-
ఒక థ్రిల్లింగ్ హై తో అలాగే ఓ సస్పెన్స్ గా మారిన ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ సినిమా ముగిసింది. దేవర పార్ట్ 1 సమీక్ష కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 04:15 AM September 27, 2024
-
ఇప్పుడు సముద్రంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ కి రంగం సిద్ధమైంది. అలాగే ప్రకాష్ రాజ్ ఒక ఊహించని ట్విస్ట్ ని కథనంలో వివరించారు. దీనికి తోడు అనిరుద్ క్రేజీ మ్యూజిక్ ఈ సీక్వెన్స్ ని మరింత ఎగ్జైటింగ్ గా మార్చింది.
Date & Time : 04:00 AM September 27, 2024
-
భైర 12 ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. తన పాత్రపై పలు ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 03:45 AM September 27, 2024
-
ఆ ఊరి కుస్తీ పోటీల్లో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు తారక్ పై మరిన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 03:30 AM September 27, 2024
-
ఇప్పుడు వర గా మరో తారక్ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఛార్మింగ్ లుక్స్ తో తంగం గా జాన్వీ కపూర్ పరిచయం అయ్యింది. ఇప్పుడు ఇద్దరి మధ్య కొన్ని ఫన్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 03:15 AM September 27, 2024
-
ఇంటర్వెల్ అనంతరం.. భైర పై కొన్ని సీన్స్ తో సినిమా మొదలైంది. ప్రస్తుతం పాత్రల డెవలప్మెంట్ కి సంబంధించిన సన్నివేశాలు కొనసాగుతున్నాయి.
Date & Time : 03:00 AM September 27, 2024
-
ఫస్టాఫ్ అప్డేట్:
ఇప్పటి వరకు సినిమా డీసెంట్ గా సాగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి. దేవర గా తారక్ అదరగొట్టాడు. అలాగే సైఫ్ కూడా తన రోల్ బాగా చేశారు. అనిరుద్ తన స్కోర్ తో సీన్స్ ని ఎలివేట్ చేసాడు. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 02:45 AM September 27, 2024
-
ఒక క్రేజీ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత పవర్ఫుల్ నోట్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం..
Date & Time : 02:40 AM September 27, 2024
-
దేవర తన నిర్ణయాన్ని ప్రకటించేసిన తర్వాత భైర కొన్ని వికృత ఆలోచనలు చేయడం మొదలు పెడుతున్నాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:30 AM September 27, 2024
-
ఇప్పుడు ఎన్టీఆర్ కి తన గ్యాంగ్ కి నేవల్ అధికారుల నడుమ ఇంట్రెస్టింగ్ క్లాష్ సీన్ వస్తుంది. ఈ క్రమంలో తారక్ ఆలోచనలో ఒక మార్పు వచ్చింది.
Date & Time : 02:15 AM September 27, 2024
-
ఇప్పుడు తారక్, సైఫ్ నడుమ ఓ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది. ఈ క్రమంలో ఆ ఊరిలో ఒక విషాదం జరిగింది.
Date & Time : 02:00 AM September 27, 2024
-
కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు అనంతరం ఎన్టీఆర్, తన కొడుకు అలాగే భైర కొడుకు నడుమ కొన్ని సీరియస్ సన్నివేశాలు ఆయుధ పూజ ముందు వచ్చాయి. ఇప్పుడు అవైటెడ్ ఆయుధ పూజ సాంగ్ మొదలైంది.
Date & Time : 01:45 AM September 27, 2024
-
ఇప్పుడు ప్రకాష్ రాజ్ మాటలతో సముద్రం నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న తారక్ సన్నివేశాలు వస్తున్నాయి. సాలిడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సీన్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి.
Date & Time : 01:30 AM September 27, 2024
-
యతి అనే ఓ వ్యక్తిని వెతుకుతున్న సన్నివేశాలతో నటుడు అజయ్ అలాగే తన టీం పరిచయం అయ్యారు. సీన్స్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. అలాగే భైర గా సైఫ్ అలీఖాన్ పరిచయం అయ్యాడు.
Date & Time : 01:20 AM September 27, 2024
-
177 నిమిషాల నిడివి గల దేవర సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 01:10 AM September 27, 2024
-
తారక్ అభిమానుల కోలాహలంతో 'దేవర' ప్రత్యేక స్క్రీనింగ్ ఇప్పుడు మొదలు కాబోతోంది. అభిమానులంతా పండుగ వాతావరణంని తలపిస్తున్నారు.
Date & Time : 01:00 AM September 27, 2024