2019
-
నాని మరియు శ్రద్దాల మధ్య భార్య భర్తల జీవితానికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:55 AM April 19, 2019
-
మ్యాచులు కొనసాగుతున్నాయి.వీటిని ప్రతిబింబిస్తూ అనిరుద్ అందించిన స్పిరిట్ ఆఫ్ జెర్సీ పాట వస్తుంది.
Date & Time : 05:42 AM April 19, 2019
-
రంజీ టీమ్ కు నాని ఎంపిక అయ్యారు.హైదరాబాద్ మరియు తమిళనాడు మధ్య మొదటి మ్యాచ్ మొదలయ్యింది.
Date & Time : 05:35 AM April 19, 2019
-
ఇంటర్వెల్ అనంతరం కొత్త కోచ్ గా మరియు జట్టు ఎంపిక విభాగపు సభ్యునిగా సంపత్ ఎంట్రీ ఇచ్చారు.ఆ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 05:20 AM April 19, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : సినిమా సగం పూర్తయ్యే సరికి అంతా బాగానే సాగింది.కానీ నిడివి కాస్త ఎక్కువ కావడం వలన అక్కడక్కడా కాస్త నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది.నాని మాత్రం అద్భుత నటనను కనబర్చారు.సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 05:10 AM April 19, 2019
-
నాని అద్భుత ఎమోషనల్ నటనతో సినిమా సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.
Date & Time : 05:08 AM April 19, 2019
-
మ్యాచ్ పూర్తయ్యింది.ఇప్పుడు కొన్ని భావోద్వేగపూరిత కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:55 AM April 19, 2019
-
మళ్లీ పదేళ్ల తర్వాత నాని ఒక చారిటీ మ్యాచ్ కోసం తన ప్రాక్టీస్ మొదలు పెట్టారు.ఇప్పుడు ప్రపంచమే అలా పాట వస్తుంది.
Date & Time : 04:41 AM April 19, 2019
-
ఇప్పుడు నాని మరియు అతని స్నేహితుల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:32 AM April 19, 2019
-
కొన్ని చక్కని సన్నివేశాల నడుమ నాని మరియు శ్రద్ధాలకు పెళ్లి అనంతరం ఇద్దరి మధ్య అదేంటో గాని ఉన్నపాటుగా పాట వస్తుంది.
Date & Time : 04:25 AM April 19, 2019
-
ఇప్పుడు సినిమా మళ్ళీ 1986కి మారింది.ఇప్పుడు హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ పదే పదే వస్తుంది.
Date & Time : 04:15 AM April 19, 2019
-
నాని మరియు అతని స్నేహితుల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 04:08 AM April 19, 2019
-
అర్జున్(నాని) మరియు తన కొడుకు మధ్య కొన్ని చూడచక్కని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.క్రికెట్ కోచ్ గా సత్యరాజ్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 04:00 AM April 19, 2019
-
1986 వ సంవత్సరంలో ఫ్లాష్ బ్యాక్ కు సినిమా చేరుకుంది.ఒక క్రికెట్ స్టేడియం లో నాని మరియు శ్రద్ధా పాత్రలు పరిచయం అయ్యాయి.ఇప్పుడు కథ 1996 కి మారింది.
Date & Time : 03:56 AM April 19, 2019
-
ఇప్పుడు సినిమా న్యూయార్క్ నగరానికి చేరుకుంది.నాని జీవితంపై జెర్సీ అనే పుస్తకం రాయడానికి సంబందించిన సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 03:53 AM April 19, 2019
-
రోడ్డు ప్రయాణంలో జాగ్రత్త తీసుకోమని చెప్పే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 03:48 AM April 19, 2019
-
హాయ్..160 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 03:46 AM April 19, 2019