-
ఒక ఇంట్రెస్టింగ్ బాక్సింగ్ ఫైనల్స్ తో సినిమా సుఖాంతం అయ్యింది. ఈ చిత్రం కంప్లీట్ రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 07:00 AM April 08, 2022
-
ఫైనల్ మ్యాచ్ కి చేరుకునే టైం లో కథనంలో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే పలు ఎమోషనల్ సన్నివేశాలు కూడా వస్తున్నాయి.
Date & Time : 06:40 AM April 08, 2022
-
ఇప్పుడు కథనం కాస్త సీరియస్ గా మారింది. మరో చిన్న ట్విస్ట్ తో వరుణ్ మరియు జగపతి బాబుల మధ్య ఘర్షణకి దారి తీసే సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
Date & Time : 06:30 AM April 08, 2022
-
కమెడియన్ సత్య ఎంట్రీతో మరికొన్ని కామెడీ సీన్స్ యాడ్ అయ్యాయి. ఇప్పుడు గని టైటిల్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో వరుణ్ తేజ్ స్టన్నింగ్ బాడీ తో కనిపిస్తున్నాడు.
Date & Time : 06:20 AM April 08, 2022
-
ఇప్పుడు సినిమా మళ్ళీ ప్రస్తుత రోజుకి చేరుకుంది. ఇప్పుడు వరుణ్ - సునీల్ శెట్టి ల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:10 AM April 08, 2022
-
ఇంటర్వెల్ అనంతరం.. ఇప్పుడు నటుడు ఉపేంద్ర పై కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మొదలయ్యాయి.
Date & Time : 06:00 AM April 08, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇక్కడ వరకు సినిమా పర్వాలేదని చెప్పాలి. మెయిన్ లీడ్ మధ్య కెమిస్ట్రీ డీసెంట్ గా ఉంది. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకండాఫ్ కీలకంగా మారేలా అనిపిస్తుంది. మరి అదెలా ఉంటుందో చూడాలి.
Date & Time : 05:55 AM April 08, 2022
-
మొత్తానికి వరుణ్ మరియు నవీన్ లు ఓ బాక్సింగ్ మ్యాచ్ కి ఒకరికొకరు ఎదురయ్యారు. ఇప్పుడు కథనంలో నటుడు ఉపేంద్ర పై ట్విస్ట్ తో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది.
Date & Time : 05:50 AM April 08, 2022
-
ఇప్పుడు నవీన్ చంద్ర మరియు వరుణ్ తేజ్ ఇద్దరూ నేషనల్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కి సెలెక్ట్ అయ్యారు. తర్వాత కథనంలో ఒక చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక్కడ నుంచి కొన్ని ఎమోషనల్ సన్నివేశాల అనంతరం ఒక బాక్సింగ్ మ్యాచ్ కి సినిమా షిఫ్ట్ అయ్యింది.
Date & Time : 05:40 AM April 08, 2022
-
మెయిన్ లీడ్ మధ్య మరికొన్ని రొమాంటిక్ సీన్స్ తర్వాత ఇప్పుడు వరుణ్ మరియు తన తల్లి నదియా లపై కొన్ని సన్నివేశాలు స్టార్ట్ అయ్యాయి.
Date & Time : 05:30 AM April 08, 2022
-
ఒక బ్యూటిఫుల్ ఫస్ట్ సాంగ్ అనంతరం వరుణ్ మరియు నవీన్ చంద్ర ల మధ్య ఒక సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 05:20 AM April 08, 2022
-
ఇప్పుడు నవీన్ చంద్ర ఇంట్రో తర్వాత మెయిన్ లీడ్ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:10 AM April 08, 2022
-
కొన్ని కామెడీ సీన్స్ అనంతరం ఒక కాలేజ్ లో హీరోయిన్ సాయీ మంజ్రేకర్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:00 AM April 08, 2022
-
ఇప్పుడు హీరో వరుణ్ తేజ్ ఒక బాక్సర్ గా పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సంబంధిత సన్నివేశాలు థమన్ క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో వస్తున్నాయి.
Date & Time : 04:50 AM April 08, 2022
-
నదియా ఒక సింపుల్ ఎంట్రీ ఇచ్చారు. తన కొడుకు గని తో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 04:45 AM April 08, 2022
-
నటుడు సునీల్ శెట్టి ని నేషనల్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్ గా పరిచయం చేస్తూ ఒక గ్రాండ్ ఎంట్రీ సీన్ తో సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:40 AM April 08, 2022
-
హాయ్..157 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:30 AM April 08, 2022