మొదటి షో వివరాలు : 'జన నాయకుడు'
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. ఒక నీట్ ఫేర్వెల్ తో విజయ్ సినిమా కెరీర్ ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
బాబీ డియోల్ తన ప్లాన్ ని అమలు చేయడం స్టార్ట్ చేసాడు. మొత్తం రాష్ట్రం, ప్రభుత్వం పరిష్కారం కోసం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు విజయ్, బాబీని ఆపేందుకు రంగంలోకి దిగాడు.
కథ మళ్ళీ ప్రెజెంట్ లోకి వచ్చింది. విజయ్, మమిత ఆలోచనను మారుస్తాడు. ఇంకోవైపు, దేశాన్ని నాశనం చెయ్యాలని బాబీ డియోల్ వేసిన ప్లాన్ను బయటపెట్టే పనిలో విజయ్ ఉన్నాడు.
కొన్ని ఇంట్రెస్టింగ్ మలుపులు తర్వాత ఫైనల్ గా విజయ్, బాబీలు నేరుగా కలిసిన ఫేస్ ఆఫ్ సీన్ వస్తుంది. ఇక్కడ నుంచి కథనం మరింత రసవత్తరంగా మారుతుంది.
ఇప్పుడు విజయ్ పోలీసు అధికారిగా ఓ మాసివ్ యాక్షన్ బ్లాక్ తో ఈ ఎంట్రీ ఇచ్చాడు.
ఇంటర్వెల్ అనంతరం.. ఇప్పుడు కథనం 2005 మదురైలో మొదలైంది. కొత్త విలన్ తో ఓ ట్రాజెడీ సీక్వెన్స్ వస్తుంది.
ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పటివరకు కథనం డీసెంట్ గా యాక్షన్, ఎమోషన్స్ కలయికతో సాగింది. విజయ్ ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. దాదాపు భగవంత్ కేసరి లైన్స్ లోనే సినిమా సాగింది. సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
ఒక చిన్న ట్విస్ట్ తో విజయ్, బాబీ డియోల్ ల మొదటి ఫేస్ ఆఫ్ సీక్వెన్స్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
ఒక హై వోల్టేజ్ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ ఇపుడు వస్తుంది. విజయ్ ఫ్యాన్స్ కి ఇదొక మాస్ ఫీస్ట్.
ఇప్పుడు కథనం సీరియస్ గా మారుతుంది. విజయ్ ఇన్వెస్టిగేషన్ లో బాబీ మిషన్ కోసం కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో మమితా లైఫ్ రిస్క్ లో పడింది.
ఇప్పుడు బాబీ డియోల్ భారత్ ను నాశనం చేసేందుకు ఓ ప్లాన్ చేస్తున్నాడు. ఇంకోపక్క విజయ్, మమితాకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ నుంచి కథనం దళపతి కచేరి సాంగ్ కి షిఫ్ట్ అయ్యింది.
మరికొన్ని సంఘటనలు తర్వాత మమితా బైజు, పూజా హెగ్డేలు ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు. దీనికి ముందే విజయ్ పై క్రేజీ ఎలివేషన్ సీన్ వచ్చింది.
ఇప్పుడు కొన్ని ఎమోషనల్ సీన్స్ తర్వాత విలన్ బాబీ డియోల్ ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది.
ఓ టెర్రిఫిక్ టైటిల్ కార్డుతో సీఎం విజయ్ పేరు పరిచయం తర్వాత మాస్ ఫైట్ సీక్వెన్స్ తో జైల్లో విజయ్ ఎంట్రీ ఇచ్చాడు.
హాయ్.. తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం జన నాయకుడు (జన నాయగన్) మంచి బజ్ తో ఇప్పుడు థియేటర్స్ లోకి వచ్చింది. 3 గంటల 3 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.