-
మొత్తానికి సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 01:00 PM January 23, 2021
-
జస్ట్ ఒక్క సన్నివేశంతోనే సినిమాకు క్లైమాక్స్ కు వచ్చేసింది. అంతా ఫాస్ట్ ఫాస్ట్ గా నడుస్తుంది.
Date & Time : 12:55 PM January 23, 2021
-
ఆ దొంగతనంకు సంబంధించి ట్విస్ట్ మెల్లగా రివీల్ అవుతూ వస్తుంది. ఇపుడు సినిమా క్లైమాక్స్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 12:50 PM January 23, 2021
-
చాలా అంశాలు బాగా డౌన్ అయ్యిపోయాయి. కొన్ని సిల్లీ సీన్స్ అనంతరం మళ్ళీ మెయిన్ ట్రాక్ లోకి ఇప్పుడు సినిమా వచ్చింది.
Date & Time : 12:45 PM January 23, 2021
-
ఇపుడు ఒక హిలేరియస్ పెళ్లి చూపుల సన్నివేశం వస్తుంది. ఇందులో పోసాని కామెడీ బాగుంది. మరో పక్క నరేష్ హీరోయిన్ ను ఇంప్రెస్ చెయ్యడానికి చాలా ట్రై చేస్తున్నాడు.
Date & Time : 12:40 PM January 23, 2021
-
ఇప్పుడు హిట్ ట్రాక్ స్వాతిలో ముత్యమంత రీమిక్స్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. అల్లరి నరేష్ తనదైన డాన్స్ మూవ్స్ చేస్తున్నాడు.
Date & Time : 12:35 PM January 23, 2021
-
ఒకదాని తర్వాత మరొకటి వరుస కామెడీ సీన్స్ వస్తూనే ఉన్నాయి. ఇవి బానే ఉన్నా సినిమా గాడి తప్పడం వల్ల బోర్ గా అనిపిస్తుంది.
Date & Time : 12:30 PM January 23, 2021
-
వెన్నెల కిషోర్ మళ్ళీ ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు అతనికి మరియు అల్లరి నరేష్ ల మధ్య మరిన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 12:21 PM January 23, 2021
-
ఇపుడు సినిమా అనవసరపు కామెడీతో పక్క దారి పట్టినట్టు అనిపిస్తుంది. సీన్స్ పరంగా బాగానే ఉన్నా ఫ్లో కరెక్ట్ గా లేదు.
Date & Time : 12:17 PM January 23, 2021
-
పోసాని కామెడీ డీసెంట్ గా ఉంది. ఈ సినిమాలో బంగారం పోగొట్టుకునే వారి పాత్రలు చాలా మందితో కనెక్ట్ అయ్యి ఉంది అలా కొత్త పాత్రలు వస్తూనే ఉన్నాయి.
Date & Time : 12:13 PM January 23, 2021
-
ఇప్పుడు గెటప్ శ్రీను ఎంటర్ అయ్యాడు. మంచి కామెడీ రోల్ లో కనిపిస్తున్నాడు. ప్రభాస్ శీను మరియు సత్యం రాజేష్ లతో కలిపిన కామెడీ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 12:10 PM January 23, 2021
-
ఇపుడు సినిమాలో అంశాలు మరింత స్లో అవుతున్నట్టు అనిపిస్తున్నాయి. అల్లరి నరేష్ లవ్ ట్రాక్ ఫ్లో ను పక్క దారి పట్టిస్తున్నట్టు అనిపిస్తుంది.
Date & Time : 12:08 PM January 23, 2021
-
ఇంటర్వెల్ అనంతరం అల్లరి నరేష్ ఆ దొంగతనం వెనుక ఎవరున్నారో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు.
Date & Time : 12:05 PM January 23, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు చూస్తే ఈ సినిమా ఈవీవీ గారి విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలను తలపిస్తుంది. ఆ తరహా కామెడీ మంచి స్టార్టింగ్ తో మొదలయిన మెల్లగా నెమ్మదిస్తుంది. ఇంటర్వెల్ వరకు ఓ మోస్తరుగా అయ్యిన ఈ సినిమా సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 12:00 PM January 23, 2021
-
ఇప్పుడు మరో చిన్న ట్విస్ట్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 11:55 AM January 23, 2021
-
అజయ్ గోష్ ఓ పోలీస్ గా ఇప్పుడు ఎంటర్ అయ్యాడు. కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేస్లు వస్తున్నాయి. కొన్ని ఆసక్తికర సీన్స్ వస్తున్నాయ్.
Date & Time : 11:45 AM January 23, 2021
-
ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.ఓ గుడిలో పెద్ద దొంగతనం జరిగింది. ఇంటర్వెల్ దిశగా సినిమా సాగుతుంది.
Date & Time : 11:35 AM January 23, 2021
-
నరేష్ హీరోయిన్ ను ఆమె ప్రాబ్లమ్స్ నుంచి బయట పడెయ్యడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఆ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు కాస్త ఆసక్తి తగ్గింది.
Date & Time : 11:25 AM January 23, 2021
-
హీరోయిన్ పూజా జావేరి ఇప్పుడు ఎంటర్ అయ్యింది. అలాగే అల్లరి నరేష్ మరియు వెన్నెల కిషోర్ ల మధ్య కొన్ని కామెడీ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 11:17 AM January 23, 2021
-
ఇప్పుడో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. చిన్న టౌన్ బ్యాంక్ ఉద్యోగి బంగారాన్ని తన పర్సనల్ పనులకు ఎలా ఉపయోగించుకున్నాడు అన్న సింపుల్ స్టోరీపై మంచి కథనంతో సినిమా నడుస్తుంది. వెన్నెల కిషోర్ ఇప్పుడు ఎంటర్ అయ్యాడు.
Date & Time : 11:10 AM January 23, 2021
-
కమెడియన్ ప్రవీణ్ ఇప్పుడు స్క్రీన్ పై ఎంటర్ అయ్యాడు.నరేష్ పై కొన్ని దేవాలయాల బంగారు ఆభరణాలకు సంబంధించి థ్రిల్లింగ్ సన్నివేశాలు వస్తున్నాయి. పోసాని కూడా ఇప్పుడు యాడ్ అయ్యారు.
Date & Time : 10:58 AM January 23, 2021
-
అల్లరి నరేష్ తాతయ్యగా తనికెళ్ళ భరణి పరిచయం అయ్యారు. ఇపుడు అతనికి ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక పాయింట్ సీన్ వస్తుంది. ఇపుడు సినిమా ఇంట్రెస్టింగ్ గా మారింది.
Date & Time : 10:50 AM January 23, 2021
-
ఓ బ్యాంక్ మేనేజర్ గా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఓ విలేజ్ సెటప్ లో అల్లరి నరేష్ కు పెళ్లి సంబంధ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:45 AM January 23, 2021
-
ఒక బ్యాంకు ఉద్యోగిగా అల్లరి నరేష్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు. సత్యం రాజేష్ అలాగే ప్రభాస్ శీను లు అతని అన్నయ్యలుగా కనిపిస్తున్నారు.
Date & Time : 10:40 AM January 23, 2021
-
హాయ్..129 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 10:35 AM January 23, 2021