-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 04:36 AM January 26, 2018
-
చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. చెంచల ఫ్లాష్ బ్యాక్ లోని చివరి పార్ట్ ని చూపిస్తున్నారు.
Date & Time : 04:26 AM January 26, 2018
-
చిత్రంలో మరో ట్విస్ట్ రివీల్ అయింది. అసలు కథని తెలుసుకునేందుకు సిబిఐ అధికారి ఆశా గట్టి ప్రయత్నం చేస్తోంది.
Date & Time : 04:04 AM January 26, 2018
-
ఆసక్తికరమైన ట్విస్ట్ రివీల్ అయింది. మంచి పట్టున్న కథనంతో చిత్రం సాగుతోంది. అనుష్క, జయరామ్ ల మధ్య హాస్పిటల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 03:54 AM January 26, 2018
-
మోషన్ పోస్టర్ లో చూపిన విధంగా అనుష్క తన చేతిలోకి మేకు దించుకునే ఆసక్తికర సన్నివేశం వచ్చేసింది. విభిన్నమైన షేడ్స్ కలిగిన తన పాత్రలో అనుష్క అద్భుతంగా నటిస్తోంది.t
Date & Time : 03:50 AM January 26, 2018
-
చిత్రం చెంచల టైం పిరియడ్ కి ప్రజెంట్ డే కి మధ్య జరుగుతోంది. అనుష్క, మురళి శర్మ మధ్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:46 AM January 26, 2018
-
విద్యుల్లేఖ కామెడీ సన్నివేశాల తరువాత తాంత్రికుడి సన్నివేశాలు వస్తున్నాయి. భాగమతి ఆత్మని బంధించడానికి తాంత్రికుడు గట్టి ప్రయత్నం చేస్తున్నాడు.
Date & Time : 03:40 AM January 26, 2018
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇంటరాగేషన్ సీన్స్ వస్తున్నాయి. ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో భాగమతి సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 03:30 AM January 26, 2018
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చిత్రం డీసెంట్ గా ఉంది. హర్రర్ సన్నివేశాలు అక్కడక్కడా బావున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అద్భుతంగా ఉంది. అనుష్క మరో మారు తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. చిత్ర కథ, సస్పెన్స్ ఇంకా రివీల్ కాలేదు. ఈ అంశం సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతోంది.
Date & Time : 03:26 AM January 26, 2018
-
ఇప్పుడు భాగమతి టెర్రిఫిక్ ఎంట్రీ ఇచ్చింది. ట్రైలర్ లో చూపిన విధంగా భాగమతి అడ్డా అనే డైలాగ్ చెబుతూ అనుష్క భాగమతిగా ఎంటర్ అయ్యింది. ఇప్పుడు ఇంటర్వెల్.
Date & Time : 03:22 AM January 26, 2018
-
ఇప్పుడు బంగ్లాలో మరో రాబరీ సన్నివేశంతో పాటు హర్రర్ సీన్ కూడా వస్తోంది. ఈ సన్నివేశాలు రాత్రిపూట చోటుచేసుకుంటున్నాయి.
Date & Time : 03:12 AM January 26, 2018
-
తీవ్ర ఉత్కంఠ కలిగించిన హర్రర్ సన్నివేశాల తరువాత ఇప్పుడు ఇంటరాగేషన్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 03:06 AM January 26, 2018
-
మరికొన్ని భయాన్ని కలిగించే సన్నివేశాలు వస్తున్నాయి. తమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.
Date & Time : 02:52 AM January 26, 2018
-
ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం కూడా బంగ్లాలోకి ప్రవేశించింది. సిబిఐ అధికారులు అనుష్కని దర్యాప్తు చేస్తున్నారు.
Date & Time : 02:46 AM January 26, 2018
-
సాంగ్ పూర్తయింది. చిత్రం ప్రజెంట్ డే కి వచ్చింది. ప్రస్తుతం బంగ్లాలో కీలకమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:44 AM January 26, 2018
-
తక్కువ సమయంలోనే అనుష్క, ఉన్ని ముకుందన్ లు దగ్గరైపోయారు. ప్రస్తుతం అందమైన మెలోడీ సాంగ్ 'మందార మందార' వస్తోంది.
Date & Time : 02:40 AM January 26, 2018
-
చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది. చెంచల ఐఏఎస్ గా ఎంట్రీ ఇచ్చింది. ఉన్ని ముకుందన్ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు.
Date & Time : 02:36 AM January 26, 2018
-
పోలీస్ లతో కలసి అనుష్క బంగ్లాలోకి ప్రవేశించింది. సస్పెన్స్ తో కూడుకున్న భయంకర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:28 AM January 26, 2018
-
కమెడియన్లు ధనరాజ్, ప్రభాస్ శ్రీను మరియు విద్యుల్లేఖ పోలీస్ కానిస్టేబుల్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ధనరాజ్ భాగమతి బంగ్లా గురించిన కథని వివరిస్తున్నాడు.
Date & Time : 02:22 AM January 26, 2018
-
దర్యాప్తులో భాగంగా కీలకమైన సన్నివేశాలు వస్తున్నాయి. అనుష్క జైలులో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 02:20 AM January 26, 2018
-
ప్రముఖ నటుడు మురళి శర్మ మరియు మలయాళీ నటి ఆశా శరత్ సిబిఐ అధికారులుగా ఎంటర్ అయ్యారు. పురాతన విగ్రహాల రాబరీకి సంబందించిన దర్యాప్తు జరుగుతోంది.
Date & Time : 02:18 AM January 26, 2018
-
మలయాళీ నటుడు జయరామ్ మినిస్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:12 AM January 26, 2018
-
చిన్న పిల్లలతో సహా ఓ కుటుంబానికి చెందిన దారుణమైన మరణాలతో చిత్రం మొదలైంది. బ్యాక్ గ్రౌండ్ లో థీమ్ మ్యూజిక్ తో టైటిల్స్ పడుతున్నాయి.
Date & Time : 02:10 AM January 26, 2018
-
హాయ్..142 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభం అయింది.
Date & Time : 02:06 AM January 26, 2018