
మొదటి షో వివరాలు : కూలీ
ఒక ఎమోషనల్ నోట్‌తో సినిమా ముగుస్తుంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
ఇక ఇప్పుడు సాలిడ్ క్యామియోలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు.
రజినీకాంత్‌ను ఎదుర్కొనే సీన్స్‌లో నాగార్జున బీస్ట్ మెడ్‌లోకి మారాడు.
బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్‌లతో కథ ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది.
లోకేష్ కనగరాజ్ ఇంటెన్స్ సీన్స్, బలమైన రైటింగ్‌తో కథపై పట్టు బిగిస్తున్నాడు. రజినీ, శ్రుతి హాసన్, సౌబిన్‌ల మద్య ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి.
సౌబిన్‌తో పోర్ట్ వద్ద వచ్చే సీన్స్‌లో వింటేజ్ రజినీకాంత్ ఆకట్టుకున్నాడు. తలైవా తన ఆట మొదలుపెట్టాడు.
సత్యరాజ్, సౌబిన్ షాహిర్ మధ్య ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో సెకండాఫ్ మొదలైంది.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా కొంత కన్ఫ్యూజింగ్‌గా, యావరేజ్‌గా సాగింది. నాగార్జున, అనిరుధ్ స్కోర్ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రజినీకాంత్‌తో సెకండాఫ్‌లో ఎలాంటి మ్యాజిక్ చేయిస్తాడో చూడాలి.
ఫ్లాష్‌బ్యాక్ ముగియడంతో ఇంటర్వెల్‌కు టైమ్ అయింది.
కొన్ని ట్విస్టుల తర్వాత ఇప్పుడు కథ ఫ్లాష్‌బ్యాక్‌కు షిఫ్ట్ అయింది.
‘ఐ యామ్ డేంజర్’ పాటలో నాగార్జున వేరే లెెవెల్‌గా ఉన్నాడు. అనిరుధ్ మరోసారి తన బాణీలతో ఇరగదీశాడు.
దేవా-సైమన్ ఎదురుపడే సీన్ ఫ్యాన్స్‌కు సాలిడ్ ట్రీట్ ఇచ్చింది.
సెన్సేషనల్ మోనికా సాంగ్‌కు టైమ్ వచ్చింది. పూజా హెగ్డేతో పాటు సౌబిన్ ఫైర్ పుట్టించారు.
ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో సత్యరాజ్‌కు సంబంధించి కొన్ని సీన్స్ వస్తున్నాయి.
సైమన్‌గా వయొలెంట్ యాక్షన్ సీక్వెన్స్‌లో నాగ్ తనదైన స్వాగ్ చూపిస్తున్నాడు.
రజినీ వైజాగ్‌కు వస్తాడు. ఎమోషనల్ సాంగ్‌లో శ్రుతి హాసన్ సింపుల్ ఎంట్రీ ఇస్తుంది.
కథ చెన్నైకి షిఫ్ట్ అయింది. చికిటు వైబ్ సాంగ్‌తో రజినీకాంత్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.
ఓ షిప్‌యార్డ్‌లో కథ మొదలవుతుంది. సౌబిన్ షాహిర్ సింపుల్ ఎంట్రీతో వస్తాడు. సైమన్‌గా స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున.
హాయ్.. ‘కూలీ’ యూఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్డేట్స్ మీ కోసం..!