-
సినిమా ఆనందంగా ముగుస్తుంది. దిల్ రూబా గురించి వివరణాత్మక సమీక్ష కోసం ఇక్కడ చూస్తూ ఉండండి.
Date & Time : 10:00 PM Feb 13, 2025
-
జాన్ విజయ్ ప్రస్తుతం సీన్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. తన ఎంట్రీతోనే కథలో ఒక చిన్న ట్విస్ట్ తెస్తాడు. ముఖ్యంగా అతను సిద్ధు కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. ఈ క్రమంలో ఆ సంబంధిత సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:45 PM Feb 13, 2025
-
జాన్ విజయ్ ప్రస్తుతం సీన్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. తన ఎంట్రీతోనే కథలో ఒక చిన్న ట్విస్ట్ తెస్తాడు. ముఖ్యంగా అతను సిద్ధు కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. ఈ క్రమంలో ఆ సంబంధిత సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:35 PM Feb 13, 2025
-
అంజలితో సిద్ధూ సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కథ ఒక ఉద్రిక్తమైన మలుపు తీసుకుంది.
Date & Time : 09:20 PM Feb 13, 2025
-
మ్యాగీ, సిద్దు కాలేజీకి వస్తోంది. ఈ క్రమంలో మ్యాగీ - సిద్ధు మధ్య సన్నివేశాలు నడుస్తున్నాయి. ఒక చిన్న ట్విస్ట్ కూడా వచ్చింది. అన్నట్టు ఈ సన్నివేశాల క్రమంలో కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా వస్తున్నాయి.
Date & Time : 09:05 PM Feb 13, 2025
-
సినిమా సెకండ్ హాఫ్ న్యూయార్క్లో ప్రారంభమైంది, అక్కడ సిద్ధు లవ్ లైఫ్ ను సెట్ చెయ్యడానికి మ్యాగీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కొన్ని సీన్స్ సాగుతున్నాయి
Date & Time : 08:50 PM Feb 13, 2025
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: సినిమా ఫస్ట్ హాఫ్ ఇప్పటివరకు బాగానే ఉంది. కిరణ్ అబ్బవరం నటన కూడా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 08:40 PM Feb 13, 2025
-
సమస్య మరింత తీవ్రమవుతుంది, చివరకు అంజలి షాకింగ్ నిర్ణయానికి ఆ సమస్య దారితీస్తుంది. ఇప్పుడు విరామం సమయం. సినిమాకి ఇంటర్వెల్ పడింది
Date & Time : 08:30 PM Feb 13, 2025
-
సిద్ధు మరియు ఒక కాలేజీ స్టూడెంట్ మధ్య జరిగిన ఫైట్ అతన్ని కలవరపెడుతుంది, దీంతో అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం కారణంగా వారిద్దరి మధ్య ఫైట్ కి దారితీస్తుంది.
Date & Time : 08:20 PM Feb 13, 2025
-
ఎట్టకేలకు చివరకు సిద్ధు మ్యాగీతో తన బ్రేకప్ గురించి అంజలి ముందు
ఒప్పుకుంటాడు. పైగా అంజలి పై ఫీలింగ్స్ ను పెంచుకుంటాడు . ఈ క్రమంలో ‘హే జింగిలి’ సాంగ్ వస్తోంది.
Date & Time : 08:05 PM Feb 13, 2025
-
అంజలి సిద్ధును ఆటపట్టిస్తూ ఉంది. అతనికి చిరాకు తెప్పిస్తూ తాను ఆనందిస్తుంది. వారి మధ్య మరిన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 07:50 PM Feb 13, 2025
-
సిద్ధు మంగళూరుకు వెళ్లి ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు. కాలేజీలో సిద్దు సన్నివేశాలు వచ్చాయి. అదే కాలేజీలో సిద్దు అంజలి (రుక్సర్ ధిల్లాన్) ని కలుస్తాడు. వారిద్దరి మధ్య సంభాషణలు సరదాగా ఉన్నాయి. ఫన్ టోన్ లో కొన్ని సీన్స్ సాగుతున్నాయి.
Date & Time : 07:35 PM Feb 13, 2025
-
సిద్ధు (కిరణ్ అబ్బవరం) బ్రేకప్ తర్వాత జీవితాన్ని చాలా స్పష్టంగా చిత్రీకరించారు. అనంతరం కథనం యూఎస్ఏకి మారింది, అక్కడ మ్యాగీ (కేథీ డేవిసన్) లైఫ్ ను రివీల్ చేశారు.
Date & Time : 07:25 PM Feb 13, 2025
-
హాయ్, సినిమా ఇప్పుడే మొదలైంది. ఈ చిత్రం మొత్తం 152 నిమిషాలు (2 గంటల 32 నిమిషాలు) నిడివి ఉంది.
Date & Time : 07:15 PM Feb 13, 2025