-
మొత్తానికి సినిమా పూర్తయ్యింది. కంప్లీట్ రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:22 AM March 19, 2021
-
ఇప్పుడు క్లైమాక్స్ టైం..కార్తికేయ మరియు మురళీ శర్మల మధ్య ఓ విపరీతమైన ఎమోషనల్ సన్నివేశం వస్తుంది. ఇందులో డైలాగ్స్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నాయి.
Date & Time : 11:15 AM March 19, 2021
-
ఇప్పుడు ఆ ట్విస్ట్ రివీల్ అవ్వడంతో కార్తికేయ మళ్ళీ తన ప్రేమను దక్కించుకోవాలని చూస్తున్నాడు. సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 11:05 AM March 19, 2021
-
ఇప్పుడు కథనంలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. దీనితో సినిమా మరింత ఎమోషనల్ గా మారింది. హీరోయిన్ కూడా కొన్ని సమస్యల వల్ల దూరం అయ్యిపోయింది. ఓ బాధాకరమైన సాంగ్ ఇపుడు వస్తుంది.
Date & Time : 11:00 AM March 19, 2021
-
తన రోల్ లో కార్తికేయ చాలా బాగా చేస్తున్నాడు. అలాగే తన నటనలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. లావణ్య కూడా కాస్త డిఫరెంట్ గా ఉంది.
Date & Time : 10:55 AM March 19, 2021
-
హీరోయిన్ మెల్లగా హీరో వైపు వెళ్తుంది..ఇప్పుడు ఓ బ్యూటిఫుల్ సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 10:50 AM March 19, 2021
-
హీరోయిన్ తండ్రిగా చేస్తున్న మురళీ శర్మ రోల్ తన కామెడీ యాంగిల్ బాగుంది. ముఖ్యంగా కార్తికేయతో సీన్స్ బాగున్నాయి.
Date & Time : 10:40 AM March 19, 2021
-
ఈ సినిమాలో హీరో తల్లికి సంబంధించి మరో డిఫరెంట్ స్టోరీ కూడా కనిపిస్తుంది. అలాగే అదే హీరో లవ్ స్టోరీకి కూడా కనెక్ట్ అయ్యినట్టుగా కనిపిస్తుంది.
Date & Time : 10:30 AM March 19, 2021
-
ఇప్పుడు అనసూయతో ప్లాన్ చేసిన మాస్ సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 10:25 AM March 19, 2021
-
ఇంటర్వెల్ అనంతరం..ఇప్పుడు సినిమా వేరే మూడ్ లోకి చేంజ్ అయ్యింది. లావణ్యా కోసం హీరో ఇంకా ట్రై చేస్తూనే వస్తున్నాడు. కొన్ని కామెడీ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 10:20 AM March 19, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు చూస్కుంటే పర్వాలేదని చెప్పొచ్చు. కథ పరంగా పెద్దగా అనిపించకపోయినా మంచి ఎమోషన్స్ లవ్ స్టోరీ వంటివి బాగున్నాయి. అలాగే కార్తికేయ తన రోల్ లో సూపర్బ్ గా ఉన్నాడు. బ్యాక్ డ్రాప్ కూడా మంచి రియలిస్టిక్ గా ఉంది. మరి సెకండాఫ్ ఎంత కీలకంగా మారుతుందో చూడాలి.
Date & Time : 10:15 AM March 19, 2021
-
లావణ్యని ఎలా అయినా సరే తన చెంతకు వచ్చేలా చేస్తాననే ఛాలెంజ్ తో అది కూడా లావణ్య తోనే సినిమా ఇంటర్వెల్ కు చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:10 AM March 19, 2021
-
ఇంటర్వెల్ బ్యాంగ్ కు సిద్ధం..హీరోయిన్ ని టీజ్ చేస్తున్నాడని పోలీసులు హీరోని పట్టుకున్నారు. ఇప్పుడు మెయిన్ లీడ్ మధ్య ఓ సీరియస్ సీన్ వస్తుంది.
Date & Time : 10:05 AM March 19, 2021
-
ఇప్పుడు సినిమా కాస్త టెన్స్ వాతావరంల్లోకి షిఫ్ట్ అవుతుంది. అలాగే హీరో కూడా తన వ్యక్తిగతంగా కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 10:00 AM March 19, 2021
-
ఇప్పుడు కార్తికేయ తల్లికి సంబంధించి ఒక సున్నితమైన కోణం చూపించబడుతుంది. ఇది కాస్త భిన్నంగా ఎమోషన్ గా ఉంది.
Date & Time : 09:55 AM March 19, 2021
-
కార్తికేయ లావణ్యాను ఎలా అయినా ఇంప్రెస్ చెయ్యాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. మరి సీన్స్ ను ఉద్దేశిస్తూ ఓ టీజింగ్ సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 09:40 AM March 19, 2021
-
ఓ విధవ పాత్రలో లావణ్య త్రిపాఠి సింపుల్ లుక్స్ తో ఎంట్రీ ఇచ్చింది. అలాగే కార్తికేయ ఆమెతో ఫస్ట్ లుక్ లోనే ప్రేమలో పడ్డాడు. మంచి కామెడీ కూడా కనిపిస్తుంది.
Date & Time : 09:25 AM March 19, 2021
-
ఇపుడు కార్తికేయ తల్లిగా సీనియర్ నటి ఆమని పరిచయం అయ్యారు. అలాగే శవాలను తీసుకెళ్లే ఓ వ్యాన్ డ్రైవర్ గా కార్తికేయ లైఫ్ స్టైల్ ను చూపిస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:15 AM March 19, 2021
-
వైజాగ్ లో బస్తీ బాలరాజుగా కార్తికేయ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మాస్ ఫస్ట్ సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 09:05 AM March 19, 2021
-
హాయ్..137 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 09:00 AM March 19, 2021