మొదటి షో వివరాలు : బైకర్
ఒక హ్యాపీ నోట్ తో సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
శర్వానంద్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో తన సత్తా చాటుతున్నాడు. సినిమా క్లైమాక్స్ కి చేరుకుంటోంది.
కథలో ఒక కీలక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజం తెలుసుకున్న శర్వానంద్ షాక్ కి గురవుతాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఒకటి రావడంతో థియేటర్ హోరేత్తింది.
మరొకసారి కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ లీగ్ లో శర్వా పాల్గొంటున్నాడు.
రేసింగ్ ట్రాక్ పై ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ వస్తుంది. శర్వానంద్ ప్రత్యర్థి అతనికి ఛాలెంజ్ విసురుతాడు.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా డీసెంట్ గా సాగింది. రేసింగ్ ఆట నేపథ్యంలో వచ్చే సీన్స్ చక్కగా ఉన్నాయి. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
ఒక ఎమోషనల్ సీన్ తో సినిమా సగానికి చేరుకుంది.
శర్వానంద్, రాజశేఖర్ మధ్య విబేధం ఏర్పడుతుంది.
శర్వానంద్ కి రాజశేఖర్ ఇంటెన్స్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. తన కొడుకుని ఛాంపియన్ గా చూడాలని ఆయన కోరుకుంటున్నాడు.
ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. శర్వానంద్ ఒక బైక్ రేసర్ గా పోటీలో పాల్గొంటున్నాడు.
సునీల్ నారాయణ్ పాత్రలో రాజశేఖర్ పరిచయం అయ్యాడు. ఆయన ఒక సమస్యలో చిక్కుకున్నాడు.
శర్వానంద్ ఒక సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు. మాళవిక నాయర్ కూడా పరిచయం అయింది.
హాయ్.. 2 గంటల 42 నిముషాలు నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.