-
-
సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 10:55 AM July 28, 2018
-
ఫైనల్ క్లైమాక్స్ లో నిహారిక అద్భుతంగా నటించింది. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. ఇక చివరికి సొంతంగా తన ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకుంది.
Date & Time : 10:48 AM July 28, 2018
-
వివాహానికి సమయం దగ్గరపడుతుండగా పరిస్థితులు సీరియస్ గా మారాయి. ఆసక్తికరమైన సన్నివేశాలు తెరపై ఆకట్టుకుంటున్నాయి. సినిమా క్లైమాక్స్ దశకు చేరుకుంటోంది.
Date & Time : 10:40 AM July 28, 2018
-
పెళ్లికి సంబంధించిన ఒక సాంగ్ వస్తోంది. సినిమా కథనానికి తగ్గట్టుగా అన్ని పాటలు ఆకట్టుకునే విధంగా సెట్ చేశారు.
Date & Time : 10:35 AM July 28, 2018
-
పెళ్లి చేసుకోవడానికి హీరోయిన్ ఇప్పటికీ కన్ఫ్యూజన్ లోనే ఉంది. అందుకు సంబంధించిన సీన్స్ ఇప్పుడు ప్రదర్శించబడుతున్నాయి
Date & Time : 10:20 AM July 28, 2018
-
తులసి - మురళి శర్మ నిహారిక తల్లిదండ్రులుగా వారి పాత్రలతో చాలా బాగా అకట్టుకుంటున్నారు.
Date & Time : 10:15 AM July 28, 2018
-
నిహారిక మరియు ఆమె ఆంటీ ఇంద్రజ మధ్య కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:20 AM July 28, 2018
-
ఇప్పుడు ఒక రొమాంటిక్ సాంగ్ వస్తోంది. కెమెరా వర్క్ చాలా బావుంది. నిహారిక సింపుల్ డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తోంది.
Date & Time : 10:12 AM July 28, 2018
-
నరేష్ మరియు మురళి శర్మ మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:05 AM July 28, 2018
-
ఇంటర్వెల్ తరువాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యింది. హీరోయిన్ ను ఆకట్టుకునేందుకు హీరో ఆమె వద్దకు వెళుతున్నాడు.
Date & Time : 10:00 AM July 28, 2018
-
హాఫ్ టైమ్ రిపోర్ట్: మొదటి భాగం లో ఉన్న పాయింట్ చాలా బావుంది. మరియు యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ బావున్నా కథనం నెమ్మదిగా సాగుతుంది. రెండవ భాగం సినిమాకు ప్రధాన బలం.
Date & Time : 09:50 AM July 28, 2018
-
ఇంటర్వెల్ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. నేటి యువతకు సంబంధించిన సమకాలీన మరియు ఆధునిక సంబంధాల ఆధారంగా చిత్రీకరించిన సినిమా. ఒక మంచి పాయింట్ తో సినిమా సగానికి చేరుకుంది.
Date & Time : 09:46 AM July 28, 2018
-
జంట మధ్య ఊహించని విధంగా ఒక సమస్య ఏర్పడింది. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 09:40 AM July 28, 2018
-
ఈ సినిమా మంచి ఫ్యామిలీ మూమెంట్స్ తో ముందుకు సాగుతోంది. నిశ్చితార్థం కుదిరింది. ఎమోషనల్ సీన్స్ రియాలిస్టిక్ గా ఉన్నాయి.
Date & Time : 09:30 AM July 28, 2018
-
నీహారిక చాలా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న పాత్రలో అలరిస్తున్నారు. సినిమా ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది.
Date & Time : 09:20 AM July 28, 2018
-
సుమంత్ అశ్విన్ మరియు నిహరిక ఇద్దరూ కూడా తెరపై అకట్టుకుంటున్నారు.
Date & Time : 09:10 AM July 28, 2018
-
నీహారిక ప్రవర్తనకు సంబంధించిన కొన్ని మంచి సన్నివేశాలు ఇప్పుడు ప్రదర్శించబడుతున్నాయి.
Date & Time : 09:05 AM July 28, 2018
-
సుమంత్ అశ్విన్ మరియు నిహారిక ప్రేమలో ఉన్నారు. వారి మ్యాచ్ కు సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు ప్రదర్శించబడుతున్నాయి. మురళీ శర్మ మరియు నరేష్ లు కూడా ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 09:00 AM July 28, 2018
-
కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి. సీరియస్ ట్విస్ట్ తో సినిమా కథ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. నిహారిక ఒక పబ్ లో ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 08:55 AM July 28, 2018
-
హాయ్.. హ్యాపీ నోట్ తో సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. సుమంత్ పెళ్లిలో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 08:50 AM July 28, 2018