-
వివరణాత్మక సమీక్ష కోసం ఇక్కడ చూస్తూ ఉండండి.
Date & Time : 01:24 AM June 14, 2024
-
హరోం హరతో సుధీర్ బాబు "నవ దళపతి" అనే కొత్త ట్యాగ్‌ని పొందారు. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత సినిమా ముగుస్తుంది.
Date & Time : 01:14 AM June 14, 2024
-
కుప్పంలో విలన్లు నరమేధం సృష్టించారు. సుధీర్ బాబు తన శత్రువులను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
Date & Time : 01:04 AM June 14, 2024
-
సుధీర్ బాబు గన్ లను తయారు చేసే వ్యాపారం చేస్తున్నాడని అక్షర గౌడ కి అనుమానం వస్తుంది. ఆమె ఇతర పోలీసులతో కలిసి సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించింది.
Date & Time : 12:48 AM June 14, 2024
-
ఒక కీలక సన్నివేశంలో సూపర్‌స్టార్ కృష్ణ గారి చిన్న ప్రస్తావన వచ్చింది. ఈ సీన్ కి మరియు హాల్ మొత్తం దద్దరిల్లింది.
Date & Time : 12:32 AM June 14, 2024
-
కుప్పంలో సుధీర్ బాబు ఒక పవర్ ఫుల్ వ్యక్తి గా మారాడు. అక్కడి ప్రజలందరి మద్దతును పొందుతాడు.
Date & Time : 12:25 AM June 14, 2024
-
సెకండాఫ్ మరో మాస్ మూమెంట్ తో స్టార్ట్ అయ్యింది. చైతన్ భరద్వాజ్ సంగీతం చాలా బాగుంది.
Date & Time : 12:15 AM June 14, 2024
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటి వరకు సినిమా డీసెంట్ గా బాగానే ఉంది. మొదటి గంటలో గన్స్మిత్గా కథానాయకుడి ఎదుగుదల కనిపిస్తుంది. మాస్ మూమెంట్లు ఎఫెక్టివ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో బాగా ఎగ్జిక్యూట్ చేయబడ్డాయి. కొన్ని సన్నివేశాల్లో స్క్రీన్ ప్లే చాలా స్లో గా సాగింది. సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 12:05 AM June 14, 2024
-
హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమా ఇంటర్వల్ కి చేరుకుంది.
Date & Time : 11:50 PM June 13, 2024
-
గన్ వ్యాపారం ఆగిపోయే పరిస్థితి వస్తుంది. నష్టాన్ని నివారించడానికి సుధీర్ బాబు ఒక ప్లాన్‌తో వస్తాడు.
Date & Time : 11:40 PM June 13, 2024
-
తాను గన్ తయారీ వ్యాపారంలో ఉన్నానని సుధీర్ బాబు మాళవిక కు చెప్పాడు. ఆమె స్పందన చూసి సుధీర్ బాబు ఆశ్చర్యపోయాడు.
Date & Time : 11:30 PM June 13, 2024
-
సుధీర్ బాబు మరియు సునీల్ గన్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. వ్యాపారాన్ని స్టార్ట్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Date & Time : 11:20 PM June 13, 2024
-
సుధీర్ బాబు, జయప్రకాష్, మరియు మాళవిక శర్మలు పాల్గొన్న కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:06 PM June 13, 2024
-
అనుకోని విధంగా సుధీర్ బాబు చిక్కుల్లో పడ్డాడు. ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ ని నీట్ గా డిజైన్ చేసారు.
Date & Time : 10:56 PM June 13, 2024
-
సుధీర్ బాబు జీవనోపాధి కోసం కుప్పం వచ్చాడు. అతని ఎంట్రీ సింపుల్ గా ఉన్నా, చాలా ఎఫెక్టివ్ గా ఉంది. హరోం హర టైటిల్ సాంగ్‌కి సమయం ఆసన్నమైంది.
Date & Time : 10:48 PM June 13, 2024
-
సుధీర్ బాబు స్నేహితుడిగా సునీల్ పరిచయం అయ్యాడు. తన స్నేహితుడి మంచి పనుల గురించి పోలీసులకు వివరిస్తున్నాడు.
Date & Time : 10:40 PM June 13, 2024
-
హాయ్, 153 నిమిషాల (2 గంటల 33 నిమిషాలు) నిడివి గల హరోం హర ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 10:30 PM June 13, 2024