-
మొత్తానికి ఒక ఎమోషనల్ నోట్ తో కథ సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 10:15 AM January 11, 2020
-
ఇప్పుడు క్లైమాక్స్ ఎపిసోడ్.ఒక ఊహించని ట్విస్ట్ తో ఎమోషనల్ క్లైమాక్స్ ఇది.మొత్తం కుటుంబం అంతా హీరో కోసం నిలబడ్డారు.
Date & Time : 10:10 AM January 11, 2020
-
అన్ని ట్విస్టులు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయి.రాజీవ్ కనకాల మరోసారి ఎంట్రీ ఇవ్వడంతో చిత్రం క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.
Date & Time : 10:06 AM January 11, 2020
-
ఈ ఫ్యామిలీ డ్రామాలో ఇప్పుడు మరో ట్విస్ట్ చేసుకుంది.విలన్ ఎపిసోడ్ మరోసారి వచ్చింది.సెకండాఫ్ లో మూమెంట్స్ బాగానే కథ బలహీన పడింది.
Date & Time : 10:02 AM January 11, 2020
-
ఇప్పుడొక పెళ్లి సాంగ్ వస్తుంది.మంచి ఫ్యామిలీ సన్నివేశాలు చూపిస్తున్నారు.
Date & Time : 09:52 AM January 11, 2020
-
సినిమాలోని మెయిన్ పాయింట్ ఇప్పుడు పక్కకు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది.కానీ వెన్నెల కిషోర్ ఎంట్రీ తర్వాత మంచి ఫన్ నడుస్తుంది.
Date & Time : 09:40 AM January 11, 2020
-
ఇప్పుడు సినిమా మన్నార్ కు షిఫ్ట్ అయ్యింది.సీనియర్ నటులు శరత్ బాబు మరియు సుహాసినిలు ఇప్పుడు జాయిన్ అయ్యారు.
Date & Time : 09:35 AM January 11, 2020
-
ఇప్పుడు వెన్నెల కిశోర్ ఎంట్రీ ఇచ్చారు.పలు కామెడీ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 09:30 AM January 11, 2020
-
కళ్యాణ్ రామ్ మరియు తనికెళ్ళ భరణిల మధ్య ఓ సమస్యకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 09:25 AM January 11, 2020
-
ఇప్పుడు సినిమాలోని రొమాంటిక్ ట్రాక్ వద్దంటే మొదలయ్యింది.ఈ సాంగ్ లో మెహ్రీన్ చాలా అందంగా కనిపిస్తుంది.
Date & Time : 09:20 AM January 11, 2020
-
ఇంటర్వెల్ అనంతరం నరేష్ పై కొన్ని కామెడీ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 09:15 AM January 11, 2020
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయతే ఏ చిత్రంలో ఉన్న మంచి పాయింట్ ను మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో బాగానే నడిపించారు.అయితే కొన్ని సన్నివేశాల్లో చిత్రం బాగానే సాగినా అక్కడక్కడా డల్ అయ్యాయి.మరి సెకండాఫ్ ఏమైనా కీలకంగా మారుతుందేమో చూడాలి.
Date & Time : 09:05 AM January 11, 2020
-
ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ కు సమయం ఆసన్నం అయింది.రాజీవ్ మరియు కళ్యాణ్ రామ్ ల మధ్య ఒక యాక్షన్ సీన్ తో సినిమా సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.
Date & Time : 09:00 AM January 11, 2020
-
ఇపుడు ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో మరో సింపుల్ ట్విస్ట్ చోటు చేసుకుంది.ఇప్పుడు చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 08:55 AM January 11, 2020
-
ఇప్పుడు చిత్రంలోకి మెయిన్ విలన్ రాజీవ్ కనకాల ఎంట్రీ ఇచ్చారు.అతను ఇసుక మాఫియాలో తిరుగులేని వాడిగా కనిపిస్తున్నాడు.ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 08:45 AM January 11, 2020
-
కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఒక కుటుంబానికి కొడుకుగా వెళ్ళాడు.వారితో కొన్ని ఎమోషనల్ సన్నివేశాల అనంతరం కథనంలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది
Date & Time : 08:40 AM January 11, 2020
-
ఎవరైతే అవసరాల్లో ఉంటారో వారికి బంధువులను పంపాలి అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం కాస్త వింతగా ఉంది.అలా ఇప్పటి వరకు వచ్చిన సన్నివేశాలు బాగానే చూపించారు.
Date & Time : 08:25 AM January 11, 2020
-
ఇప్పుడు సినిమాలోని రాహుల్ సిప్లిగంజ్ పాడిన మొదటి మాస్ సాంగ్ మొదలయ్యింది.ఇందులో లొకేషన్స్ బాగున్నాయి.
Date & Time : 08:15 AM January 11, 2020
-
కళ్యాణ్ రామ్ పలు కుటుంబాలకు తనదైన శైలిలో సహాయం చేస్తున్నాడు.తనకంటూ ఎవరూ లేనట్టుగా మెహ్రీన్ తన చిన్నప్పటి నుంచీ ఓ కంట కనిపెడుతూ వస్తుంది.ఇపుడు చిత్రం ఓ గ్రామానికి షిఫ్ట్ అయ్యింది.
Date & Time : 08:08 AM January 11, 2020
-
హీరో కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు.తనతో పాటూగా మెహ్రీన్ కూడా ఆమె ఒక షార్ట్ ఫిల్మ్ నిర్మాతగా కనిపిస్తుంది.
Date & Time : 08:02 AM January 11, 2020
-
ఇతరులకు సహాయం చేసే వ్యక్తిత్వం కలవాడిగా హీరో కనిపిస్తున్నాడు.ఇప్పుడొక విషాదం జరిగిన సన్నివేశం వస్తుంది.
Date & Time : 08:00 AM January 11, 2020
-
ఇప్పుడు కొన్ని చిన్ననాటి సన్నివేశాలతో సినిమా మొదలయ్యింది.
Date & Time : 07:55 AM January 11, 2020
-
హాయ్..144 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 07:50 PM January 11, 2020