-
ఓ ఎమోషనల్ నోట్ తో అయితే సినిమా కంప్లీట్ అయ్యింది. పూర్తి రివ్యూ కిశోరం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 11:45 AM May 19, 2023
-
మరో పెద్ద ట్విస్ట్ తో తో అయితే సినిమా మరింత ఆసక్తిగా మారుతూ ఇంటెన్స్ ఎండింగ్ దిశగా సాగుతుంది.
Date & Time : 11:35 AM May 19, 2023
-
ఇప్పుడు కథనంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ ఇంట్రెస్టింగ్ కోర్ట్ సీన్ అయితే ఇప్పుడు వస్తుంది.
Date & Time : 11:25 AM May 19, 2023
-
ఇప్పుడు కథనంలో మరో పెద్ద టర్న్ చోటు చేసుకుంది. సత్య, సీఎం తో మాట్లాడుతున్న కీలక సీన్స్ వస్తున్నాయి. ఇప్పుడు సినిమా మరింత సీరియస్ గా మారింది.
Date & Time : 11:15 AM May 19, 2023
-
యాంటీ బికిలీ ప్రాజెక్ట్ కోసం సత్య ఇప్పుడు వివరిస్తున్నాడు. సంబంధిత కీలక సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 11:05 AM May 19, 2023
-
ఇప్పుడు సత్య భారతదేశంలో గల భిక్షాటనను ఎలాగైనా నిర్మూలించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో యాంటీ బికిలీ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసాడు.
Date & Time : 10:50 AM May 19, 2023
-
ఇప్పుడు సత్య తన కొత్త గుర్తింపుని దాచాడు. ఇప్పుడు మరికొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:40 AM May 19, 2023
-
ఇంటర్వెల్ అనంతరం..కమెడియన్ యోగిబాబు ఇప్పుడు స్క్రీన్ పైకి వచ్చాడు. కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:30 AM May 19, 2023
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు సినిమా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో ఆసక్తి గానే ఉంది. కానీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త సాగదీతగా ఉంది. విజయ్ ఆంటోనీ నటన బాగుంది. నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:20 AM May 19, 2023
-
ఓ థ్రిల్లింగ్ సీక్వెన్స్ తో అయితే సినిమా ఇప్పుడు సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:10 AM May 19, 2023
-
ఓ కీలక సన్నివేశం తర్వాత సత్య ని దేవ్ గిల్ తన గ్యాంగ్ సత్య ని టార్చర్ చేస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:00 AM May 19, 2023
-
ఇప్పుడు కథ ప్రస్తుతానికి వచ్చింది. దేవ్ గిల్, తన గ్యాంగ్ మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి. ఈ తర్వాత డుముకి చల్ సాంగ్ మొదలైంది.
Date & Time : 09:50 AM May 19, 2023
-
ఇప్పుడు సత్య, తన చెల్లెలు రాణి పై చిన్ననాటి కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:40 AM May 19, 2023
-
ఇప్పుడు కథనంలో ఓ పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు సత్య గతం తాలూకా సన్నివేశాలు మొదలయ్యాయి. అతను విజయ్ లా కనిపించే ఓ భిక్షగాడు కాగా ఇప్పుడు చెల్లి వినవే అనే ఎమోషనల్ సాంగ్ వస్తుంది.
Date & Time : 09:30 AM May 19, 2023
-
హరీష్ పేరడి మరియు జాన్ విజయ్ లతో దేవ్ గిల్ ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. మరోపక్క విజయ్ దుబాయ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.
Date & Time : 09:20 AM May 19, 2023
-
స్పృహలో లేని విజయ్ ఆంటోనీ ఇప్పుడు స్క్రీన్ పై పరిచయం అయ్యాడు. ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. ఫస్ట్ సాంగ్ కూడా మొదలైంది.
Date & Time : 09:10 AM May 19, 2023
-
మెయిన్ విలన్ గా దేవ్ గిల్ ఇప్పుడు పరిచయం అయ్యాడు. అలాగే ఓ న్యూరో సర్జన్ గా కిట్టి కూడా పరిచయం అయ్యాడు. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం తాను చెప్తున్న సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 09:05 AM May 19, 2023
-
హాయ్..152 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయింది.
Date & Time : 09:00 AM May 19, 2023