-
-
చిత్రం పూర్తయింది..పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 06:21 AM September 21, 2017
-
ఆసక్తికరమైన ఫ్యామిలీ ఎమోషన్ సీన్ తో చిత్రం చివరి దశకు చేరుకుంది.
Date & Time : 06:17 AM September 21, 2017
-
చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. చిత్రంలో ట్విస్ట్ రివీల్ అయింది.
Date & Time : 06:10 AM September 21, 2017
-
అన్నదమ్ముల మధ్య వస్తున్న సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
Date & Time : 06:05 AM September 21, 2017
-
ట్రైలర్ చూపిన పాపులర్ డైలాగ్ ఘట్టమేదైనా.. పాత్రేదైనా నేను రె..రెడీ అని చెప్పే సీన్ వస్తోంది.
Date & Time : 06:00 AM September 21, 2017
-
తమన్నా గ్లామర్, డాన్స్ మూమెంట్స్ ఆడియన్స్ కి కన్నుల విందుగా ఉన్నాయి. ఎన్టీఆర్ ని రావణగా చూస్తున విధానం కూడా చాలా బావుంది.
Date & Time : 05:57 AM September 21, 2017
-
మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ 'స్వింగ్ జరా' వస్తోంది.
Date & Time : 05:52 AM September 21, 2017
-
అన్నదమ్ముల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఉత్కంఠ భరిత సన్నివేశాలు వస్తున్నాయి. జై ఇంకా వైలెంట్ గా మారుతున్నాడు.
Date & Time : 05:48 AM September 21, 2017
-
చిత్రంలో ఇప్పుడు సూపర్ హిట్ మెలోడీ సాంగ్ 'నీ కళ్లలోన' వస్తోంది.
Date & Time : 05:42 AM September 21, 2017
-
చిత్రం మళ్లీ ప్రజెంట్ డే కి వచ్చింది. రైతులకు సంబందించిన ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:37 AM September 21, 2017
-
చిత్రం మరలా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లింది. ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:29 AM September 21, 2017
-
ముగ్గురు అన్నదమ్ములు ఒక చోట కలిశారు. జై, లవ మరియు కుశ లని ఒకే ఫ్రేమ్ లో చూడడం చాలా బావుంది.
Date & Time : 05:24 AM September 21, 2017
-
జై సరికొత్త శక్తిగా అవతరించాడు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ముగిశాయి.
Date & Time : 05:18 AM September 21, 2017
-
చిత్రంలో మరో హీరోయిన్ నివేద థామస్ 'సిమ్రన్' గా ఎంట్రీ ఇచ్చింది. లీడ్ పెయిర్ మధ్య పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:14 AM September 21, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. జై గురించిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తున్నాయి. రావణ సాంగ్ తో జై పాత్రని అద్భుతంగా చూపిస్తున్నారు.
Date & Time : 05:11 AM September 21, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : లవ, కుశ పాత్రలతో సాగిన ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది. ఇంటర్వెల్ సన్నివేశంలో జై పాత్రని అద్భుతంగా పరిచయం చేశారు. ఫస్ట్ హాఫ్ లో హైలైట్ గా నిలిచిన సీన్ ఇదే.
Date & Time : 05:06 AM September 21, 2017
-
అద్భుతమైన ఫైట్ సీన్ తరువాత ఇంటర్వెల్ పడింది.
Date & Time : 05:03 AM September 21, 2017
-
థియేటర్ మొత్తం ఫాన్స్ ఉత్సాహం ఉరకలు వేస్తోంది.
Date & Time : 05:00 AM September 21, 2017
-
అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న జై పాత్ర పరిచయానికి సంబందించిన సీన్ మొదలైంది. రావణగా జై పాత్రలో ఎన్టీఆర్ అద్భుతమైన ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 04:58 AM September 21, 2017
-
చిత్రంలో ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది. కొన్ని ఉత్కంఠ భరితమైన సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:54 AM September 21, 2017
-
లవ, రాశి ఖన్నా మధ్య రొమాంటిక్ సీన్స్ తరువాత హిట్ సాంగ్ 'ట్రింగ్ ట్రింగ్' మొదలైంది.
Date & Time : 04:47 AM September 21, 2017
-
ప్రస్తుతం ఫైట్ సీన్ వస్తోంది. కుశ పాత్రలో ఎన్టీఆర్ చాలా బాగా నటిస్తున్నాడు.
Date & Time : 04:43 AM September 21, 2017
-
పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి ఎంట్రీ ఇచ్చాడు. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 04:40 AM September 21, 2017
-
కమెడియన్లు బ్రహ్మాజీ, ప్రభాస్ శీనులు ఎంట్రీ ఇచ్చారు. మరికొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:35 AM September 21, 2017
-
ప్రస్తుతం బ్యాంకుకు సంబందించిన కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:31 AM September 21, 2017
-
నటి నందిత కూడా సీన్ లో జాయిన్ అయింది. ప్రస్తుతం ఎంగేజ్ మెంట్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:23 AM September 21, 2017
-
హీరోయిన్ రాశి ఖన్నా ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్, రాశి మధ్య పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:19 AM September 21, 2017
-
ఎన్టీఆర్ మరో పాత్ర లవ పరిచయం కూడా జరిగింది. లవ తన కథ ని వివరిస్తున్నాడు. హంసా నందిని సీన్ లోకి ఎంటర్ అయింది.
Date & Time : 04:14 AM September 21, 2017
-
ఎన్టీఆర్ కుశ పాత్రతో పరిచయం అయ్యాడు. 'దోచేస్తా' సాంగ్ మొదలు కావడంతో ఆడియన్స్ ఉత్సాహం పెరిగింది.
Date & Time : 04:04 AM September 21, 2017
-
కొన్ని అవమానకర ఘటనలు సమాజంపై జై అభిప్రాయం మారేలా చేస్తున్నాయి. ఉత్కంఠ భరితమైన సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 03:59 AM September 21, 2017
-
పోసాని కృష్ణ మురళి పాత్రతో తొలి సన్నివేశం మొదలైంది. జై, లవ మరియు కుశ ల చిన్ననాటి సన్నివేశాలు చూపిస్తున్నారు.
Date & Time : 03:50 AM September 21, 2017
-
రోడ్డు ప్రమాదాలపై ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మెసేజ్ వచ్చింది. చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ కు అంకితం చేశారు.
Date & Time : 03:45 AM September 21, 2017
-
158 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది. అభిమానుల ఉత్సాహానికి అవధులు లేకుండా ఉంది.
Date & Time : 03:40 AM September 21, 2017
-
భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఎన్టీఆర్ జై లవ కుశ చిత్రం మరి కొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది. లైవ్ అప్డేట్స్ మీకు అందిస్తున్నాము.
Date & Time : 03:25 AM September 21, 2017