
మొదటి షో వివరాలు : హిట్ 3
ఇక నాలుగో కేసుకు సంబంధించిన ఇంట్రోతో కథ ముగుస్తుంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవండి.
ఇప్పుడు ఒక స్పెషల్ కేమియోతో ఓ హీరో ఎంట్రీ ఇచ్చాడు.
నాని ముసుగు తొలగిపోవడంతో ఇక అసలైన యాక్షన్ మొదలైంది.
ఈ క్రమంలో వైట్ జాకెట్ ఫైట్ వస్తుంది. ఇప్పుడు కొన్ని ట్విస్టులతో కథ క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
విలన్ గ్యాంగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నాని ప్రయత్నిస్తాడు.
ఓ బాలీవుడ్ నటుడు ప్రత్యేకమైన పాత్రలో ఇంట్రొడ్యూస్ అయ్యాడు. అతనికి సంబంధించిన సీన్స్ వస్తున్నాయి.
కొన్నిఇంట్రెస్టింగ్ ట్విస్టులు.. ‘ప్రేమ వెల్లువ’ సాంగ్ తర్వాత కథ అరుణాచల్ ప్రదేశ్‌కు షిఫ్ట్ అవుతుంది.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ :
ఇప్పటివరకు సినిమా డీసెంట్‌గా సాగింది. నాని ఇదివరకు చూడని పాత్రలో మెప్పిస్తాడు. ఇక అందరి చూపులు ఇప్పుడు సెకండాఫ్‌పై ఉన్నాయి.
ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ తర్వాత సినిమాలో ఇంటర్వెల్ కార్డు పడింది.
కథ బీహార్‌కు షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు నాని దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని మర్డర్ కేసులకు సంబంధించిన లింక్‌ను కనుగొంటాడు.
ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన సీన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఓ ఫైట్ సీక్వెన్స్ వస్తోంది. నాని నోటి నుంచి తెలుగు బూతులు వస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు కథలో మరో ఫ్లాష్‌బ్యాక్ వస్తోంది. ఈసారి కథ కశ్మీర్‌కు షిఫ్ట్ అవుతుంది.
నాని, శ్రీనిధి మధ్య అనిరుధ్ రవిచందర్ పాడిన ‘తను’ అనే మాంటేజ్ సాంగ్ వస్తుంది.
మృదుల పాత్రలో శ్రీనిధి శెట్టి, నాని తండ్రి పాత్రలో సముద్రఖని పరిచయం అయ్యారు.
కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. నాని ‘అర్జున్ సర్కార్’గా సింపుల్ ఎంట్రీ ఇస్తాడు.
ఈ సినిమా కోర్టులో ఓ ఆసక్తికర సన్నివేశంతో ప్రారంభం అవుతుంది.
2 గంటల 37 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ఇప్పుడే మొదలైంది.
హాయ్.. హిట్-3 యూఎస్ ప్రీమియర్స్ నుంచి లైవ్ అప్డేట్స్ మీ కోసం..!