-
హాయ్ ఇప్పుడే 160 నిమిషాలు....( 2 గంటల 40 నిమిషాల) నిడివి గల మూవీ మొదలైంది
Date & Time : 12:40 AM August 11, 2023
-
మూవీ కోల్ కతా లో మొదలైంది...తప్పిపోయిన అమ్మాయిలకి సంబందించిన సన్నివేశాలు ప్రస్తుతం వస్తున్నాయి
Date & Time : 12:43 AM August 11, 2023
-
మంచి మాస్ డ్యాన్స్ బిట్ తో ఇప్పుడే చిరంజీవి, కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చారు
Date & Time : 12:50 AM August 11, 2023
-
చిరంజీవి టాక్సీ డ్రైవర్ గా మారారు....ప్రస్తుతం తమన్నా ఎంట్రీ కి సంబంధించిన సీన్స్ వస్తున్నాయి
Date & Time : 01:00 AM August 11, 2023
-
కామెడీ కింగ్ బ్రహ్మానందం ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు...ప్రస్తుతం కొన్ని కోర్టు సీన్స్ వస్తున్నాయి
Date & Time : 01:05 AM August 11, 2023
-
అనంతరం కొట్టరా కొట్టు తీనుమారు సాంగ్ వస్తోంది....చిరంజీవి, కీర్తి సురేష్ ఇద్దరూ కూడా డ్యాన్స్ అదరగొడుతున్నారు
Date & Time : 01:10 AM August 11, 2023
-
తమన్నా సోదరుడిగా ఇప్పుడే నటుడు సుశాంత్ ఎంట్రీ ఇచ్చారు
Date & Time : 01:15 AM August 11, 2023
-
కొన్ని కామెడీ సీన్స్ తర్వాత కిడ్నాపింగ్ గ్యాంగ్ ని పట్టుకునే పనిలో ఉన్నారు చిరంజీవి
Date & Time : 01:20 AM August 11, 2023
-
ప్రస్తుతం సినిమాలో చిన్న ట్విస్ట్ కి సమయం
Date & Time : 01:30 AM August 11, 2023
-
ఓవైపు కీర్తి సురేష్ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు తమ గ్యాంగ్ లో కిల్లర్ కోసం విలన్స్ వెతుకుతున్నారు.
Date & Time : 01:35 AM August 11, 2023
-
చిరంజీవి పై రివెంజ్ ప్లాన్ చేసిన తమన్నా తిరిగి ఆయన ప్రేమలో పడుతుంది. ఇది మిల్కీ బ్యూటీ సాంగ్ కి టైం
Date & Time : 01:45 AM August 11, 2023
-
సెకండ్ విలన్ తో చిరంజీవి ప్రస్తుతం తలపడుతున్నారు. ప్రస్తుతం వారి మధ్య భారీ యాక్షన్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 01:55 AM August 11, 2023
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ :
ఇప్పటివరకు సినిమా పర్లేదు. చిరంజీవి ఎప్పటి మాదిరిగా తన పాత్రలో అద్బుతంగా నటించారు. ఇక సాంగ్స్, బీజీఎమ్ పర్లేదు. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 02:10 AM August 11, 2023
-
ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తున్నాయి. మూవీ హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది, చిరు భోళా గా ఏ మేరా జహా సాంగ్ తో కనిపించారు
Date & Time : 02:15 AM August 11, 2023
-
ప్రస్తుతం భోళా మేనియా సాంగ్ వస్తుంది. చిరు తన మార్క్ స్టెప్స్ తో అదరగొడుతున్నారు
Date & Time : 02:20 AM August 11, 2023
-
కీర్తి సురేష్ ఫ్రెండ్ గా శ్రీముఖి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది
Date & Time : 02:30 AM August 11, 2023
-
ప్రస్తుతం చిరంజీవి గ్యాంగ్ అలానే కీర్తి సురేష్ ఫ్యామిలీ మధ్య ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 02:40 AM August 11, 2023
-
పవన్ ఖుషి లోని రొమాంటిక్ సీన్ ని సూపర్ గా రీ క్రియేట్ చేసారు
Date & Time : 02:45 AM August 11, 2023
-
విలన్స్ ప్రస్తుతం కీర్తి సురేష్ ఫ్యామిలీ పై ఎటాక్ చేస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 02:55 AM August 11, 2023
-
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పూర్తి అయింది. మెయిన్ విలన్ కోల్ కతా లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం జామ్ జామ్ జజ్జనక సాంగ్ వస్తోంది
Date & Time : 03:05 AM August 11, 2023
-
ప్రస్తుతం హై ఓల్టేజ్ క్లైమాక్స్ దిశగా మూవీ సాగుతోంది
Date & Time : 03:15 AM August 11, 2023
-
హ్యాపీ ఎండింగ్ తో సినిమా పూర్తి అయింది ...పూర్తి రివ్యూ కోసం మా సైట్ చూస్తూ ఉండండి
Date & Time : 03:30 AM August 11, 2023