-
జార్జ్ రెడ్డి హత్య చేయబడ్డాడు.సినిమా ఇప్పుడు భావోద్వేగ పూరితంగా అద్భుతమైన ఎండింగ్ తో పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 12:22 AM November 21, 2019
-
జార్జ్ రెడ్డి పథకం ప్రకారం ట్రాప్ చేయబడి అతి కిరాతకంగా దాడి చేయబడుతున్నాడు.ఈ సీన్స్ చాలా థ్రిల్లింగ్ గా సహజంగా ఉన్నాయి.
Date & Time : 12:15 AM November 21, 2019
-
ఇప్పుడు జార్జ్ రెడ్డిను చంపడానికి ఒక పక్కా పథకం ప్రత్యర్ధులు వేశారు.ఇప్పుడు చిత్రం క్లైమాక్స్ దిశకు చేరుకుంటుంది.
Date & Time : 12:10 AM November 21, 2019
-
ఇప్పుడు జార్జ్ రెడ్డి ప్రత్యర్ధ గ్యాంగ్ లు అతనికి వ్యతిరేఖంగా ప్లాన్లు గీస్తున్నారు.ఇందులో పోలీసులు కూడా జోక్యం చేసుకుంటున్నారు.
Date & Time : 12:00 AM November 21, 2019
-
జార్జ్ రెడ్డి ఇప్పుడు సిటీ మొత్తంలో కీలక పాత్రధారిగా అన్ని వైపులా మారాడు.అతని యుద్ధం ఇప్పుడు రైతులు వరకు చేరింది.ఇక్కడ ఎమోషనల్ కంటెంట్ బాగుంది.
Date & Time : 11:55 PM November 21, 2019
-
జార్జ్ రెడ్డి ఇప్పుడు దాడులకు గురవుతున్నాడు.ఇప్పుడు మరో ఫైట్ సీన్ వస్తుంది.ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరోస్థాయిలో ఉంది.
Date & Time : 11:45 PM November 21, 2019
-
ఇప్పుడు వారి విజయానికి ప్రతీకను తెలిపేలా సాంగ్ మొదలయ్యింది.ఇందులో విజువల్స్ బాగున్నాయి.
Date & Time : 11:35 PM November 21, 2019
-
ఎన్నికల సంగ్రామం చక్కగా తీర్చదిద్దబడింది.ఈ ఎన్నికల్లో జార్జ్ రెడ్డి గెలిచాడు.
Date & Time : 11:30 PM November 21, 2019
-
ఇప్పుడు విద్యార్థులకు సంబంధించిన కొన్ని ఫైట్ సీన్స్ వస్తున్నాయి.ఇప్పుడు అంశాలు అన్ని సీరియస్ గా మారుతున్నాయి.
Date & Time : 11:24 PM November 21, 2019
-
ఇంటర్వెల్ అనంతరం యూనివర్సిటీలో ఎన్నికలు మొదలయ్యాయి.మొత్తం మూడు గ్రూపులు ఎన్నికల్లో ఉన్నాయి.ప్రచారానికి సంబంధించిన సన్నివేశాలు ఇపుడు వస్తున్నాయి.
Date & Time : 11:18 PM November 21, 2019
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు చిత్రం సజావుగా సాగింది.జార్జ్ రెడ్డిగా సందీప్ అద్భుత నటనతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆకట్టుకున్నారు.కాకపోతే సినిమాలోని మెయిన్ పాయింట్ నే అంత బలంగా తీసినట్టు అనిపించలేదు.అలాగే స్టూడెంట్స్ పాలిటిక్స్ కూడా అంతగ మెప్పించలేదు.ఇప్పటి వరకు అయితే మరీ అంత స్థాయిలో గొప్పగా అనిపించలేదు.మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Date & Time : 11:10 PM November 21, 2019
-
ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ కు టైం వచ్చింది.జార్జ్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ఓ విప్లవాత్మక స్పీచ్ ను ఇవ్వడంతో సినిమా ఓ ఆకట్టుకునే పాయింట్ దగ్గరకు వచ్చింది.ఇప్పుడు విరామం.
Date & Time : 11:00 PM November 21, 2019
-
ఇప్పుడు జార్జ్ రెడ్డికు ముంబైలో ఓ అడ్మిషన్ వచ్చింది.కానీ అక్కడకి వెళ్లే ముందు తోటి విద్యార్థులను కలవాలనుకుంటున్నాడు.కానీ అతని విరోధులు మాత్రం ఏవో ప్లాన్స్ గీస్తున్నారు.ఇప్పుడు చిత్రం ఇంటర్వెల్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 10:52 PM November 21, 2019
-
ఇప్పుడు కాలేజీ రాజకీయాల్లో నటుడు సత్యదేవ్ ఎంటర్ అయ్యాడు.కృష్ణ చైతన్య కూడా చేరాడు.జార్జ్ రెడ్డి కాలేజ్ కి హీరోలా మారిపోయాడు.
Date & Time : 10:45 PM November 21, 2019
-
ఇప్పుడు జార్జ్ రెడ్డి స్టూడెంట్స్ లో లీడర్ గా ఎలా రూపాంతరం చెందుతున్నాడో అన్న సన్నివేశాలు వస్తున్నాయి.ఇప్పుడు చిత్రం అసలు కథలోకి వెళ్తుంది.
Date & Time : 10:30 PM November 21, 2019
-
జార్జ్ రెడ్డి మొదట కాస్త నెమ్మదిగానే ఉన్నాడు.అలా మెల్లగా మంచి కారణాల చేత తన సీనియర్స్ కు ఎదురు తిరగడం మొదలు పెట్టాడు.ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.
Date & Time : 10:20 PM November 21, 2019
-
ఇప్పుడు హీరోయిన్ పాత్ర పరిచయం అయ్యింది.ఆమె జార్జ్ పై ఆసక్తి కనబరుస్తుంది.దీనికి అనుగుణంగా ఓ సాంగ్ వస్తుంది.
Date & Time : 10:10 PM November 21, 2019
-
జార్జ్ రెడ్డిగా హీరో సందీప్ ఇప్పుడు పరిచయం అయ్యాడు.అతను ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యారు.
Date & Time : 09:55 PM November 21, 2019
-
ఇప్పుడు సినిమా న్యూయార్క్ లో మొదలయ్యింది.ఒక అమ్మాయి జార్జ్ రెడ్డి ఎవరో తెలుసుకోవాలనుకుంటుంది.ఇప్పుడు ఆమె ఇండియాలో ల్యాండ్ అయ్యింది.
Date & Time : 09:45 PM November 21, 2019
-
హాయ్..153 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడు మొదలయ్యింది.
Date & Time : 09:40 PM November 21, 2019