-
క్లైమాక్స్.. కళ్యాణ్ పాత్రకి టైం ట్రావెల్ లో ఒక సరైన ముగింపు కనిపించింది. దీనితో కథ సుఖాంతం అయ్యింది. ఇక పూర్తి రివ్యూ కోసం అయితే 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 09:43 AM Aug 05, 2022
-
ఇప్పుడు ఆ పాపని కాపాడేందుకు భారీ యాక్షన్ సీక్వెన్స్ ఇప్పుడు వస్తుంది. గతానికి ప్రస్తుతానికి సంబంధించిన సీన్స్ తో సినిమా క్లైమాక్స్ కి చేరుకుంటుంది.
Date & Time : 09:40 AM Aug 05, 2022
-
ఇప్పుడు ఎమోషనల్ మరియు ఒక యాక్షన్ సీన్ వస్తుంది. కొన్ని అంశాలు ఊహించదగ్గట్టే ఉన్నాయి కానీ డ్రామా బాగుంది.
Date & Time : 09:35 AM Aug 05, 2022
-
ఆ నిధి కోసం ఒక మహా హోమం జరుగుతున్న సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి. దీనితో టైం ట్రావెల్ కనెక్షన్ కరెక్ట్ గా చూపించడం బాగుంది.
Date & Time : 09:25 AM Aug 05, 2022
-
ఇప్పుడు నటుడు ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో ఎంట్రీ ఇచ్చారు. తన సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:15 AM Aug 05, 2022
-
ఇప్పుడు సినిమా మళ్ళీ వెనక్కి వెళ్ళింది. తన రాజ్యానికి సంబంధించి ఎదురవుతున్న కొన్ని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 09:05 AM Aug 05, 2022
-
ప్రస్తుత రోజులకి తగ్గట్టుగా కళ్యాణ్ రామ్ మేకోవర్ అద్భుతంగా ఉంది. అలాగే కీరవాణి ఇస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.
Date & Time : 08:55 AM Aug 05, 2022
-
ఈ చిత్రంలో ఓ చిన్నారి పాత్ర కీలకంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:50 AM Aug 05, 2022
-
ఇంటర్వెల్ అనంతరం.. అసలైన ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ సినిమా గతానికి మారింది. కళ్యాణ్ రామ్ మరియు క్యాథరిన్ మధ్య సీన్స్ తర్వాత ఓ రొమాంటిక్ సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 08:45 AM Aug 05, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు సినిమా ఆకట్టుకునే విధంగానే ఉంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని దర్శకుడు మెప్పించే విధంగా ఎస్టాబ్లిష్ చేసాడు. అలాగే కళ్యాణ్ రామ్ అయితే తన నటనతో ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. విజువల్స్, డ్రామా, ఫన్ అంతా బాగున్నాయి. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 08:30 AM Aug 05, 2022
-
ఇంటర్వల్ బ్యాంగ్.. ఒక ఆసక్తికర ఎమోషనల్ సీన్ అది కూడా గతానికి ప్రస్తుతానికి సంబంధించి వస్తుంది. దీనితో ఇప్పుడు విరామం.
Date & Time : 08:20 AM Aug 05, 2022
-
ఓ ఆసక్తికర ట్విస్ట్ అయితే కథనంలో ఇప్పుడు చోటు చేసుకుంది. గతానికి, ప్రస్తుతానికి లింక్స్ రచన బాగుంది. సినిమా ఇపుడు ఇంటర్వల్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 08:15 AM Aug 05, 2022
-
ఇప్పుడు స్క్రీన్ పైకి 'భీమ్లా నాయక్' ఫేమ్ సంయుక్త మీనన్ మరియు వెన్నెల కిషోర్ లు వచ్చారు. కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 08:10 AM Aug 05, 2022
-
బింబిసార గానే కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. తనపై ప్రస్తుత కాలంలో కొన్ని సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా కాస్త ఫన్ గా కనిపిస్తున్నాయి.
Date & Time : 08:00 AM Aug 05, 2022
-
ఇప్పుడు కథనంలో ఒక మంచి ట్విస్ట్ చోటు చేసుకుంది. కాలంలో గతానికి ప్రస్తుతానికి సంబంధాన్ని సూపర్బ్ గా చూపించారు. సినిమా మరింత ఆసక్తికరంగా మారుతోంది.
Date & Time : 07:50 AM Aug 05, 2022
-
బింబి తనదైన శైలిలో పలు రాజ్యాలను ఆక్రమిస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ రాణి (క్యాథరిన్) ని కూడా తన వశపరుచుకున్నాడు. సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:35 AM Aug 05, 2022
-
ఇప్పుడు మళ్ళీ సినిమా ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళింది. ఇక్కడ కళ్యాణ్ రామ్ బింబిసార మహారాజుగా గా తన సిసలైన క్రూరమైన ఎంట్రీని చూపించాడు.
Date & Time : 07:25 AM Aug 05, 2022
-
ఈ చిత్రంలో నిధి కోసం టైం ట్రావెల్ తో జరిగే కథలా కనిపిస్తుంది. ఇప్పుడు సినిమా ప్రస్తుత కాలమానానికి షిఫ్ట్ అయ్యింది.
Date & Time : 07:15 AM Aug 05, 2022
-
ఇప్పుడు కళ్యాణ్ రామ్ రాయల్ ఎంట్రీ ఇచ్చాడు. వైవా హర్ష కూడా ఈ ఫాంటసీ వరల్డ్ లో కనిపిస్తున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి.
Date & Time : 07:10 AM Aug 05, 2022
-
హాయ్.. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో క్రీస్తు పూర్వం 500 సన్నివేశాలతో సినిమా స్టార్ట్ అయ్యింది.
Date & Time : 07:00 AM Aug 05, 2022