-
-
దేవ్ చివరకి తాను అనుకున్న మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తాడు.సినిమా పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 09:30 AM February 14, 2019
-
కార్తీ ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు,ఆ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 09:15 AM February 14, 2019
-
ఇప్పుడే ఒక చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది.సినిమా ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా సాగుతుంది.
Date & Time : 09:00 AM February 14, 2019
-
మొత్తానికి మేఘన, దేవ్ ప్రేమను అంగీకరించింది.ఇప్పుడు మరో పాట చెలియా అడుగుదామా పాట వస్తుంది.ఈ సాంగ్ మైఖేల్ జాక్సన్ బిల్లీ జీన్ తరహా బీట్స్ తో బాగుంది.
Date & Time : 08:40 AM February 14, 2019
-
హీరో హీరోయిన్ల డేట్ లో ఇద్దరి మధ్య మాటలు నడుస్తున్నాయి.ఇప్పుడే ఒక వంద సార్లు పాట మొదలయ్యింది.
Date & Time : 08:22 AM February 14, 2019
-
ఇంటర్వెల్ తర్వాత వేరే సిటీలో ఉన్న రకుల్ ని కలిసేందుకు కార్తీ రైడ్ మొదలు పెట్టారు.
Date & Time : 08:16 AM February 14, 2019
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : సినిమా సగం పూర్తయ్యే సరికి ఇప్పటి వరకు పెద్ద గొప్పగా ఏమి అనిపించలేదు.ఏదో కొన్ని సన్నివేశాల మినహా పెద్దగా ఆకట్టుకొనే విధంగా ఏమి లేదు.
Date & Time : 08:10 AM February 14, 2019
-
సినిమా ఇప్పుడు సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.
Date & Time : 08:06 AM February 14, 2019
-
మరో హీరోయిన్ నిక్కీ గాల్రిన్ ఇప్పుడు పరిచయం కాబడ్డారు.కార్తీ ఆమెను కొంత మంది ఆకతాయిల నుంచి కాపాడుతున్నారు,ఆ సంబంధిత పోరాట సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 07:52 AM February 14, 2019
-
ఇప్పుడే మై గర్ల్ పాట మొదలయ్యింది.రకుల్ ఎప్పటిలానే గ్లామరస్ గా కనిపిస్తుంది.కార్తీ తన మార్క్ సింపుల్ స్టెప్స్ తో ఆకట్టుకుంటున్నారు.
Date & Time : 07:45 AM February 14, 2019
-
రకుల్ మరియు కార్తీలు మొదటి సారిగా కలుసుకున్నారు. రకుల్ తల్లిగా రమ్యకృష్ణ ఇప్పుడు పరిచయం అయ్యారు.
Date & Time : 07:38 AM February 14, 2019
-
దేవ్ తండ్రిగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.ఇద్దరి మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 07:33 AM February 14, 2019
-
కార్తీ మరియు అతని స్నేహితుల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:28 AM February 14, 2019
-
హీరోయిన్ రకుల్ ప్రీత్(మేఘన) యంగ్ వ్యాపారవేత్తగా ఇప్పుడే పరిచయం కాబడ్డారు.సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 07:17 AM February 14, 2019
-
ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉక్రెయిన్ కి వెళ్లాయి,ఇప్పుడే రేయ్ బావ దేవ్ పాట మొదలయ్యింది.ఈ పాటలో కార్తీ తన స్నేహితులతో చేస్తున్న అడ్వెంచర్స్ కి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:05 AM February 14, 2019
-
ఇప్పుడు దేవ్ స్నేహితుడు రామలింగం వారి చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ కథ చెప్తున్నారు.
Date & Time : 06:59 AM February 14, 2019
-
సినిమా మొదలవ్వడమే ఒక అడ్వెంచర్ షాట్ తో మొదలయ్యింది.కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కార్తీ మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నారు.
Date & Time : 06:54 AM February 14, 2019
-
హాయ్..158 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 06:50 AM February 14, 2019