-
ఇప్పుడు మరొక చిన్న ట్విస్ట్ ద్వారా సినిమా ముగింపు దశకు వచ్చింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 06:50 AM February 28, 2020
-
నిందితుడుతో జరిపిన ఇంటరాగేషన్ అనంతరం విక్రమ్ కు ఒక క్లియర్ క్లారిఫికేషన్ కు వచ్చాడు.
Date & Time : 06:45 AM February 28, 2020
-
హీరో తనకు దొరికిన క్లూ ద్వారా అనుమానితుడు వరకు వెళ్లగలిగాడు.ఇద్దరి మధ్య ఇప్పుడొక ఫైట్ సీన్ వస్తుంది.
Date & Time : 06:30 AM February 28, 2020
-
ఇప్పుడు విక్రమ్ మరో క్లూ కనుక్కున్నాడు.మరిన్ని ఆసక్తికర సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 06:20 AM February 28, 2020
-
ఇప్పుడు కథనంలో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది.మరింత వేగంగా సాగే ఇన్వెస్టిగేటివ్ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 06:10 AM February 28, 2020
-
ప్రస్తుతం సీన్స్ లో విశ్వక్ ఆ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఓ క్లూ కనుక్కున్నాడు.ఇప్పుడు మరిన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:55 AM February 28, 2020
-
ఇంటర్వెల్ అనంతరం ఇప్పుడు విక్రమ్ గతానికి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:45 AM February 28, 2020
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఆసక్తికర కథనం మరియు మరింత ఆసక్తికర ఇన్వెస్టిగేషన్ సీన్స్ తో నడించింది.దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత ఆకర్షణగా నిలవడం విశేషం.అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండాఫ్ పై మరింత ఆసక్తిని తీసుకొచ్చేలా ఉందని చెప్పాలి.మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 05:40 AM February 28, 2020
-
కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కీలక సమయంలో విశ్వక్ ప్యానిక్ అటాక్ వల్ల అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు.ఇప్పుడు విరామం.
Date & Time : 05:35 AM February 28, 2020
-
విశ్వక్ ఇప్పుడు ఒక అనుమానితుడిని తడుముతున్నాడు.చిన్న ఫైట్ సీన్ ఇప్పుడు వస్తుంది.
Date & Time : 05:30 AM February 28, 2020
-
ఇప్పుడు హీరోయిన్ హరిప్రియ కథలోకి ఎంటర్ అయ్యింది.ప్రీతీ కేసుకు సంబంధించి కొన్ని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 05:22 AM February 28, 2020
-
హీరోయిన్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలోనే విశ్వక్ దగ్గరకు మిస్సయిన మరో అమ్మాయి ప్రీతీ కేసు వచ్చింది.ఇప్పుడు విశ్వక్ ఆ కేసుపై ఫోకస్ పెట్టాడు.మరిన్ని గ్రిప్పింగ్ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 05:16 AM February 28, 2020
-
ఆసక్తికర సన్నివేశాలతో కూడిన అద్భుతమైన స్క్రీన్ ప్లే ఇప్పుడు నడుస్తుంది.
Date & Time : 05:10 AM February 28, 2020
-
ఆ అమ్మాయి తప్పిపోయినట్టుగా ఆమె తలిదండ్రులు కేసు వేశారు దీనిని మురళీ శర్మ ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మరోపక్క హీరోయిన్ కూడా మిస్సయ్యింది.ఈ కేసును విశ్వక్ టేకప్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నాడు.
Date & Time : 05:05 AM February 28, 2020
-
ఇప్పుడు ట్రైలర్ లో చూపించిన అమ్మాయి కారు ఆగిపోయిన సీన్ వస్తుంది.మరిన్ని సస్పెన్స్ తో కూడిన సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:00 AM February 28, 2020
-
ఇప్పుడు సీనియర్ నటుడు బాల చందర్ విశ్వక్ హైయర్ అధికారిగా పరిచయం అయ్యారు.మరిన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:55 AM February 28, 2020
-
ఇప్పుడు ఒక భిన్నమైన క్రైమ్ సీన్ వస్తుంది.ఇక్కడే నటుడు బ్రహ్మాజీ మరియు హీరోయిన్ రుహాని శర్మలు పోలీసులుగా పరిచయం అయ్యారు.
Date & Time : 04:50 AM February 28, 2020
-
ఇప్పుడు సినిమా రిలీజ్ కు ముందు విడుదల చేసిన స్నీక్ పీక్ సీన్ వస్తుంది.
Date & Time : 04:45 AM February 28, 2020
-
విశ్వక్ ప్యానిక్ అటాక్ డిజార్డర్ తో బాధపడుతున్నాడు.చిన్న చికిత్స చేసే సన్నివేశం వస్తుంది.
Date & Time : 04:41 AM February 28, 2020
-
ఒక ఇంట్రాగేషన్ టైప్ సన్నివేశంతో సినిమా ఇప్పుడే మొదలయ్యింది.హీరో విశ్వక్ సేన్ దేని కోసమో చాలా ఆతృతగా వెతుకుతున్నాడు.
Date & Time : 04:38 AM February 28, 2020
-
హాయ్..126 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:35 AM February 28, 2020