మొదటి షో వివరాలు : ఫంకీ
ఒక ప్రముఖ డైరెక్టర్ క్యామియో ఎంట్రీతో కొన్ని ఫన్ మూమెంట్స్ వస్తున్నాయి.
సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి విశ్వక్ ఓ పెద్ద ప్లాన్ వేస్తాడు. ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ జై కృష్ణకు సంబంధించి ఓ కామెడీ బ్లాక్ నడుస్తుంది.
విశ్వక్ సేన్, కయాదు లోహర్, నరేష్ మధ్య పోలీస్ స్టేషన్‌లో ఓ ఫన్నీ సీక్వెన్స్ వస్తుంది.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు సినిమాలో పెద్దగా ఇంట్రెస్టింగ్ అంశాలు ఏమీ రాలేదు. అనుదీప్ గత చిత్రాల మాదిరిగా ఇది కూడా వన్ లైనర్ పంచులతో సాగింది. కొన్ని జోకులు పేలినా, చాలా వరకు సిల్లీగా ఉన్నాయి. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
కథలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. సినిమా సగానికి చేరుకుంటుంది.
విశ్వక్, కయాదు మూవీ షూటింగ్ లొకేషన్స్ కోసం వెళ్తారు. అక్కడ వారి మధ్య రొమాంటిక్ ట్రాక్ నడుస్తుంది.
నిర్మాత నరేష్ ఓ గ్రాండ్ పార్టీ ఇస్తాడు. కానీ అక్కడ అందరూ హీరోని చూసి నవ్వుకోవడం తో హీరో అవమానంగా ఫీల్ అవుతాడు.
విశ్వక్ ఓ పెద్ద సమస్యలో పడతాడు. దాని నుండి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నాడు.
స్టార్ డైరెక్టర్ కోమల్ పాత్రలో విశ్వక్ సేన్ ఎంట్రీ ఇచ్చాడు. నిర్మాత కూతురిగా కయాదు లోహర్ పరిచయం అయింది.
హాయ్.. 2 గంటల 28 నిముషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.