-
పూర్తి రివ్యూ కోసం ఇక్కడ చూస్తూ ఉండండి.
Date & Time : 08:53 PM January 11, 2023
-
హనుమాన్ ఎంట్రీ తర్వాత పవర్ ఫుల్, లాంగ్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌తో సినిమా ముగిసింది.
Date & Time : 08:43 PM January 11, 2023
-
హనుమంతుని గొప్పతనాన్ని వివరించే అద్భుతమైన సన్నివేశం వస్తుంది. గౌర హరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.
Date & Time : 08:33 PM January 11, 2023
-
ఒక్కసారిగా సినిమా ఎమోషన్ మూమెంట్ లోకి మారిపోయింది.
Date & Time : 08:23 PM January 11, 2023
-
చివరగా తేజ ఆ శక్తులను ఎలా సంపాదించాడో వినయ్ రాయ్ తెలుసుకుంటాడు. రాముడు మరియు హనుమంతుని ఎలివేషన్ సూపర్ గా ఉంది. ఆడియెన్స్ ఫుల్ జోష్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
Date & Time : 08:13 PM January 11, 2023
-
హీరోయిన్ అమృత ప్రమాదంలో ఉంది. తేజ ఆమెను కాపాడటానికి వచ్చాడు. ఇప్పుడు వచ్చే ఈ ఫైట్ సీను ను ఫోక్ సాంగ్ తో ప్రదర్శించారు.
Date & Time : 08:03 PM January 11, 2023
-
తేజ ఆ సూపర్ పవర్స్ ఎలా సాధించాడో తెలుసుకోవడానికి వినయ్ రాయ్ చాలా ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 07:49 PM January 11, 2023
-
తేజ సూపర్ పవర్స్ గురించి తెలుసుకున్న వినయ్ రాయ్ మరియు వెన్నెల కిషోర్ అంజనాధ్రి కి వచ్చారు.
Date & Time : 07:39 PM January 11, 2023
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: సినిమా ఇప్పటి వరకు కూడా డీసెంట్ గా సాగింది. కామెడీ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగున్నాయి. హీరో తేజ సజ్జ సూపర్ పవర్స్ అందుకున్న మూమెంట్ నుండి సినిమా ఇంట్రెస్టింగ్ గా మారింది. హీరో తేజ, తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 07:31 PM January 11, 2023
-
వినయ్ రాయ్ ఇప్పుడు అంజనాద్రికి వచ్చారు. ఈ సినిమా ఇప్పుడు ఇంటర్వెల్ కి చేరుకుంది.
Date & Time : 07:21 PM January 11, 2023
-
కొన్ని సరదా సన్నివేశాల తర్వాత, ఇప్పుడు ఫైట్ సీక్వెన్స్ వస్తుంది. యాక్షన్ బ్లాక్ ఎంటర్ టైనింగ్ గా, పవర్ ఫుల్ గా ఉంది.
Date & Time : 07:16 PM January 11, 2023
-
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ మరియు బాలకృష్ణల రిఫరెన్స్ లు సినిమాలో ఉన్నాయి. ఆడియెన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
Date & Time : 07:04 PM January 11, 2023
-
తేజ సజ్జ సూపర్ పవర్ యొక్క సంకేతాలను చూపించడం ప్రారంభించాడు. తేజ సజ్జ ట్రాన్స్ ఫార్మేషన్ చూసి గ్రామస్తులు షాక్ అవుతున్నారు.
Date & Time : 06:50 PM January 11, 2023
-
కొందరు బందిపోట్లు అమృతపై దాడికి యత్నించారు. ఆమెను రక్షించే ప్రయత్నంలో తేజ చిక్కుల్లో పడ్డాడు.
Date & Time : 06:40 PM January 11, 2023
-
కథలో అసలైన కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు సినిమా కాస్త సీరియస్‌గా మారింది
Date & Time : 06:30 PM January 11, 2023
-
అమృత అయ్యర్ పై తేజ సజ్జ ఎంతో ఇష్టం పెంచుకున్నాడు. ఆమె అతని చిన్ననాటి క్రష్.
Date & Time : 06:20 PM January 11, 2023
-
హీరో తేజ సజ్జ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఒక కోతి (రవితేజ ఇచ్చిన వాయిస్ ఓవర్ తో) తేజపై కోపంతో ఉంది.
Date & Time : 06:15 PM January 11, 2023
-
వినయ్ రాయ్ ఒక పవర్ ఫుల్ ఫైట్ సీక్వెన్స్ తో మిస్టరీ మ్యాన్ గా పరిచయం అయ్యాడు.
Date & Time : 06:10 PM January 11, 2023
-
ఒక పిల్లవాడు తనకి తాను సూపర్ హీరో గా ఊహించుకుంటున్నాడు. సూపర్ హీరో అంటే ఏమిటో అతనికి, తన తల్లి వివరిస్తోంది.
Date & Time : 06:05 PM January 11, 2023
-
హాయ్, 158 నిమిషాల నిడివి గల హను మాన్ మూవీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 06:00 PM January 11, 2023