-
మొత్తానికి సినిమా ఒక సస్పెన్స్ తో ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 12:40 AM August 02, 2024
-
ఇపుడు క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ఆదిత్య రామ్ (అల్లు శిరీష్) మరియు విలన్ (అజ్మల్) నడుమ వస్తుంది. ఈ ఫైట్ లో బడ్డీ, ఆదిత్యకి హెల్ప్ చేస్తుంది. ఈ మూమెంట్స్ లోనే బడ్డీ అసలు గుర్తింపు ఏంటి అనేది ఆదిత్య తెలుసుకున్నాడు.
Date & Time : 12:30 AM August 02, 2024
-
ఇప్పుడు ఫైనల్ గా హీరో, విలన్ ఒకరినొకరు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 12:20 AM August 02, 2024
-
ఇప్పుడు అల్లు శిరీష్, బడ్డీ అలాగే అలీ లు మెయిన్ విలన్ ఎవరో కనుక్కునే మిషన్ లో ఉన్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:10 AM August 02, 2024
-
బడ్డీ కోసం శిరీష్ హాంగ్ కాంగ్ కి చేరుకున్నాడు. ఈ సమయంలో అతన్ని ఆ డాక్టర్స్ తాలూకా మనుషులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కమెడియన్ అలీ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 12:00 AM August 02, 2024
-
ఇంటర్వెల్ అనంతరం.. ఇప్పుడు కథ హాంగ్ కాంగ్ కి షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ డాక్టర్స్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:50 AM August 02, 2024
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: సినిమా ఫస్ట్ హాఫ్ పలు ఎంటర్టైనింగ్ మూమెంట్స్ తో ఆకట్టుకుంది. అల్లు శిరీష్, టెడ్డీ బియర్ లకు సంబంధించిన సీన్స్ బాగున్నాయి. మరి సెకండ్ హాఫ్ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
Date & Time : 11:40 AM August 02, 2024
-
చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఆపడానికి టెడ్డీ బియర్ సీరియస్ స్టాండ్ తీసుకుంటుంది. దీంతో ఇంటర్వెల్ కి సమయం ఆసన్నమైంది.
Date & Time : 11:30 AM August 02, 2024
-
అల్లు శిరీష్, టెడ్డీ బియర్ తో కలిసి డాక్టర్ అజ్మల్ చట్టవిరుద్ధ కార్యకలాపాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:20 AM August 02, 2024
-
అల్లు శిరీష్ టెడ్డీ బియర్ కి జీవం ఎలా వచ్చిందో తెలుసుకుంటాడు. టెడ్డీ లోపల ఉన్న వ్యక్తిపై దృష్టి పెడతాడు. అందుకు సంబంధించిన కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:08 AM August 02, 2024
-
టెడ్డీ బియర్ అల్లు శిరీష్‌ను చేరుకోవడంతో ఫ్లాష్‌బ్యాక్‌కి సినిమా టర్న్ అయ్యింది. ఫ్లైట్ ల్యాండింగ్ తర్వాత కొన్ని ఇంటెన్స్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:55 AM August 02, 2024
-
ఊహించని ట్విస్ట్ తో హీరోయిన్ టెడ్డీ బియర్ ప్రాణం పోసుకుంది. ఈ ఆశ్చర్యకరమైన సంఘటనతో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:45 AM August 02, 2024
-
అజ్మల్ అమీర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వైద్యుడిగా పరిచయం అయ్యాడు. ఓపెనింగ్ టైటిల్స్ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత హీరోయిన్ ప్రిషా సింగ్ పరిచయం అయ్యింది.
Date & Time : 10:30 AM August 02, 2024
-
హాయ్, 137 నిమిషాల (2 గంటల 17 నిమిషాలు) నిడివి గల బడ్డీ చిత్రం ఇప్పుడే ప్రారంభం అయ్యింది.
Date & Time : 10:20 AM August 02, 2024