-
మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:10 AM February 26, 2021
-
ఇప్పుడు క్లైమాక్స్ టైం..ఓ ఊహించని యూనిక్ సీన్ ఈ కేసు విషయంలో వస్తుంది. అలాగే ఇది ఒక డిఫరెంట్ ఎండింగ్ లా కూడా ఉంది.
Date & Time : 11:00 AM February 26, 2021
-
ఇప్పుడు కథనంలో మరో ఆసక్తికర ట్విస్ట్ చోటు చేసుకుంది. నితిన్ తన ఉరి శిక్షకు ముందు మరో కీలక చెస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇలా సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 10:55 AM February 26, 2021
-
రకుల్ నితిన్ కు రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష ఇప్పించేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆ సంబంధింత ఆసక్తికర సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 10:50 AM February 26, 2021
-
ఇప్పుడొక స్టైలిష్ ఫైట్ సీన్ వస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. నితిన్ ఈ చెస్ ఛాంపియన్ షిప్ లో గెలవకూడదని ఎవరో అతన్ని ఆపాలని చూస్తున్నారు.
Date & Time : 10:40 AM February 26, 2021
-
ఇప్పుడు కొత్త జైలర్ హా సంపత్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతను నితిన్ కు మరింత తలనొప్పిగా మారాడు.
Date & Time : 10:30 AM February 26, 2021
-
ఇప్పుడు నితిన్ ఆ చెస్ ఛాంపియన్ షిప్ ను నెగ్గాడు. అలాగే మెల్లగా ఓ తెలివైన ఆటగాడిగా కూడా మారుతున్నాడు. కానీ ఈ మొత్తం డ్రామా అంతటి వెనుక ఎవరో ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.
Date & Time : 10:25 AM February 26, 2021
-
రకుల్ ప్రీత్ కూడా ఈ కేసును విన్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. ఓ పక్క కోర్ట్ మరియు మరోపక్క చెస్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:15 AM February 26, 2021
-
ఇప్పుడు నితిన్ చెస్ ఛాంపియన్ షిప్ కు సంబంధించి మరిన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:10 AM February 26, 2021
-
ఇంటర్వెల్ అనంతరం ప్రియా రోల్ పై మరో పెద్ద ట్విస్ట్ రివీల్ అయ్యింది. నితిన్ ఈ కేస్ విషయంలో చాలా డిజప్పాయింట్ గా ఉన్నాడు.
Date & Time : 10:05 AM February 26, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు అంతా ఓకే అని చెప్పొచ్చు. స్టార్టింగ్ కాస్త స్లో అనిపించినా మెల్లగా సినిమాలోని యూనిక్ పాయింట్ వరకు తీసుకెళ్లింది.అలాగే నితిన్ చాలా బాగా చేసాడు. ఇంటర్వెల్ సమయానికి ఓ ఆసక్తికర ట్విస్ట్ తో సెకండాఫ్ పై మరింత ఆసక్తి రేపింది. ఇక ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 09:55 AM February 26, 2021
-
ఇపుడు ఇంటర్వెల్ బ్యాంగ్ టైం..ఓ చెస్ గేమ్ స్టార్ట్ అయ్యింది, ఓ పక్క తన కేసు ఓడినా గేమ్ లో మాత్రం గెలిచాడు. ఓ యూనిక్ పాయింట్ తో ఇపుడు సినిమా బ్రేక్ కు వచ్చింది. ఇప్పుడు విరామం.
Date & Time : 09:50 AM February 26, 2021
-
తన కేసులో ఓ చిన్న ట్విస్ట్ ఇప్పుడు చోటు చేసుకుంది. రకుల్ ఈ కేసు నుంచి దూరంగా వెళ్తుండడంతో సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 09:45 AM February 26, 2021
-
ఓ పక్క రకుల్ నితిన్ కేసులో పోరాడుతుంది మరో పక్క చెస్ ఎపిసోడ్స్ కూడా హైలైట్ గా కనిపిస్తున్నాయి. అలాగే నితిన్ చెస్ ఆటలో ఇంకా పెద్ద ప్లేయర్ గా ఎదుగుతున్నాడు.
Date & Time : 09:40 AM February 26, 2021
-
ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న ఒక్క సాంగ్ స్టార్ట్ అయ్యింది. ప్రియా ప్రకాష్ గ్లామరస్ గా కనిపిస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో కూడా మరో ట్విస్టు...
Date & Time : 09:35 AM February 26, 2021
-
ఇప్పుడు నితిన్ తన ఫ్లాష్ బ్యాక్ కోసం రకుల్ కి చెప్తున్నాడు. ప్రియా ప్రకాష్ ఎంట్రీ ఇచ్చింది. నితిన్ కు మరియు ఆమెకు మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 09:20 AM February 26, 2021
-
నితిన్ సహచర ఖైదీగా నటుడు సాయి చంద్ ఎంట్రీ ఇచ్చాడు. నితిన్ కి అతను చెస్ ఆట కోసం నేర్పిస్తున్నాడు. అలాగే మరోపక్క రకుల్ నితిన్ కేసును టేకప్ చేసింది.
Date & Time : 09:10 AM February 26, 2021
-
జైలర్ గా మురళీ శర్మ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు నితిన్ తన ఫ్లాష్ బ్యాక్ కోసం చెప్తున్నాడు. లాయర్ గా రకుల్ కూడా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 08:55 AM February 26, 2021
-
ఓ కోర్ట్ సీన్ తో సినిమా స్టార్ట్ అయ్యింది. నితిన్ సహా మరికొంత మందికి ఉరి శిక్ష వెయ్యాలన్న తీర్పుతో సీన్ వస్తుంది. ఇప్పుడు టైటిల్స్ రోల్ అవుతున్నాయి.
Date & Time : 08:45 AM February 26, 2021
-
హాయ్..140 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 08:40 AM February 26, 2021