మొదటి షో వివరాలు : ధురంధర్ 2
ఉత్కంటభరితంగా సాగే క్లైమాక్స్ తో సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను ఫాలో అవ్వండి.
ఇప్పుడు కొన్ని ఫన్ మూమెంట్స్ వస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
ఇపుడు అల్టిమేట్ రివెంజ్ కి టైమ్ అయింది. హంజా ఒక మాస్టర్ ప్లాన్ తో శత్రువులను అంతం చేస్తాడు.
భరతమాత పై ఓ అదిరిపోయే ఎలివేషన్ రావడంతో థియేటర్ లో విజిల్స్, చప్పట్ల తో రెచ్చిపోయారు.
కథ ఇప్పుడు కొన్ని అనుకోని ఘటనలతో ఊహించని మలుపు తీసుకుంది.
ఇంటర్వెల్ లో వచ్చిన రివీల్ తో ఇప్పుడు టెన్స్ మూమెంట్స్ వస్తున్నాయి. రణ్ వీర్ సింగ్ పాత్రను ప్రెజెంట్ చేస్తున్న తీరు బాగుంది.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా ఆసక్తికరంగా సాగింది. ఇంటెన్స్ యాక్షన్, పొలిటికల్ డ్రామా, ల్యారి కింగ్ గా రణ్వీర్ సింగ్ ఎలా ఎదిగాడు అనేవి బాగున్నాయి. మ్యూజిక్ పర్వాలేదు. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తర్వాత సినిమా సగానికి చేరుకుంది.
ఇప్పుడు రాజకీయం చుట్టూ కథ సాగుతుంది. ల్యారి బాద్షాహ్ గా హంజా అలీ మజారీ ఎలా ఎదుగుతున్నాడు అనేది చూపిస్తున్నారు.
ఇప్పుడు కథలో కొన్ని కీలక ఘటనల చోటు చేసుకోవడంతో ఫోకస్ పాకిస్తాన్ గ్యాంగ్ వార్స్ వైపు మళ్ళింది.
సినిమా కథలో గంటసేపు జస్కిరాత్ సింగ్ రంగీ మరియు అతని కుటుంబానికి సంబంధించిన నేపథ్యం చూపెట్టారు.
సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికి ఓ సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్ వస్తుంది. పార్ట్ 2 కూడా చాప్టర్ వైజ్ ప్రకారం నడుస్తుంది.
గందరగోళ పరిస్థితులను ఎదుర్కొని ఎట్టకేలకు 'ధురంధర్ 2' సినిమా థియేటర్స్ లో ల్యాండ్ అయింది.