
మొదటి షో వివరాలు : డ్యూడ్
ఒక వైవిధ్యమైన పాయింట్ తో సినిమా ముగుస్తుంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
స్టైలిష్ మూమెంట్స్ తో ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది.
ప్రదీప్ రంగనాథన్ గురించి ఓ నిజాన్ని తెలుసుకున్న మమిత షాక్ కి గురవుతుంది.
ఇప్పుడు కొన్ని ఎమోషనల్ మూమెంట్స్, కామెడీ సీక్వెన్స్ లు వస్తున్నాయి. ప్రదీప్ ముందుండి కథను నడిపిస్తున్నాడు.
కథలో మరో ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ మొదలైంది.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా ఎంగేజింగ్ గా సాగింది. కథ సింపుల్ గా ఉన్నా, ప్రదీప్ రంగనాథన్ అలరించే పెర్ఫార్మన్స్, ఫన్ మూమెంట్స్, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
ఒక ఫన్నీ ఎపిసోడ్ తో 'కేజీఎఫ్' గరుడ ఎంట్రీ ఇచ్చాడు. ఊహించని సీన్ తో సినిమా సగానికి చేరుకుంది.
ఓ షాకింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఈ ట్విస్ట్ ను ప్రదీప్, మమిత నమ్మలేకపోతున్నారు.
మమిత, ప్రదీప్ ల మధ్య కొన్ని ఫన్ సీన్స్ వస్తున్నాయి. ప్రదీప్ తన టైమింగ్ తో అలరిస్తున్నాడు.
కొన్ని కీలక సన్నివేశాల తర్వాత కథ ఎమోషనల్ గా సాగుతోంది.
పాడి పరిశ్రమ శాఖ మంత్రిగా శరత్ కుమార్ పరిచయం అయ్యారు. ఇప్పుడు బూమ్ బూమ్ పాట వస్తుంది.
ఓ ఫన్నీ సీన్ తో ప్రదీప్ రంగనాథన్ సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు. సత్య, నేహా శెట్టి కూడా పరిచయమయ్యారు.
హాయ్.. 2 గంటల 19 నిముషాలు నిడివితో సినిమా ఇప్పుడే మొదలైంది.