
మొదటి షో వివరాలు :ఘాటీ
సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
సినిమా క్లైమాక్స్ కి చేరుతున్న క్రమంలో, అనుష్క అందరినీ చైతన్య రావు పై తిరగబడేలా చేస్తుంది.
ఘాటీల బతుకులు మార్చాలని అనుష్క అనుకుంటుంది. ఈ విషయం పై జగపతి బాబు ఆమెతో మాట్లాడుతాడు. మరి కొన్ని ఇంటెన్స్ సీన్స్ వస్తున్నాయి.
అనుష్కపై ప్రతీకారం తీర్చుకోవాలని చైతన్య రావు భావిస్తాడు. దీంతో ఆమె కోసం వెతుకుతుంటారు. కొన్ని ఇంటెన్స్ సీన్స్ వస్తున్నాయి.
బిగ్ షాట్స్ అనుష్క తో చేతులు కలిపి బిజినెస్ చేయాలని ఆలోచిస్తారు. ఈ క్రమంలో జరిగే మీటింగ్ లో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది.
ఊహించని ఘటన అనుష్కను పూర్తిగా మార్చేస్తుంది. తనకు గాయం చేసినవారిని అంతం చేసేందుకు బయల్దేరుతుంది. కొన్ని ఇంటెన్స్ సీన్స్ వస్తున్నాయి.
సెకండ్ హాఫ్ లో జగపతి బాబు విక్రమ్ ప్రభు కోసం గాలిస్తున్నాడు. కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తున్నాయి.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా పర్వాలేదు. ఇంటర్వెల్ కు దారి తీసే సీన్స్ బాగున్నాయి. అనుష్క, విక్రమ్ ప్రభు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇక పై కథ ఎలా ఉంటుందో చూడాలి.
ఒక ఊహించని ట్విస్ట్ తో ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి. అనుష్క, విక్రమ్ లకు ఎదురుదెబ్బ తగులుతుంది. ఇప్పుడు ఇంటర్వెల్.
అనుష్క, విక్రమ్ ప్రభు కొందరు బిగ్ షాట్స్ కి గట్టి కౌంటర్ ఇస్తారు. కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తర్వాత సైలోరే పాట వస్తుంది.
తమను మోసం చేసిన వారి గురించి తెలుసుకున్న చైతన్య రావు, బిజినెస్ ను చూసుకుంటాడు. ఇప్పుడు కొన్ని ఇంటెన్స్ సీన్స్ వస్తున్నాయి.
అనుష్క విక్రమ్ ప్రభు ఓ మిషన్‌పై ఉంటారు. వారిని అడ్డుకునేందుకు జగపతి బాబు ప్రయత్నిస్తుంటాడు. దీనికి సంబంధించిన యాక్షన్ సీన్స్ వస్తున్నాయి.
డ్రగ్ బిజినెస్ వెనకాల ఉన్న మాఫియా గురించి చూపిస్తారు. ఇప్పుడు బస్ కండక్టర్‌గా అనుష్క శెట్టి పరిచయం అయింది. డాక్టర్‌గా విక్రమ్ ప్రభు కనిపించాడు. ఇప్పుడు ఓ పాట వస్తోంది.
ఘాటీలు, వారు గంజాయి ఎందుకు పండిస్తారు అనే విషయాలను వివరిస్తున్నారు. జగపతి బాబు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు.
హాయ్.. ఘాటి చిత్రం ఇప్పుడే మొదలైంది. దీని రన్‌టైమ్ 2 గంటల 36 నిమిషాలుగా ఉంది.