-
సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:25 AM March 11, 2021
-
ఇప్పుడు క్లైమాక్స్ టైం..సినిమాలో మెయిన్ ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అయ్యింది. కోర్ట్ రూమ్ లో ప్లాన్ చేసిన క్లైమాక్స్ ఎపిసోడ్ హిలేరియస్ గా మరో లెవెల్లో ఉంది. ప్రేక్షకులు అంతా ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
Date & Time : 11:15 AM March 11, 2021
-
మరో కోర్ట్ సీన్ ఇప్పుడు నడుస్తుంది. నవీన్ మాత్రం హిలేరియస్ గా కనిపిస్తున్నాడు. ఇలా సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 11:00 AM March 11, 2021
-
ఇప్పుడు స్క్రీన్ పైకి నటుడు బ్రహ్మాజీ ఎంటర్ అయ్యాడు. వాళ్ళని కాపాడే రోల్ లో కనిపిస్తున్నాడు. అంతే కాకుండా తనపై కామెడీ కూడా చాలా బాగుంది.
Date & Time : 10:55 AM March 11, 2021
-
ఈ ముగ్గురు స్నేహితులు తమ కేసుకు సంబంధించి ఒక ఫోన్ ను మెయిన్ క్లూ గా కనుకున్నే ప్రయత్నం చేస్తున్నారు. నవీన్ మాత్రం తన రోల్ లో సూపర్బ్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 10:40 AM March 11, 2021
-
ఇప్పుడే ఆ ముగ్గురూ కావాలని ఇరికించబడ్డారని తెలుసుకుంటున్నారు. తప్పించుకొని తాము నిరపరాధులు అని ప్రూవ్ చేసుకోడానికి ట్రై చేస్తున్నారు.
Date & Time : 10:30 AM March 11, 2021
-
కోర్ట్ లో ఇప్పుడు ఒక హిలేరియస్ ఎపిసోడ్ వస్తుంది. బ్రహ్మానందం కామెడీ ఓ రేంజ్ లో ఉంది.
Date & Time : 10:25 AM March 11, 2021
-
ఈ ముగ్గురూ ఆ మర్డర్ కేసులో పూర్తిగా ఇరుక్కుపోయారు. ఇప్పుడు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు జడ్జిగా ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 10:15 AM March 11, 2021
-
ఇంటర్వెల్ అనంతరం, ఇప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు ఇంటరాగేట్ చెయ్యబడుతున్నారు. ఈ సినిమా అంతా మంచి సెటైరికల్ కామెడీగా కనిపిస్తుంది. ప్రతీ సీరియస్ సీన్ కూడా మంచి ఫన్ జనరేట్ చేస్తుంది.
Date & Time : 10:10 AM March 11, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు ఆశించిన మంచి కామెడీ ఇందులో కనిపించింది. సాంగ్స్, సిచుయేషనల్ కామెడీ కూడా బాగుంది. సెకండాఫ్ నుంచి అసలు కథలోకి సినిమా ఎంటర్ అవుతుంది. మరి ఇక్కడ నుంచి డీలింగ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:00 AM March 11, 2021
-
ఇప్పుడు ఇంటర్వెల్ టైం..ఆ స్పోర్ట్స్ మినిస్టర్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ని ఇరికించాడు. ఈ పాయింట్ తో సినిమా ఇప్పుడు ఇంటర్వెల్ కు వచ్చింది. ఇప్పుడు విరామం.
Date & Time : 09:50 AM March 11, 2021
-
ఇప్పుడు కథనంలో ఒక పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ మర్డర్ జరగడంతో ముగ్గురూ స్టక్ అయ్యారు. ఇలా సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 09:45 AM March 11, 2021
-
ఇందులో మరోపక్క ఓ స్పోర్ట్స్ మినిష్టర్ కు సంబంధించి క్రైమ్ కోసం కూడా వస్తుంది. ఇప్పుడు శుభలేఖ సుధాకర్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 09:40 AM March 11, 2021
-
హీరోయిన్ కూడా నవీన్ ప్రేమలో పడింది. ఇప్పుడు ఈ సినిమా హిట్ ట్రాక్ చిట్టి స్టార్ట్ అయ్యింది. మంచి ఫన్ విజువల్స్ లిరిక్స్ బాగున్నాయి.
Date & Time : 09:30 AM March 11, 2021
-
ఇప్పుడు మురళీ శర్మ కూడా ఎంటర్ అయ్యారు. అలాగే నవీన్, ఫరియా ల మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి. ఈ కామెడీ బాగుంది.
Date & Time : 09:20 AM March 11, 2021
-
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. నవీన్ ఫస్ట్ సైట్ లోనే ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు నరేష్ కూడా యాడ్ అయ్యారు.
Date & Time : 09:15 AM March 11, 2021
-
ఈ ముగ్గురూ ఇప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. సందర్భానుసారం వస్తున్న కామెడీ బాగుంది.
Date & Time : 09:05 AM March 11, 2021
-
ఇప్పుడు ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణలు నవీన్ ఫ్రెండ్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు జాతి రత్నాలు టైటిల్ సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 08:55 AM March 11, 2021
-
జోగిపేట్ శ్రీకాంత్ గా నవీన్ పొలిశెట్టి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. సర్ప్రైజింగ్.. కీర్తీ సురేష్ కూడా కనిపిస్తుంది..
Date & Time : 08:50 AM March 11, 2021
-
హాయ్..147 నిమిషాలు నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 08:45 AM March 11, 2021