
మొదటి షో వివరాలు : "హరిహర వీరమల్లు"
ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
ఫ్లాష్‌బ్యాక్ ముగియడంతో తిరిగి తన లక్ష్యం కోసం వీరమల్లు ప్రయత్నిస్తుంటాడు. ఇక ఇప్పుడు మరో ఇంటెన్స్ మూమెంట్ కొనసాగుతోంది.
ఒక ఎమోషనల్ సీక్వెన్స్ తర్వాత వీరమల్లుకి సంబంధించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అతడి గతానికి సంబంధించి కొన్ని సీన్స్ వస్తున్నాయి.
కొన్ని సీన్స్ తర్వాత నిధి తిరిగి వచ్చింది. ఇప్పుడు ‘తార తార’ పాట వస్తోంది.
సెకంఢాఫ్‌లో కథ ఢిల్లీకి షిఫ్ట్ అవుతుంది. వీరమల్లు తాను అనుకున్న ప్లాన్‌ను అమలు చేస్తుంటాడు.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకోగా పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్‌తో ఇరగదీశాడు. నిధి అగర్వాల్ పర్వాలేదు. కీరవాణి తన సంగీతంతో మెప్పించారు. సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
పవన్ కళ్యాణ్ కోహినూర్ వజ్రం గురించి తెలుసుకుంటాడు. ఇక ఓ కష్టతరమైన లక్ష్యాన్ని తనకు అప్పగిస్తారు. ఇప్పుడు ఇంటర్వెల్‌కు టైమ్ అయింది.
తాను అనుకున్న విధంగా వపన్ తన ప్లాన్‌ను అమలు చేస్తాడు. ఇక చార్మినార్ ఫైట్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఈ ఫైట్ అనంతరం ఓ ట్విస్ట్ వస్తుంది.
పవన్ కళ్యాణ్ ఓ లక్ష్యం కోసం సునీల్, సుబ్బరాజు, నాజర్‌లను తీసుకొస్తాడు. కొన్ని కామెడీ సీన్స్ తర్వాత ‘కొల్లగొట్టినాదిరో’ సాంగ్ వస్తుంది.
మరో అద్భుతమైన ఎలివేషన్‌తో పవన్ కళ్యాణ్ కుస్తీ ఫైట్‌లో ఇరగదీశాడు. పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ కూడా పరిచయం అయింది.
ఔరంగజేబు గా తన క్రూరత్వాన్ని పరిచయం చేసిన బాబీ డియోల్ తర్వాత.. ఒక టెర్రిఫిక్ యాక్షన్ సీక్వెన్స్‌తో హరిహర వీరమల్లు గా మాస్ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్‌కు సంబంధించి పవర్‌ఫుల్ టైటిల్ కార్డ్ తర్వాత ఈ చిత్ర కథ 1650 కాలంలో కొల్లూర్ గనుల్లో ప్రారంభం అవుతుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీకి రంగం సిద్దం అయ్యింది.
హాయ్.. 2 గంటల 43 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.. ఎపిక్ రైడ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ గ్రాండ్ ప్రీమియర్ షో కిక్కిరిసిన అభిమానులతో, పవన్ నామస్మరణతో ఘనంగా ప్రారంభం కానుంది.