-
చివరకు విలన్ల బారి నుండి తన సోదరిని సందీప్ కిషన్ రక్షించుకున్నాడు. చిత్రం హ్యాపీ ఎండింగ్ అయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 6:34 AM November 10, 2017
-
చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. హీరో విలన్ మధ్య హోరాహోరీ ఫైట్ వస్తోంది.
Date & Time : 6:24 AM November 10, 2017
-
చిత్ర అసలు కథ రివీల్ అయింది. సందీప్ కిషన్ తన సోదరిని మరియు స్నేహితుడు విక్రాంత్ ని రక్షించే పనిలో పడ్డాడు.
Date & Time : 6:14 AM November 10, 2017
-
హీరోకి విలన్ కి మధ్య మైండ్ గేమ్ కి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి. పోలీస్ లు విలన్ గ్యాంగ్ లోని కీలక వ్యక్తిని సందీప్ కిషన్ సాయంతో అరెస్ట్ చేశారు.
Date & Time : 6:04 AM November 10, 2017
-
విలన్ ని గుర్తించడానికి సందీప్ కిషన్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం 'రుద్రాక్ష' అనే సాంగ్ వస్తోంది.
Date & Time : 5:54 AM November 10, 2017
-
మైండ్ గేమ్ నేపథ్యంలో ఉత్కంఠగా సాగే సన్నివేశంతో ఆసక్తికరంగా ఫస్ట్ హాఫ్ ముగిసింది. ఇప్పుడు ఇంటర్వెల్.
Date & Time : 5:45 AM November 10, 2017
-
చిత్ర కథ నెమ్మదిగా వేగం పుంజుకుంది. హీరో మరియు అతడి స్నేహితులపై విలన్ గ్యాంగ్ అటాక్ మొదలైంది.
Date & Time : 5:38 AM November 10, 2017
-
కొన్ని అందమైన సన్నివేశాల తరువాత చిత్రంలో మరో పాట 'మొదలవుతోందా' వస్తోంది.
Date & Time : 5:32 AM November 10, 2017
-
సందీప్ కిషన్ మెహ్రీన్ ప్రేమలో పడ్డాడు. ఆమెని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 5:28 AM November 10, 2017
-
కమెడియన్ ప్రవీణ్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం హాస్యభరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 5:20 AM November 10, 2017
-
స్నేహాన్ని వివరించే కొన్ని సన్నివేశాల తరువాత 'ఏచచ ఏచచ' అనే సాంగ్ వస్తోంది. సాంగ్ ని నైట్ మోడ్ లో చిత్రీకరించారు.
Date & Time : 5:13 AM November 10, 2017
-
హీరోయిన్ మెహ్రీన్ ఎంట్రీ ఇచ్చింది. మెహ్రీన్ లుక్స్ చాలా బావున్నాయి. ప్రస్తుతం కాలేజీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 5:03 AM November 10, 2017
-
సందీప్ కిషన్ మరో స్నేహితుడిగా తమిళ నటుడు విక్రాంత్ ఎంటర్ అయ్యాడు. విలన్ గ్యాంగ్ కి అతడికి మధ్య ఆసక్తి కరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 4:58 AM November 10, 2017
-
కమెడియన్ సత్యతో పాటు మరి కొందరు నటులు సందీప్ కిషన్ స్నేహితులుగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 4:51 AM November 10, 2017
-
నటుడు హరీష్ ఉత్తమన్ కిరాయి హంతకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 4:47 AM November 10, 2017
-
టైటిల్స్ రోల్ అవుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో సదా మంచి కోరకు సాంగ్ ప్లే అవుతోంది.
Date & Time : 4:44 AM November 10, 2017
-
చిత్రం వైజాగ్ నగరంలో ప్రారంభం అయింది. సందీప్ కిషన్ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం భాదాకరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 4:40 AM November 10, 2017
-
హాయ్..126 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 4:35 AM November 10, 2017