-
-
తీవ్రమైన విషయాల పరంపరలో ఈ సీరియస్ పరిస్థితికి ముగింపు పడింది. ఇక చిత్ర సమీక్ష కోసం కొనసాగించండి
Date & Time : 12:09 AM May 31, 2019
-
క్లైమాక్స్ లో చాలా కీలకమైన హత్య దృశ్యం ప్రదర్శించబడింది.
Date & Time : 12:04 AM May 31, 2019
-
ప్రస్తుతానికి ఒక పెద్ద ట్విస్ట్ తో కథ అల్లుకుంది. ఆ సమయంలో అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం క్లైమాక్స్ కి చేరుకోనుంది.
Date & Time : 12:00 AM May 31, 2019
-
రెండు సంఘాల మధ్య శాంతి తరువాత కూడా కథ మళ్ళీ ఒక పెద్ద మలుపు తిరిగింది
Date & Time : 11:53 PM May 30, 2019
-
ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల నడుమ దాస్ పెళ్లి జరిగింది. ప్రత్యర్థి ముఠా వేసిన ప్లాన్ వలన అసలు ఈ ట్విస్ట్ జరిగింది.
Date & Time : 11:46 PM May 30, 2019
-
మంచి సెట్ అప్ చేశారు. చిత్ర మేకర్స్ వారి పనిని చాల సక్రమంగా నిర్వహించారు. ఈ చిత్రంలో వచ్చే సన్నివేశాలు అచ్చు నిజజీవితంలో జరిగినట్లే అనిపిస్తుంది.
Date & Time : 11:40 PM May 30, 2019
-
మొదటి అమ్మాయితో విడిపోయాక దాస్ మళ్ళీ ప్రేమలు పడ్డాడు... ప్రస్తుతానికి వీరిరువురి మధ్యన కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి...
Date & Time : 11:32 PM May 30, 2019
-
పాండు పాత్ర చాలా బాగుంది. కానీ వారు చేసిన నేరాల కారణంగా ఫలక్ నుమా గ్యాంగ్ ప్రస్తుతానికి నిస్సహాయంగా మారింది.
Date & Time : 11:23 PM May 30, 2019
-
వీరి పనుల వలన పరిస్థితి చాలా సీరియస్ గా మారింది. ప్రస్తుత పరిస్థితి అంత కూడా పోలీసుల చేతిలోకి వెళ్ళింది. భావోద్వేగం తో కూడిన సన్నివేశం నడుస్తుంది...
Date & Time : 11:19 PM May 30, 2019
-
అతని నేరాలు కారణంగా ఫలాక్ నూమా దాస్ ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఒక అద్భుతమైన చేజ్ సన్నివేశం ఇప్పుడు ప్రదర్శించబడుతోంది. దర్శకుడిగా విశ్వాక్ సేన్ చాలా అనూహ్యమైన ప్రతిభని కనబరిచాడు.
Date & Time : 11:12 PM May 30, 2019
-
కాస్త విరామం తరువాత మళ్ళీ ఈ చిత్రం ప్రారంభం అయింది. దాస్ వర్గం మొత్తం పోలీసు కేసులో చిక్కుకుంది. దీనికి సంబందించిన సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:03 PM May 30, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఫలక్ నుమా దాస్ చిత్రం మొదటి భాగం పూర్తయింది. ఒకవైపు దర్శకత్వం వహిస్తూ కథానాయకుడిగా నటించిన విశ్వక్ సేన్ నటన ప్రధాన ఆకర్షణగా ఉంది... ఈ చిత్రం ఆద్యంత ఆసక్తికరంగా సాగింది. మధ్యలో వచ్చే హాస్య సన్నివేశాలు ఈ చిత్రాన్నీ హైలెట్ చేశాయి... అంతేకాకుండా మధ్య మధ్యలో వచ్చే గొడవలు, ఈ చిత్ర స్క్రీన్ ప్లే, పాతబస్తీ సెట్లు ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి... మొత్తానికి ఒక పెద్ద ట్విస్టు తో ఈ చిత్రం మొదటి భాగం పూర్తయింది.
Date & Time : 10:55 PM May 30, 2019
-
చాలా విషాదకరమైన ట్విస్ట్ తో ఈ చిత్రం మొదటి భాగం పూర్తయింది.
Date & Time : 10:50 PM May 30, 2019
-
భారీ డ్యూటీ విరామం మొదలు కానుంది... ఈ చిత్రానికి అద్భుతమైన స్క్రీన్ ప్లే ప్రధాన ఆకర్షణ. మరో కొద్దీ సేపట్లో ఒక పెద్ద యుద్ధం మొదలవనుంది.
Date & Time : 10:46 PM May 30, 2019
-
ప్రస్తుతానికి చాలాకీలకమైన ట్విస్ట్ తో మొదటి భాగం పూర్తయింది...
Date & Time : 10:40 PM May 30, 2019
-
ఈ సినిమాలో చిన్న ట్విస్ట్. ప్రస్తుతానికి పెద్ద గొడవ ప్రారంభం అయింది. వారు ప్రారంభించిన వ్యాపారం తమకే సొంతం కావాలని రెండు ముఠాలు కొట్టుకుంటున్నాయి...
Date & Time : 10:30 PM May 30, 2019
-
ఒక చిన్న గ్యాంగ్ వార్ నుండి కథ నడుస్తుంది.
Date & Time : 10:22 PM May 30, 2019
-
దర్శకుడు తారున్ భాస్కర్ పోలీసుగా ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 10:16 PM May 30, 2019
-
ఇపుడే ఒక హత్య జరిగింది. ఈ హత్య మొత్తం సన్నివేశాన్ని మార్చివేసింది. కాగా ఈ సినిమాకథ ప్రస్తుత రోజుకి చేరుకుంది. అయితే దాస్ మరియు అతని స్నేహితులు ఒక వ్యాపారాన్ని ప్రారంబించాలనుకుంటున్నారు.
Date & Time : 10:10 PM May 30, 2019
-
ఈ చిత్రంలో మొదటి పాట వస్తుంది. ప్రస్తుతానికి విశ్వక్ సేన్ ప్రేమలో ఉన్నాడు. ఈ పాటలో హైదరాబాద్ లోని లొకేషన్లు చాలా కొత్తగా చూపిస్తున్నారు...
Date & Time : 10:00 PM May 30, 2019
-
కాలేజీ బ్యాక్డ్రాప్లో కొన్ని వాస్తవిక పోరాట సన్నివేశాలు వస్తున్నాయి... సూపర్ త్రిల్లింగ్ కలిగించే విధంగా ఉన్నాయి ఈ సన్నివేశాలు. విశ్వక్ సేన్ తన నటనతో ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 09:52 PM May 30, 2019
-
ఈ చిత్రం ప్రారంభం అవడమే ఒక గ్యాంగ్ వార్ తో మొదలైంది. నటుడు విశ్వక్ సేన్ ఫలక్ నుమా దాస్ గా పరిచయం అయ్యాడు. పెద్ద మాస్ ఫైట్ ఇది.
Date & Time : 09:41 PM May 30, 2019
-
టైటిల్స్ ఆసక్తికరమైన రీతిలో వస్తున్నాయి. హైదరాబాద్ జీవిత శైలి తెరమీద అద్భుతంగా ప్రదర్శించబడింది.
Date & Time : 09:34 PM May 30, 2019
-
హాయ్... ఈ సినిమా ప్రారంభం అయింది. ఈ చిత్రం 150 నిముషాల నిడివి కలిగి ఉంది.
Date & Time : 09:30 PM May 30, 2019