-
భీకరమైన యాక్షన్ సన్నివేశాల తర్వాత సినిమా మంచి అంశంతో ముగుస్తుంది. పూర్తి సమీక్ష కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 03:45 AM February 25, 2022
-
సీరియస్ ప్లాష్‌బ్యాక్ తర్వాత సినిమా మళ్లీ అసలు కథలోకి వచ్చింది. భీమ్లా నాయక్ మరియు డేనియల్ శేఖర్ మధ్య టగ్ ఆఫ్ వార్ తీవ్రమవుతుంది. ఇక ఇప్పుడిప్పుడే సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంటుంది.
Date & Time : 03:15 AM February 25, 2022
-
పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత, భీమ్లా నాయక్ ఫ్లాష్‌బ్యాక్‌లోకి కథ వెళ్ళింది.
Date & Time : 03:00 AM February 25, 2022
-
కొన్ని ఉద్రిక్త సన్నివేశాల తర్వాత, ఇప్పుడు భారీ ఫైట్ నడుస్తుంది.
Date & Time : 02:50 AM February 25, 2022
-
భీమ్లా నాయక్ భార్యను సముద్రఖని టార్గెట్ చేసే సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 02:45 AM February 25, 2022
-
ప్రస్తుతం రానా, రావు రమేష్‌ల మధ్య సన్నివేశాలు జరుగుతున్నాయి.
Date & Time : 02:40 AM February 25, 2022
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటివరకు భీమ్లా నాయక్ డీసెంట్‌గా అనిపించింది. తమన్ ఇచ్చిన సంగీతం బాగుంది. ప్రధాన పాత్రధారుల మధ్య వచ్చే ఘర్షణ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. డైలాగ్స్ కూడా బాగున్నాయి. మరి సెకండాఫ్‌లో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి మరీ.
Date & Time : 02:35 AM February 25, 2022
-
సాంగ్ తర్వాత భీమ్లా నాయక్ మరియు డేనియల్ శేఖర్ మధ్య మరొకసారి ముఖాముఖి ఏర్పడింది. ఇప్పుడు ఇంటర్వెల్ సమయం.
Date & Time : 02:30 AM February 25, 2022
-
లా లా భీమ్లా అనే హిట్ పాట వస్తుంది. అభిమానుల కేరింతలు, అరుపుల మధ్య హాల్ దద్దరిల్లిపోతుంది.
Date & Time : 02:25 AM February 25, 2022
-
నాయక్ సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు సినిమా మరింత ఆసక్తికరంగా మారింది.
Date & Time : 02:20 AM February 25, 2022
-
పోలీస్ స్టేషన్లో తీవ్రమైన ఎపిసోడ్ నడుస్తుండగా పవన్ కళ్యాణ్ మౌనంగా స్పందించడం హైప్‌ని క్రియేట్ చేస్తోంది.
Date & Time : 02:10 AM February 25, 2022
-
భీమ్లా నాయక్ డేనియల్ శేఖర్ల మధ్య తొలిసారి యుద్ధం మొదలయ్యింది.
Date & Time : 02:00 AM February 25, 2022
-
కొన్ని కామెడీ సన్నివేశాల తర్వాత, భీమ్లా నాయక్ పాటకు సమయం ఆసన్నమైంది. కొంతమంది నటీనటులు ఈ పాటలో అతిధి పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచారు.
Date & Time : 01:50 AM February 25, 2022
-
నిత్యా మీనన్ భీమ్లా నాయక్ భార్య సుగుణగా పరిచయమైంది. దంపతుల మధ్య క్యూట్ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 01:40 AM February 25, 2022
-
పవన్ కళ్యాణ్, రానా మధ్య సినిమా టెన్షన్ వాతావరణంగా సాగుతుంది.
Date & Time : 01:35 AM February 25, 2022
-
పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ మరియు రానా మధ్య తీవ్రమైన ఘర్షణ సన్నివేశాలు జరుగుతున్నాయి.
Date & Time : 01:25 AM February 25, 2022
-
రానా దగ్గుబాటితో ముఖాముఖిగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌గా పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 01:20 AM February 25, 2022
-
పవన్ కళ్యాణ్ అడవి గురించి చెప్పే డైలాగ్‌తో సినిమా ప్రారంభమయ్యింది. అడవి తల్లి పాటతో టైటిల్స్ మొదలయ్యాయి.
Date & Time : 01:15 AM February 25, 2022
-
హాయ్.. సినిమా ఇప్పుడే మొదలయ్యింది. సినిమా నిడివి 145 నిమిషాలుగా ఉంది.
Date & Time : 01:10 AM February 25, 2022