-
-
ఇప్పుడు మరో యాక్షన్ సన్నివేశానికి రంగం సిద్ధం అయ్యింది.అదే స్థాయిలో శరవేగంగా క్లైమాక్స్ పూర్తయ్యింది.ఎట్టకేలకు సినిమా కూడా పూర్తయ్యిపోయింది,పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 09:50 PM December 12, 2018
-
చాలా కీలకమైన ట్విస్ట్ ఇప్పుడు చోటు చేసుకుంది.మరో సారి ఒకరిని ఒకరు చంపుకుంటూ చాలా హింసాత్మకమైన సన్నివేశాలు వస్తున్నాయి.మరీ ఎక్కువ రక్తపాతం వలన ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతాడు.పోరాట సన్నివేశంతో చిత్రం క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.
Date & Time : 09:40 PM December 12, 2018
-
హీరోయిన్ తండ్రికి హీరోకి మధ్యలో గొడవ పడే సన్నివేశాలు వస్తున్నాయి.ఇవి పూర్తిగా పేద, ధనిక వర్గాల మధ్య పోరులా కనిపిస్తున్నాయి.విలన్ పై నాటకీయంగా సాగే కొన్ని డైలాగ్స్ వస్తున్నాయి.
Date & Time : 09:35 PM December 12, 2018
-
విప్లవాత్మకంగా మొదలైన చిత్రం ఒక్క సారిగా సరికొత్త మలుపు తీసుకుంది.ఈ చిత్రంలోని అన్ని అంశాలను ప్రతిబింభించేలా ఒక పాట రూపంలో వస్తుంది.వీటి వల్ల ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి అంతకంతకు తగ్గిపోతుంది.
Date & Time : 09:25 PM December 12, 2018
-
ఈ చిత్రంలోని విలన్ లు హీరో తల్లిని బంధించి ఆమెని హింసిస్తున్నారు..కొన్ని జీర్ణించుకోలేని రీతిలో ఉండే దారుణమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:15 PM December 12, 2018
-
వీరి ప్రేమకథ సాంగ్ కలలో అద్భుతంగా ఉన్నా నిజ జీవితంలోకి వచ్చేసరికి రంగీలా స్టైల్ లో ఉంది.హీరోయిన్ మాత్రం తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులకు థ్రిల్ తెప్పిస్తుంది.
Date & Time : 09:05 PM December 12, 2018
-
విరామం పూర్తయ్యింది. హీరో,హీరోయిన్లు వారి తల్లిదండ్రులను వదిలి వచ్చేసారు.ఒక రొమాంటిక్ సన్నివేశం ద్వారా వారి ప్రేమను తెలియజేస్తున్నారు.
Date & Time : 09:00 PM December 12, 2018
-
ఫస్టాప్ రిపోర్ట్ : భైరవ గీత చిత్రం రాయలసీమ నేపథ్యంలో వచ్చే పాతకాలపు రోజుల్లో స్కూల్ వయసులో చిగురించే ప్రేమకథ.సినిమా కథనం పర్వాలేదనిపించే స్థాయిలో బానే ఉంది.మొదటి సగం అంతా అత్యంత క్రూరంగా రక్తపాతంతో ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి.ఇక్కడే ఒక ఆసక్తికర పాయింట్ కూడా ఉంది,దాన్ని సెకండాఫ్ లో ఎలా తీసుకెళ్తారో చూడాలి.
Date & Time : 08:42 PM December 12, 2018
-
ఒక ఊహించని రీతిలో విరామ సన్నివేశం దిశగా చిత్రం కొనసాగుతుంది.హీరోయిన్ వారి ప్రేమకోసం చేసిన ఒక పని వారి ప్రేమకథకు పెద్ద సమస్య తీసుకొచ్చేలా చేసింది.ఇవన్నీ చూడటానికి మామూలుగానే ఉన్నా కానీ కాస్త ఆసక్తికరంగానే ఉన్నాయి.
Date & Time : 08:40 PM December 12, 2018
-
అన్ని సినిమాల్లో లానే ఇందులో కూడా హీరోయిన్ తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించలేదు.హీరో మీద హత్య చెయ్యడానికి ప్రయత్నిస్తున్న దిశగా ఒక చేజింగ్ సన్నివేశం వస్తుంది.ఇంటర్వెల్ దిశగా సినిమా కొనసాగుతుంది.
Date & Time : 08:37 PM December 12, 2018
-
సినిమా ఆసక్తికరంగా సాగుతూనే ఒక రొమాంటిక్ సాంగ్ దిశగా వెళ్ళింది.ఫుల్ రొమాంటిక్ గా ఉన్న ఈ పాటలో హీరోయిన్ చాలా అందంగా కనిపిస్తుంది.
Date & Time : 08:32 PM December 12, 2018
-
ఇప్పుడే ప్రేమకథ ఒక ఊహించని పరిస్థితుల్లో మొదలయ్యింది.ఈ ప్రేమ కథలో కులం ప్రస్తావన వచ్చే సీన్లు,డైలాగులు చాలా సహజంగా ఉన్నాయి.
Date & Time : 08:27 PM December 12, 2018
-
ఒక బలవంతపు పెళ్లి చూపుల సన్నివేశం వస్తుంది. హీరోయిన్ లో వచ్చే విప్లవాన్ని కనబర్చేలా అద్భుత రచన,కథనం ఆకట్టుకునే విధంగా ఉంది.ఇప్పుడే ప్రేమ కథ మొదలయ్యింది.
Date & Time : 08:18 PM December 12, 2018
-
సినిమా హీరోయిన్ ఇరా మోర్ తన చదువు పూర్తి చేసికొని ఆ గ్రామానికి వచ్చిన అమ్మాయిగా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.భైరవకి తనకి మధ్య సన్నివేశాలు వస్తున్నాయి.పాట దిశగా సినిమా కొనసాగుతుంది.
Date & Time : 08:02 PM December 12, 2018
-
సీమలో ఉండే రక్తపాతాలను అత్యంత క్రూరంగా చూపిస్తున్నారు.అక్కడి రక్తపాతాన్ని రామ్ గోపాల్ వర్మ కెమెరా పనితనంతో చాలా సహజత్వంగా చూపిస్తున్నారు.
Date & Time : 07:52 PM December 12, 2018
-
సినిమా ఇప్పుడే రాయలసీమలోని చిన్న గ్రామంకు చేరుకుంది.హీరో ధనుంజయ్ భైరవ గా ఎంట్రీ ఇచ్చారు.డ్రోన్స్ తో తీసిన సన్నివేశాలు తారా స్థాయిలో కనిపిస్తున్నాయి.
Date & Time : 07:42 PM December 12, 2018
-
హాయ్..రామ్ గోపాల్ వర్మ మార్క్ వాయిస్ స్టైల్ తో చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.ప్రతీ కుటుంబంలోనూ ఒక విప్లవం ఎలా మొదలవుతుందో చెప్తున్నారు.
Date & Time : 07:37 PM December 12, 2018