మొదటి షో వివరాలు : కామ్రేడ్ కళ్యాణ్
కొన్ని ఆసక్తికర సన్నివేశాల తర్వాత, సినిమా ఓ మంచి నోట్‌పై ముగుస్తుంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
కథలో ఇప్పుడొక చిన్న ట్విస్ట్ వస్తుంది. శ్రీవిష్ణు, సాయి చంద్‌ల మధ్య ఓ ముఖ్యమైన సీన్ నడుస్తోంది.
తమ సమస్య పరిష్కారం కోసం శ్రీవిష్ణు, సత్య ఇద్దరు శ్రీకాంత్ అయ్యంగార్ వద్దకు వెళ్తారు.
ఒక అనుకోని పరిస్థితిలో శ్రీ విష్ణు చిక్కుకుంటాడు. అందులో నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా డీసెంట్ గా సాగింది. కొన్ని కామెడీ సీన్స్ క్లిక్ అవ్వగా, శ్రీ విష్ణు తన కామెడీ టైమింగ్ తో నవ్విస్తాడు. ఇంటర్వెల్ సినిమా పై ఆసక్తి క్రియేట్ చేస్తుంది. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
ఒక షూటౌట్ సీన్ తో కథ సగానికి చేరుకుంది.
హీరోయిన్ గురించి ఓ ముఖ్యమైన విషయం తెలుసుకున్న హీరో షాక్‌కు గురవుతాడు.
దుబాయ్ నుంచి వచ్చిన ధనవంతుడిగా, శ్రీవిష్ణు స్నేహితుడిగా సత్య పరిచయం అయ్యాడు.
ఒక ఒడియా అమ్మాయిగా మహిమ నంబియార్ పరిచయం అయ్యింది. ఆమెను ఆకట్టుకునేందుకు హీరో ప్రయత్నిస్తున్నాడు.
ఒక విప్లవ గీతంతో శ్రీవిష్ణు ఎంట్రీ ఇచ్చాడు. గ్రామస్థులను ఆయన చైతన్యపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు.
1990ల నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రాంతంలో సినిమా కథ మొదలవుతుంది. ఒక స్పెషల్ ఆఫీసర్ పాత్రలో షైన్ టామ్ చాకో పరిచయం అవుతాడు.
హాయ్.. 2 గంటల 25 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.