-
క్లైమాక్స్ లో ఒక భారీ పోరాట సన్నివేశంతో సినిమా పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 08:05 AM January 09, 2020
-
ఇప్పుడు చిత్రం క్లైమాక్స్ దిశగా చేరుకుంటుంది.సునీల్ శెట్టి గ్యాంగ్ పై దాడి చేసేందుకు రజిని సిద్ధం అవుతున్నారు.
Date & Time : 07:57 AM January 09, 2020
-
ఇప్పుడు పోలీసులు మరియు సునీల్ శెట్టిల మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:50 AM January 09, 2020
-
ఇప్పుడు నివేత థామస్ కు సంబంధించి ఎమోషనల్ సీన్ అనంతరం రజినీ బ్యాడ్ కాప్ గా మళ్ళీ తన ఆట మొదలు పెట్టారు.
Date & Time : 07:40 AM January 09, 2020
-
ఇప్పుడు అన్ని ఎన్కౌంటర్స్ తో ఆదిత్య అరుణాచలం న్యాయం చేసాడు.ఇప్పుడు రజినీ సునీల్ శెట్టి కోసం వెతకడం స్టార్ట్ చేసారు.
Date & Time : 07:28 AM January 09, 2020
-
ఇప్పుడు మరో ఫైట్ కు రంగం సిద్ధం అయ్యింది...తలైవర్ థీమ్ సాంగ్ తో రజినీ మార్క్ డాన్స్ మూమెంట్స్ వేస్తున్నారు.
Date & Time : 07:15 AM January 09, 2020
-
ఇంటర్నేషనల్ డాన్ హరి చోప్రా(సునీల్ శెట్టి) ఇండియాలో ల్యాండ్ అయ్యాడు.ఇప్పుడు అతను తన మనుషుల ద్వారా రజినీ వివరాలు కనుక్కుంటున్నాడు.
Date & Time : 07:11 AM January 09, 2020
-
ఇంటర్వెల్ అనంతరం నయన్ బంధువుల ఇంట్లో ఒక పెళ్లితో మొదలయ్యింది.ఇక్కడ డుం డుం వెడ్డింగ్ సాంగ్ వస్తుంది.
Date & Time : 07:07 AM January 09, 2020
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అంతా ఒకే అని చెప్పొచ్చు.రజినీను ఎలివేట్ చేసే సీన్స్ తో డీసెంట్ గా సాగింది.మరి సెకండాఫ్ ను మురుగదాస్ ఇంకా సంథింగ్ స్పెషల్ గా ఎమన్నా తెరకెక్కించారో లేదో చూడాలి.
Date & Time : 06:58 AM January 09, 2020
-
ఇప్పుడు రజిని మార్క్ డైలాగ్ "ఐమ్ ఏ బ్యాడ్ కాప్" చెప్తూ సినిమా సగానికి చేరుకుంది.
Date & Time : 06:55 AM January 09, 2020
-
ఇప్పుడు హరి చోప్రాగా నటుడు సునీల్ శెట్టి పరిచయం అయ్యారు.అతనికి సంబంధిత సీన్స్ వస్తూనే కథనంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 06:50 AM January 09, 2020
-
ప్రతీక్ బాబర్ విషయంలో ఒక చిన్న ట్విస్ట్ రివీల్ అయ్యింది.ఇప్పుడు తలైవర్ ఆట మొదలయ్యింది..
Date & Time : 06:36 AM January 09, 2020
-
రజినీ మరియు నయన్ ల మధ్య కొన్ని మంచి సన్నివేశాలు ప్రత్యేక మార్గం సాంగ్ వైపుగా తీసుకెళ్లాయి.
Date & Time : 06:30 AM January 09, 2020
-
రజినీ మరియు నయన్ ల మధ్య సీన్స్ కొనసాగుతున్నాయి.అలాగే రజినీ మరియు యోగి బాబుల మధ్య కామెడీ సీన్స్ బాగున్నాయి.
Date & Time : 06:19 AM January 09, 2020
-
ఇప్పుడు హీరోయిన్ నయనతార ఎంట్రీ ఇచ్చారు.రజినీ ఆమెను తన ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్ "ఇప్పుడు చూడు" అంటూ కలిశారు.
Date & Time : 06:12 AM January 09, 2020
-
ఇప్పుడు బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్ (అజయ్ మల్హోత్రా) అమ్మలనూ అక్రమంగా తరలించే మాఫియా హెడ్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 06:06 AM January 09, 2020
-
ఇప్పుడు కథనం కాస్త సీరియస్ గా మారింది.ఓ డిప్యూటీ సీఎం కూతురు కిడ్నాప్ అవ్వగా ఆ కేసును రజినీ విచారిస్తున్నారు.మురుగదాస్ మార్క్ లో ఈ సీన్ ఆసక్తికరంగా సాగుతుంది.
Date & Time : 05:59 AM January 09, 2020
-
ఇప్పుడు స్టార్ కమెడియన్ యోగిబాబు రజిని అసిస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:54 AM January 09, 2020
-
ఆదిత్య అరుణాచలం ముంబై నుంచి ఢిల్లీకి ట్రాన్సఫర్ కావడంతో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పూర్తయ్యింది.
Date & Time : 05:52 AM January 09, 2020
-
ఇప్పుడు కత్తితో అసలు సిసలైన తలైవర్ రజినీ మార్క్ మాస్ ఎంట్రీ ఎంట్రీ పడింది.పోలీస్ గెటప్ లో రజినీ స్టైలిష్ కాప్ గా అదరగొడుతున్నారు.
Date & Time : 05:44 AM January 09, 2020
-
సూపర్ స్టార్ రజినీ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు.కొన్ని గ్యాంగ్ స్టర్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:39 AM January 09, 2020
-
సీక్రెట్ గా ఆదిత్య అరుణాచలం ఒక గ్యాంగ్ స్టర్ సెటప్ చెయ్యడంతో టైటిల్స్ మొదలయ్యాయి.
Date & Time : 05:35 AM January 09, 2020
-
హాయ్...160 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 05:30 AM January 09, 2020