-
ఆసక్తికరమైన అంశంతో సినిమా ముగింపు దశకు చేరుకుంది. వివరణాత్మక సమీక్ష కోసం ఇక్కడ చూస్తూ ఉండండి.
Date & Time : 05:30 AM August 15, 2024
-
కీలకమైన ట్విస్ట్ రివీల్ కావడంతో, సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది.
Date & Time : 05:15 AM August 15, 2024
-
పోలీసులకు మరియు ఇద్దరు బిగ్ బుల్స్ మధ్యన పోరాట సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:10 AM August 15, 2024
-
బిగ్ బుల్ సాంగ్ కి సమయం ఆసన్నమైంది. సంజయ్ మరియు రామ్ లు తమ స్వాగ్ లతో ఆకట్టుకున్నారు. రామ్ ను మళ్ళీ పోలీసులు పట్టుకుంటారు.
Date & Time : 05:00 AM August 15, 2024
-
రామ్ మరియు షాయాజీ షిండే కి మధ్య కొన్ని కీలక సన్నివేశాల తర్వాత, శంకర్ పోలీసుల నుండి తప్పించుకుని బిగ్ బుల్‌ని మళ్లీ కలుస్తాడు. మరికొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:45 AM August 15, 2024
-
ఫ్లాష్ బ్యాక్ కి సంబందించిన సన్నివేశాలు ముగిశాయి. మార్ ముంతా సాంగ్ కి సమయం ఆసన్నమైంది.
Date & Time : 04:30 AM August 15, 2024
-
బిగ్ బుల్ మరియు శంకర్ మధ్య ఫ్లాష్‌బ్యాక్ లింక్ తో సెకండాఫ్ ప్రారంభమైంది.
Date & Time : 04:20 AM August 15, 2024
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: పూరీ జగన్నాథ్ తన మార్క్ డైలాగ్ లతో, తన స్టైల్ కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ బాగుంది. అలీ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. కొన్ని సన్నివేశాలు ముందుగానే ఊహించేవిధంగా ఉన్నాయి. మ్యూజిక్ పర్వాలేదు. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 04:15 AM August 15, 2024
-
భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఇంటర్వెల్ ఆసక్తిగా మారింది. రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 04:10 AM August 15, 2024
-
శంకర్ మరియు బిగ్ బుల్ ముఖాముఖి సన్నివేశాలు వస్తున్నాయి. కథలో కీలకమైన సన్నివేశాలతో సినిమా ఆసక్తిగా మారింది.
Date & Time : 04:00 AM August 15, 2024
-
బిగ్ బుల్ ఇండియాలో అడుగుపెడతాడు. అతనిని పట్టుకోవడానికి షాయాజీ షిండే పోలీసుగా వేచి ఉన్నాడు. కథలో చిన్న ట్విస్ట్ తర్వాత క్యా లఫ్డా సాంగ్ కి సమయం ఆసన్నమైంది.
Date & Time : 03:45 AM August 15, 2024
-
రామ్, సంజయ్ దత్ ల క్లాష్ తో సినిమా ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బుల్ గ్యాంగ్ తో రామ్ ఫైట్ చేస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:30 AM August 15, 2024
-
హీరోయిన్ కావ్యా థాపర్ పరిచయం అయ్యింది, రామ్ హీరోయిన్ ను టీజ్ చేస్తున్న సన్నివేశాలు తర్వాత, అలీ పరిచయం అయ్యాడు.
Date & Time : 03:20 AM August 15, 2024
-
హీరోయిన్ కావ్యా థాపర్ పరిచయం అయ్యింది, రామ్ హీరోయిన్ ను టీజ్ చేస్తున్న సన్నివేశాలు తర్వాత, అలీ పరిచయం అయ్యాడు.
Date & Time : 03:10 AM August 15, 2024
-
కథలో చిన్న ట్విస్ట్ తర్వాత, పూరీ జగన్నాథ్ స్టైల్ లో రామ్, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ గా ఫైట్ సీన్ తో పరిచయం అయ్యాడు.
Date & Time : 03:00 AM August 15, 2024
-
శంకర్ చిన్ననాటి సన్నివేశాల వచ్చిన తర్వాత, కొన్ని సంవత్సరాలకి సంజయ్ దత్ బిగ్ బుల్ గా ఒక ఫైట్ సీన్ తో పరిచయం అయ్యాడు.
Date & Time : 02:50 AM August 15, 2024
-
శంకర్ కి తల్లిగా ఝాన్సీ పరిచయం అయ్యింది. శంకర్ కి సంబందించిన చిన్ననాటి సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:45 AM August 15, 2024
-
హాయ్, 2 గంటల 42 నిమిషాల నిడివి గల డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఇప్పుడే ప్రారంభం అయ్యింది.
Date & Time : 02:40 AM August 15, 2024