భైరవం

Bhairavam

single

Pre Release Event

single

Trailer Launch Event

single

Videos

మొదటి షో వివరాలు : భైరవం

మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.

Date & Time : 11:30 AM May 30, 2025

ఫైనల్ గా నిజం బయట పడింది, ఒక సాలిడ్ సీక్వెన్స్ కి రంగం సిద్ధం అయ్యింది. ఇప్పుడు మరో యాక్షన్ సీక్వెన్స్ మొదలైంది.

Date & Time : 11:20 AM May 30, 2025

ఇప్పుడు మరో మర్డర్ జరుగుతుంది. ఈ సంబంధిత సన్నివేశాలు కొనసాగుతున్నాయి.

Date & Time : 11:05 AM May 30, 2025

ఆ మోసం ముగ్గురు స్నేహితుల్లో ఒకరి మరణానికి దారి తీస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ సాగుతున్నాయి. ఇంకోపక్క మినిష్టర్ తనకేం కావాలో దానిని సొంతం చేసుకున్నాడు.

Date & Time : 10:50 AM May 30, 2025

ఇప్పుడు మంచు మనోజ్ ఒక పన్నాగం వేస్తున్నాడు. ఇది తెలిసినప్పటికీ శ్రీనివాస్ సైలెంట్ గానే ఉన్నాడు. ఏదో పెద్దగా ఇప్పుడు జరగబోతోంది.

Date & Time : 10:38 AM May 30, 2025

మినిస్టర్ కి ఒక వార్నింగ్ ఇచ్చిన సన్నివేశం తర్వాత నారా రోహిత్, మంచు మనోజ్ నడుమ కీలక సన్నివేశం వస్తుంది.

Date & Time : 10:30 AM May 30, 2025

ఇంటర్వెల్ అనంతరం.. పోలీసు స్టేషన్ దగ్గర బెల్లంకొండ శ్రీనివాస్ పై ఆ ఆలయానికి లింక్ ఉన్న సన్నివేశాలతో మొదలైంది.

Date & Time : 10:20 AM May 30, 2025

ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పుడు వరకు సినిమా ఓకే రేంజ్ లో ఉంది. ముగ్గురు హీరోలు నీట్ పెర్ఫార్మన్స్ లు అందించారు. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

Date & Time : 10:10 AM May 30, 2025

ఒక ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్ ముగ్గురు లీడ్ హీరోస్ నడుమ జరగడంతో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.

Date & Time : 10:05 AM May 30, 2025

ఇప్పుడు మరింత ఆసక్తికరంగా పరిస్థితులు మారాయి. నారా రోహిత్ ఆ ఆలయానికి సంబంధించి ఏదో జరుగుతుంది అని తెలుసుకుంటున్నాడు. ఈ సంబంధించిన సన్నివేశాలు కొనసాగితున్నాయి

Date & Time : 09:55 AM May 30, 2025

ఆ ఆలయ సమస్య మరిన్ని ఆసక్తికర పరిస్థితులకి దారి తీస్తుంది. ఒక షాకింగ్ ఘటనతో ముగ్గురు ప్రాణ స్నేహితులు నడుమ చిచ్చు రేగింది.

Date & Time : 09:45 AM May 30, 2025

జయసుధ మరణం తర్వాత ఆ ఊరి ఆలయ ధర్మకర్త ఎవరు? అనేది ప్రశ్నగా మారింది. అజయ్ అందుకు సిద్ధంగా ఉన్నాడు కానీ శ్రీనివాస్ కూడా ఉన్నాడు. వీరిపై కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.

Date & Time : 09:35 AM May 30, 2025

కొన్ని డ్రమాటిక్ మూమెంట్స్ తర్వాత మరో లవ్ ట్రాక్ మొదలయింది. ఓ వెన్నెల సాంగ్ తర్వాత మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ నడుమ కీలక సన్నివేశాలు వస్తున్నాయి.

Date & Time : 09:25 AM May 30, 2025

ఇప్పుడు హీరోయిన్ అదితి శంకర్ పరిచయం అయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్ తో పలు రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి.

Date & Time : 09:15 AM May 30, 2025

ఇప్పుడు ముగ్గురు హీరోలు ఇంట్రో జరిగిపోయింది. ఒక దేవాలయం బ్యాక్ డ్రాప్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మొదటి సాంగ్ మొదలైంది.

Date & Time : 09:05 AM May 30, 2025

బెల్లంకొండ శ్రీనివాస్ పై ఒక వివరణాత్మక ఇంట్రో తర్వాత తన బ్యాక్ స్టోరీ పై సన్నివేశాలు వస్తున్నాయి. తన గజపతి, నారా రోహిత్ లతో ఫ్రెండ్షిప్ సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 08:55 AM May 30, 2025

హాయ్.. 155 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

Date & Time : 08:45 AM May 30, 2025