-
ఒక చిన్న ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ తరువాత సినిమా ముగుస్తుంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:30 AM May 31, 2024
-
కథ జైలుకి షిఫ్ట్ కావడంతో సినిమాలో కొత్తదనం కనిపిస్తుంది. ప్రేక్షకులు కథలో లీనమయ్యారు.
Date & Time : 11:25 AM May 31, 2024
-
విశ్వక్ సేన్, అతడి కుటుంబంపై దాడి జరుగుతుంది. దీంతో తరువాత ఏం జరగబోతుందా అనే ఆసక్తి క్రియేట్ అవుతుంది.
Date & Time : 11:15 AM May 31, 2024
-
గ్రామంలో చోటు చేసుకున్న ఓ ఊహించని ఘటన కారణంగా, అక్కడ ఉత్కంఠ పరిస్థితులు నెలకొంటాయి. దీంతో విశ్వక్ సేన్‌కు కష్టాలు తప్పవని స్పష్టమవుతుంది.
Date & Time : 11:10 AM May 31, 2024
-
పలు ఆసక్తికర సన్నివేశాల తరువాత, ‘మోత’ స్పెషల్ సాంగ్‌లో అయెషా ఖాన్ గ్లామర్‌తో పాటు మాస్ స్టెప్పులతో అలరిస్తుంది.
Date & Time : 11:00 AM May 31, 2024
-
విశ్వక్ సేన్ ఎదుర్కొంటున్న సమస్యలు, అతడిలోని మార్పును చూసి నేహా శెట్టి అతడిని హెచ్చరిస్తుంది. తన భవిష్యత్తు బాగుండాలంటే అతడి ప్రవర్తనను మార్చుకోవాలని ఆమె సూచిస్తుంది.
Date & Time : 10:45 AM May 31, 2024
-
సెకండాఫ్ ఫ్లాష్‌బ్యాక్‌తో మొదలైంది. గెద్దరాజు పాత్రలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ఎంట్రీ ఇచ్చారు. గ్రామంలోని రాజకీయాలకు సంబంధించిన సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 10:35 AM May 31, 2024
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్:
ఇప్పటివరకు విశ్వక్ సేన్ నటనతో సినిమా పర్వాలేదు. అంజలి, నేహా శెట్టిలు తమ పాత్రల్లో బాగా కనిపించారు. మ్యూజిక్ పర్వాలేదు. సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Date & Time : 10:25 AM May 31, 2024
-
కథలో ఊహించని మలుపుతో పోలీసు స్టేషన్లో ఓ భారీ యాక్షన్ సీన్ చోటుచేసుకుంటుంది. మరో ఆసక్తికర మలుపుతో ఇంటర్వెల్ వస్తుంది.
Date & Time : 10:15 AM May 31, 2024
-
అనుకోని విధంగా విశ్వక్ సేన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యే అవుతాడు. లంకల రత్నాకర్ నుండి టైగర్ రత్నాకర్‌గా ఎదుగుతాడు. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయా అనే ఆసక్తి నెలకొంది.
Date & Time : 10:00 AM May 31, 2024
-
విశ్వక్ సేన్, నేహా శెట్టిల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అనంతరం ‘సుట్టంలా సూసి పోకలా’ అనే హిట్ ట్రాక్ వారి మధ్య ఉన్న బంధాన్ని హైలైట్ చేసేలా ఉంది.
Date & Time : 09:50 AM May 31, 2024
-
నేహా శెట్టి గ్రామంలోని సంపన్నుడైన నానాజీ (నాజర్) కుమార్తె బుజ్జిగా పరిచయం అయ్యింది. ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:40 AM May 31, 2024
-
విశ్వక్ సేన్ భవిష్యత్తు కోసం పెద్ద ప్లాన్ వేసుకుని ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ పోషించిన పాత్ర) బృందంలో చేరాడు. అందుకు సంబంధించిన ఆసక్తికరమైన సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 09:30 AM May 31, 2024
-
విశ్వక్ సేన్ మరియు అంజలి మధ్య కొన్ని సన్నివేశాల తర్వాత, ఇంటెన్స్ ఫైట్ సీన్ కి సమయం ఆసన్నమైంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.
Date & Time : 09:20 AM May 31, 2024
-
రత్న (విశ్వక్ సేన్) మరియు అతని స్టోరీ ఇంట్రడక్షన్ తర్వాత, అంజలి రత్నమాల గా పరిచయం అయ్యింది.
Date & Time : 09:10 AM May 31, 2024
-
హాయ్, మూవీ ఇప్పుడే స్టార్ట్ అయింది , మొత్తం సినిమా నిడివి 2 గంటల 26 నిముషాలు.
Date & Time : 09:00 AM May 31, 2024