-
ఫైనల్ గా శీను తన సోల్ మెట్ జున్ను ని కలుసుకున్నాడు.. సినిమా హ్యాపీ నోట్ తో ఎండ్ అయ్యింది.. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 06:15 AM December 22, 2017
-
సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.. ఈ సమయంలో శీను అండ్ జున్ను కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 06:10 AM December 22, 2017
-
అజయ్ డెన్ లో కామెడీ ఫైట్ తరువాత ... ఇప్పుడు అఖిల్ తన సోల్ మెట్ కోసం సెర్చ్ చేస్తున్నాడు..
Date & Time : 06:02 AM December 22, 2017
-
ఈ చిత్రం కథ మళ్లీ ప్రస్తుతంలోకి వచ్చింది.. ఇప్పుడు అజయ్ గ్యాంగ్ అఖిల్ ని కిడ్నాప్ చేశారు.
Date & Time : 05:56 AM December 22, 2017
-
ఇప్పుడే మరొక పాట మెరిసే మెరిసే వస్తోంది ... ఒక వివాహ కార్యక్రమం సందర్భంగా వస్తోన్న ఈ పాట చాలా కలర్ ఫుల్ గా ఉంది.
Date & Time : 05:50 AM December 22, 2017
-
ఇప్పుడే మళ్లీ చిత్రం యొక్క కథాంశం శీను-జున్నూ (ప్రధాన జంట యొక్క చిన్ననాటి పేర్లు) ఎపిసోడ్ తో పరస్పర సంబంధం కలిగి ఉంది ... కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు తెరపై అలరిస్తున్నాయి
Date & Time : 05:46 AM December 22, 2017
-
కొన్ని సీన్స్ తరువాత ఇంకొక సూపర్ హిట్ సాంగ్ ఏవేవో వస్తోంది..అఖిల్ ఈ పాట పాడాడు..
Date & Time : 05:38 AM December 22, 2017
-
ఇప్పుడు కళ్యాణి మరియు రమ్య కృష్ణ మధ్య కొన్ని కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి...
Date & Time : 05:30 AM December 22, 2017
-
మొదటి సారి హీరో హీరోయిన్ ఇద్దరు ఒకరికి ఒకరు తెలియని వ్యక్తులుగా కలుసుకున్నారు..
Date & Time : 05:22 AM December 22, 2017
-
ఇంటర్వెల్ తరువాత కొన్ని కారణాల వల్ల విలన్ గ్యాంగ్ అఖిల్ పై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు..
Date & Time : 05:20 AM December 22, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటివరకు ఈ చిత్రం బాగానే ఉంది.. అందమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు చాలా ఆకట్టుకున్నాయి. మధ్యలో వచ్చిన కొన్ని చేజ్ సీక్వెన్స్ మరియు రెండు పాటలు ఫస్ట్ హాఫ్ లో హైలైట్ గా నిలిచాయి.
Date & Time : 05:15 AM December 22, 2017
-
కొన్ని ఉత్కంఠభరితమైన యాక్షన్ చేజ్ సీక్వెన్స్ తరువాత ఈ చిత్రం సగానికి పూర్తయ్యింది ... ఇప్పుడు ఇంటర్వెల్ పడింది
Date & Time : 05:10 AM December 22, 2017
-
సినిమా కథ ఫ్లాష్ బ్యాక్ నుంచి మళ్లీ ప్రస్తుతం లోకి వచ్చింది.. ఇప్పుడు అఖిల్ కి సంబంధించిన చేజ్ సీన్స్ వస్తున్నాయి.. అఖిల్ అద్భుతమైన స్టంట్స్ తో చాలా ఆకట్టుకుంటున్నాడు
Date & Time : 05:06 AM December 22, 2017
-
తనదైన శైలిలో ఎమోషనల్ సీన్స్ ను తెరకెక్కించే దర్శకుడు విక్రమ్ కుమార్ అదే తరహాలో ఇప్పుడు ఈ సినిమాతో కూడా ఆకట్టుకుంటున్నాడు.. ప్రస్తుతం క్యూట్ ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 04:58 AM December 22, 2017
-
కొన్ని కుటుంబ సన్నివేశాల తరువాత చివరకు చిన్నారులు అఖిల్, కల్యాణి ప్రియదర్శన్ పెరిగి పెద్దవారయ్యారు..
Date & Time : 04:54 AM December 22, 2017
-
ఇద్దరు చిన్నారులు కొన్ని పరిస్థితుల వలన విడిపోవాల్సి వస్తుంది.. ప్రస్తుతం తలచి తలచి అనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కొన్ని మంచి సీన్స్ తెరపై ఆకర్షిస్తున్నాయి.
Date & Time : 04:48 AM December 22, 2017
-
ప్రముఖ నటులు జగపతి బాబు మరియు రమ్య కృష్ణ హీరోయొక్క తల్లిదండ్రులుగా పరిచయం చేయబడుతున్నారు ....
Date & Time : 04:42 AM December 22, 2017
-
సాంగ్ లో పిల్లల మధ్య మంచి బంధం ఏర్పడింది.. ప్రస్తుతం కొన్ని భావోద్వేగాలతో కూడిన సీన్స్ వస్తున్నాయి
Date & Time : 04:40 AM December 22, 2017
-
కొన్ని క్యూట్ సీన్స్ తరువాత ఇప్పుడు అనగనగా ఒక ఊరు అనే సాంగ్ వస్తోంది
Date & Time : 04:36 AM December 22, 2017
-
కథలో ఒక చిన్న ట్విస్ట్.. సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది. దర్శకుడు విక్రమ్ విభిన్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటోంది ... ఇప్పుడు కొన్ని పిల్లల సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 04:28 AM December 22, 2017
-
అఖిల్ సాంగ్ తో చాలా ఆకట్టుకున్నాడు.. ప్రస్తుతం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్ తో కూడిన సీన్స్ వస్తున్నాయి..అఖిల్ తన మొబైల్ కోసం చేజ్ చేస్తున్నాడు
Date & Time : 04:22 AM December 22, 2017
-
అక్కినేని అఖిల్ హలో టైటిల్ సాంగ్ తో ఇప్పుడే సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు..
Date & Time : 04:16 AM December 22, 2017
-
ఇప్పుడు చిత్రం అక్కినేని నాగార్జున యొక్క వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయ్యింది.
Date & Time : 04:14 AM December 22, 2017
-
చిరంజీవికి మరియు అనేకమంది ప్రముఖులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ సినిమా స్టార్ట్ అయ్యింది.. ఏఎన్నార్ లైవ్స్ ఆన్ క్లిప్ కూడా వస్తోంది
Date & Time : 04:12 AM December 22, 2017
-
హాయ్..131 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది
Date & Time : 04:09 AM December 22, 2017