-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 12:55 PM April 10, 2025
-
కొన్ని యాక్షన్ సన్నివేశాల తర్వాత, రెడ్ డ్రాగన్ కోపంతో తిరిగి వస్తాడు. హీరో మరియు ప్రతినాయకుడి మధ్య తుది పోరాటం ప్రారంభమవుతుంది.
Date & Time : 12:45 PM April 10, 2025
-
సిమ్రాన్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. కొన్ని ఫన్నీ ఫ్యామిలీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 12:20 PM April 10, 2025
-
.కొడుకు కోసం అజిత్ మళ్లీ రెడ్ డ్రాగన్ గా మారతాడు. విలన్ గ్యాంగ్ ను టార్గెట్ చెయ్యడానికి అజిత్ ప్లాన్ చేస్తాడు.
Date & Time : 12:00 PM April 10, 2025
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటివరకు సినిమా బాగానే ఉంది. అజిత్ అభిమానులకు క్లనెక్ట్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా అజిత్ స్టైలిష్ లుక్ అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అయితే, ఇప్పటివరకు కథ యావరేజ్ గానే ఉంది. సీన్స్ కూడా రెగ్యులర్ గానే సాగాయి. మరి సెకండ్ హాఫ్ ఎలా సాగుతుందో చూడాలి.
Date & Time : 11:50 AM April 10, 2025
-
ఇంటర్వెల్ సీక్వెన్స్ నడుస్తోంది. విలన్ గ్యాంగ్ కి అజిత్ కి మధ్య ఛాలెంజింగ్ సీన్ నడిచింది. ఫైనల్ గా బ్యాంకు బ్లాస్ట్ తో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 11:45 AM April 10, 2025
-
విలన్ అర్జున్ దాస్ - అజిత్ మధ్య డీలింగ్ సీన్స్ నడుస్తున్నాయి. అజిత్ ను చూసి అర్జున్ దాస్ షాక్. తన కొడుకు విహాన్ జైలు నుంచి బయటకు తీసుకురావడానికి అజిత్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
Date & Time : 11:35 AM April 10, 2025
-
అజిత్ తన కొడుకు విహాన్ ను ఓ క్రైమ్ ఇన్సిడెంట్ లో మొదటి సారి మీట్ అయ్యాడు. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ నడుస్తున్నాయి.
Date & Time : 11:20 AM April 10, 2025
-
విలన్ గ్యాంగ్ లకు - అజిత్ కి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈ మధ్యలోనే అజిత్ కొడుకు విహాన్ మిస్ అయ్యాడు. దాంతో, అజిత్ మళ్ళీ పాత గ్యాంగ్ స్టర్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు.
Date & Time : 11:10 AM, April 10, 2025
-
అజిత్ - త్రిష మధ్య ఫ్యామిలీ సీన్స్ నడుస్తున్నాయి..
Date & Time : 11:05 AM, April 10, 2025
-
అజిత్ క్యారేటర్ ఎలివేషన్ సాంగ్ మొదలైంది. ఖైదీలతో అజిత్ మాస్ స్టెప్స్ బాగున్నాయి.
Date & Time : 10:50 AM, April 10, 2025
-
అజిత్ పాత్ర పరిచయంతో పాటు జైలు యాక్షన్ విజువల్స్ సాగుతున్నాయి.
Date & Time : 10:40 AM, April 10, 2025
-
సినిమా ఇప్పుడే స్టార్టు అయింది. అజిత్ క్యారెక్టర్ ఒక యాక్షన్ సీన్ తో ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 10:30 AM, 2025