-
-
సినిమా ఇప్పుడే ముగిసింది. పూర్తి రివ్యూ కొరకు 123టెలుగు.cఒమ్ చూస్తూ ఉండండి.
Date & Time : 09:14 AM June 28, 2019
-
కథలోని కీలక అన్నిమలుపుల వెనకున్న అసలు కారణాలు బయటపడుతుండటంతో, సినిమా ముగింపు దిశగా వెళుతుంది.
Date & Time : 09:04 AM June 28, 2019
-
మరో కమెడియన్ బిత్తిరి సత్తి ప్రవేశించాడు,అతనిపై కొన్ని హాస్యసన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:54 AM June 28, 2019
-
సినిమా కథనం కామెడీ ట్రాక్ నుండి సీరియస్ కథలోకి ప్రవేశించింది,టైటిల్ సాంగ్ "బ్రోచేవారెవరురా" వస్తుంది.
Date & Time : 08:39 AM June 28, 2019
-
సినిమా కథకు సమాంతరంగా వివిధ నేపధ్యాలలో హాస్యసన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 08:30 AM June 28, 2019
-
విరామం తరువాత ఇంటెర్వేల్ కి ముందు జరిగిన సంఘటనలకు సంబంధము ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:20 AM June 28, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్:అలరించే కామెడీ సన్నివేశాలతో ,కొన్ని ఆసక్తికర మలుపులతో మొదటి భాగం మూవీ ఆహ్లదంగా సాగింది. ఇంటర్వెల్ లో ట్విస్ట్ మూవీ పై ఆసక్తిని పెంచింది. సెకండ్ హాఫ్ కొరకు ఎదురు చూస్తున్నాం.
Date & Time : 08:06 AM June 28, 2019
-
కొన్ని ఆసక్తికర మలుపుల మధ్య మూవీ మొదటి సగం పూర్తయ్యింది. ఇప్పుడు విరామం.
Date & Time : 08:04 AM June 28, 2019
-
కథలో ఆసక్తికర మలుపు, డైరెక్టర్ సత్యదేవ్ హీరోయిన్ కి కథ చెప్పే మొదటిసన్నివేశానికి సంబంధం ఉన్న సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 07:55 AM June 28, 2019
-
కొన్ని ఆసక్తికర సన్నివేశాల అనంతరం సినిమాలోని మరో సాంగ్ "వగలాడి" వస్తుంది. హాస్యసన్నివేశాల్లో కమెడియన్స్ రామకృష్ణ,ప్రియదర్శి చక్కని టైమింగ్ తో అలరిస్తున్నారు.
Date & Time : 07:44 AM June 28, 2019
-
వెంటనే కథనం సత్యదేవ్ ,నివేదా పేతురాజ్ పాత్రలలోకి ప్రవేశించింది. వీరి మధ్య "తలపులు తలపులు" అనే ఒక మెలోడీ సాంగ్ వస్తుంది.
Date & Time : 07:26 AM June 28, 2019
-
చిత్రంలోని మరొకపాట "దొరగారి సాంగ్" వస్తుండగా శ్రీవిష్ణు, నివేదా థామస్ మధ్య పరిచయం,స్నేహనికి సంబందించిన సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 07:20 AM June 28, 2019
-
రాహుల్(శ్రీవిష్ణు) రాకీ(ప్రియదర్శి) రాంబో(రాహుల్) ముగ్గరు స్నేహితులు, వీరి క్లాసుమేట్ నివేదా థామస్. ఝాన్సీ వీరి క్లాస్ టీచర్ గా పరిచయమైంది. వీరి మధ్య స్కూల్ డేస్ నేపథ్యంలో కొన్ని హాస్యసన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 07:15 AM June 28, 2019
-
ఆర్3 గ్యాంగ్ గా పిలువబడే చిత్రంలోని ప్రధాన నటులు శ్రీవిష్ణు,ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ ఓ హాస్యసన్నివేశంతో పరిచయమయ్యారు. "పుటుక్కు జర జర" సాంగ్ వస్తుంది.
Date & Time : 07:03 AM June 28, 2019
-
డైరెక్టర్గా మొదటి అవకాశం కోసం ప్రయత్నిస్తున్న సత్యదేవ్ ఒక స్టార్ హీరోయిన్ అయిన షాలిని(నివేదా పేతురాజ్) కి తాను రాసుకున్న కథ వినిపిస్తుండగా,కథలోకి నివేదా థామస్ ప్రవేశించింది.
Date & Time : 06:59 AM June 28, 2019
-
సత్యదేవ్ తన లక్ష్యం చేరుకొనే ప్రయత్నంలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలిపే విధంగా "వాలే చినుకులే" సాంగ్ వస్తుండగా టైటిల్స్ పడుతున్నాయి.
Date & Time : 06:53 AM June 28, 2019
-
చిత్రం ఆసక్తి గొలిపే కిడ్నాప్ సన్నివేశంతో ప్రారంభమైంది. నటుడు సత్య దేవ్ పెద్ద డైరెక్టర్ కావాలని ఆశపడే యువకుడిగా పరిచయమయ్యాడు.
Date & Time : 06:48 AM June 28, 2019
-
హాయ్ 139 నిమిషాల నిడివి గల "బ్రోచేవారెవరురా" మూవీ ఇప్పుడే మొదలైంది.
Date & Time : 06:43 AM June 28, 2019