-
ఎవరూ ఊహించని విధంగా రామ్ చరణ్ సరికొత్త అవతారంలో కనిపించడంతో సినిమా ముగుస్తుంది. ‘గేమ్ ఛేంజర్’ పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
Date & Time : 03:25 AM Jan 10, 2025
-
ఓట్ల లెక్కింపు సీన్ నడుస్తోంది. సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తోంది.
Date & Time : 03:08 AM Jan 10, 2025
-
రామ్ చరణ్ ఇప్పుడు మరో కొత్త అవతారంలో తన ఆటను కొనసాగిస్తుంటాడు.
Date & Time : 02:45 AM Jan 10, 2025
-
అప్పన్న పాత్ర చుట్టూ రాజకీయాలు సాగుతుంటాయి. శ్రీకాంత్, రాజీవ్ కనకాల ఇచ్చే ట్విస్ట్‌తో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ముగుస్తుంది.
Date & Time : 02:22 AM Jan 10, 2025
-
చరణ్ అప్పన్న పాత్రతో శంకర్ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్‌ను తీసుకొచ్చాడు. రాజీవ్ కనకాల, శ్రీకాంత్ అప్పన్న స్నేహితులుగా ఉండగా.. నా దొర సాంగ్ వస్తుంది.
Date & Time : 02:12 AM Jan 10, 2025
-
ఫ్లాష్‌బ్యాక్‌లో కొండ దేవర సాంగతో సెకండాఫ్ మొదలైంది.
Date & Time : 02:09 AM Jan 10, 2025
-
పెళ్లి బట్టల గెటప్‌లో చరణ్ చేసే ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో ఇంటర్వెల్‌కు తెర పడింది.
Date & Time : 02:00 AM Jan 10, 2025
-
ఓ ఊహించని పరిణామంతో సూర్య సీఎంగా బాధ్యతలు తీసుకుంటాడు.
Date & Time : 01:52 AM Jan 10, 2025
-
సూర్య, చరణ్‌ల మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి. అంజలి ఓ ఇంట్రెస్టింగ్ పాత్రలో పరిచయం అయ్యింది. శ్రీకాంత్ పాత్ర సినిమాలో సీరియస్ మోడ్‌ను తీసుకొస్తుంది.
Date & Time : 01:44 AM Jan 10, 2025
-
కియారాను రామ్ చరణ్ మళ్లీ కలుసుకుంటాడు. ఈ క్రమంలో ‘ధోప్’ సాంగ్ వస్తుంది.
Date & Time : 01:34 AM Jan 10, 2025
-
ఫ్లాష్‌బ్యాక్ ముగిసిన తర్వాత కొన్ని ఆసక్తికర పొలిటికల్ డ్రామా సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 01:28 AM Jan 10, 2025
-
కియారాతో చరణ్ లవ్ సీన్స్ నడుస్తున్నాయి. చరణ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు.
Date & Time : 01:20 AM Jan 10, 2025
-
అవినీతి అధికారులు, వ్యాపారులపై చర్యలు తీసుకునేలా రామ్ చరణ్ పాత్రను శంకర్ తనదైన మార్క్‌ను కొనసాగిస్తున్నారు.
Date & Time : 01:08 AM Jan 10, 2025
-
రామ్ చరణ్, ఎస్.జె.సూర్య అసిస్టెంట్లుగా సునీల్, నవీన్ చంద్ర పరిచయం అయ్యారు.
Date & Time : 01:06 AM Jan 10, 2025
-
రామ్ చరణ్‌ను బ్యాక్ టు బ్యాక్ పవర్ఫుల్ పాత్రల్లో శంకర్ ప్రెజెంట్ చేస్తున్నారు.
Date & Time : 01:05 AM Jan 10, 2025
-
శంకర్, గణేశ్ మాస్టర్ల కేమియోతో పాటు, చిరు రిఫరెన్స్‌తో ‘రా మచ్చా’సాంగ్ వస్తుంది.
Date & Time : 01:03 AM Jan 10, 2025
-
ఇప్పుడు రామ్ చరణ్ లుంగీ ఫైట్‌తో మెగా మాస్ ఎంట్రీ జరుగుతోంది.
Date & Time : 12:58 AM Jan 10, 2025
-
ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, జయరామ్ సముద్రఖని వారి పాత్రల్లో పరిచయం అయ్యారు.
Date & Time : 12:52 AM Jan 10, 2025
-
శంకర్ మార్క్ సిగ్నేచర్‌తో ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ యానిమేషన్ ప్రారంభమైంది.
Date & Time : 12:46 AM Jan 10, 2025
-
హాయ్.. ‘గేమ్ ఛేంజర్’ తెలుగు మూవీ ప్రీమియర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
Date & Time : 12:40 AM Jan 10, 2025