-
సినిమా పాజిటివ్ నోట్ తో ముగుస్తుంది. విశ్వక్ సేన్ యొక్క గామి యొక్క వివరణాత్మక సమీక్ష కోసం ఇక్కడ చూస్తూ ఉండండి.
Date & Time : 10:40 AM March 08, 2024
-
షాకింగ్ ట్విస్ట్ రివీల్ అయ్యింది. ఇప్పుడు శంకర్ కి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:30 AM March 08, 2024
-
శంకర్, ఉమ, ఖైదీకి సంబంధించిన ఇంటెన్స్ సన్నివేశాలు ఒకే సారి వస్తున్నాయి.
Date & Time : 10:20 AM March 08, 2024
-
ల్యాబ్ లో ఖైదీపై చేసిన ప్రయోగం తప్పు అవుతుంది. మూడు కథలు ఎలా కనెక్ట్ అయ్యాయో స్క్రీన్‌ప్లే కొద్దిగా తెలియజేస్తుంది.
Date & Time : 10:10 AM March 08, 2024
-
కథ మళ్లీ ఉమ వైపుకు వెళ్లి ఆమెకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:00 AM March 08, 2024
-
అరుదైన పువ్వుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ప్రధాన పాత్రధారులు ఇబ్బందుల్లో ఉన్నారు.
Date & Time : 09:50 AM March 08, 2024
-
జాహ్నవి కూడా ఔషధ విలువలున్న మాలి పత్ర కోసం ఎందుకు వెతుకుతోంది అనే విషయంతో సెకండాఫ్ ప్రారంభమవుతుంది.
Date & Time : 09:40 AM March 08, 2024
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: సినిమా ఇప్పటివరకు, కొన్ని అద్భుతమైన విజువల్స్ తో మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో బాగానే ఉంది. విశ్వక్ సేన్ తన పాత్రలో బాగా నటించాడు. సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 09:30 AM March 08, 2024
-
జాహ్నవి (చాందిని చౌదరి) హిమాలయాలకు వెళ్లే దారిలో ఒక సమస్యలో పడుతుంది. దుర్గ కి కూడ మరొక సమస్య లో ఉంటుంది. ఇంటర్వెల్ కి సమయం అయ్యింది.
Date & Time : 09:20 AM March 08, 2024
-
శంకర్ కాలంతో పోటీపడుతున్నాడు. మరొక పక్క దుర్గ కి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:10 AM March 08, 2024
-
లోబోటమీకి సంబంధించిన కొన్ని సన్నివేశాల తరువాత, దుర్గ పాత్ర కి కథ షిఫ్ట్ అయ్యింది.
Date & Time : 09:00 AM March 08, 2024
-
శంకర్ తన పరిస్థితి ఎలా క్యూర్ అవుతుంది అని తెలుసుకుంటాడు. చాందిని చౌదరి ను డాక్టర్‌గా పరిచయం చేశారు. వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతోంది.
Date & Time : 08:50 AM March 08, 2024
-
ఇండియా లో దక్షిణాది గ్రామంలోని దేవదాసి అయిన దుర్గ (అభినయ)ని పరిచయం చేసిన తర్వాత సినిమా ఒక్కసారిగా శంకర్ కథలోకి మారుతుంది.
Date & Time : 08:40 AM March 08, 2024
-
భారత్ - చైనా సరిహద్దులో మరో స్టోరీ స్టార్ట్ అయ్యింది. కొంతమంది వ్యక్తులు మనుషుల పై ప్రయోగాలు చేస్తున్నారు. ల్యాబ్ లో జరుగుతున్న కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:30 AM March 08, 2024
-
అతని పరిస్థితి శాపమా లేక సమస్యా అని శంకర్ నిర్ణయించుకున్నాడు. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఓపెనింగ్ టైటిల్స్ వస్తున్నాయి.
Date & Time : 08:20 AM March 08, 2024
-
విశ్వక్ సేన్ శంకర్ అనే అఘోరాగా పరిచయం అయ్యాడు. అతని పరిస్థితికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:10 AM March 08, 2024
-
హాయ్, 2 గంటల 26 నిమిషాల నిడివి గల గామి మూవీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 08:00 AM March 08, 2024