-
-
ఈ దాడుల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు అన్నది తెలిసిపోవడంతో సినిమా ముగింపుకు చేరుకొని సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 08:20 AM September 20, 2019
-
బొమన్ ఇరానీ గ్రూప్ కంపెనీలపై ఇప్పుడు ఒక రైడ్ జరుగుతుంది.
Date & Time : 08:08 AM September 20, 2019
-
సూర్య, ఉగ్రవాదులు ప్లాన్ చేసిన ఓ దాడిని కనుక్కోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 08:00 AM September 20, 2019
-
ఒక టెర్రరిస్ట్ దాడిలో సయేషాను కాపాడే క్రమంలో సముద్రఖని చనిపోయాడు.వారి ఇంట్లో తీరని నష్టం వాటిల్లింది.
Date & Time : 07:50 AM September 20, 2019
-
సూర్య మరియు ఆర్యలు సయేషా బర్త్ డే పార్టీలో కలుసుకున్నారు.ఇప్పుడు పార్టీ సాంగ్ వస్తుంది.
Date & Time : 07:40 AM September 20, 2019
-
ఆర్య తన పవర్ తో బొమన్ ఇరానీకు అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు,కానీ సూర్య మాత్రం అతని నిర్ణయానికి అడ్డు పడుతున్నాడు.
Date & Time : 07:30 AM September 20, 2019
-
ఇప్పుడు బొమన్ ఇరానీ మరియు రైతుల మధ్య వాగ్వాదం నడుస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:25 AM September 20, 2019
-
సూర్య తాను చేపట్టిన కేసులో క్లూ కనుక్కోడానికి ఎన్ ఐ ఏ ఆఫీస్ కు వెళ్ళాడు.
Date & Time : 07:20 AM September 20, 2019
-
సూర్య ఒక అత్యున్నత స్థాయి కీలక కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు.మరోపక్క బొమన్ ఇరానీ తన ప్రయోజనాల కోసం గోదావరి ప్రాంతాల్లోని పంటపొలాలను నాశనం చేసేందుకు ప్లాన్స్ వేస్తున్నాడు.
Date & Time : 07:10 AM September 20, 2019
-
ఇంటర్వెల్ అనంతరం సినిమాలో ఇప్పుడు ఆర్య పర్యవేక్షణలో కాస్త రాజకీయ కోణాలు చోటు చేసుకుంటున్నాయి.
Date & Time : 07:02 AM September 20, 2019
-
ఒక ఊహించని ట్విస్ట్ తో సినిమా సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.
Date & Time : 06:57 AM September 20, 2019
-
ఇప్పుడు సముద్రఖని టెర్రరిస్టుల నుంచి కొన్ని బెదిరింపు కాల్స్ ఎదుర్కొంటున్నారు.మరోపక్క ప్రధాని కాశ్మీర్ ఒక మీటింగ్ లో ఉన్నారు.కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:50 AM September 20, 2019
-
హీరోయిన్ పూర్ణ, నటుడు సముద్రఖని భార్యగా పరిచయం అయ్యారు.ఇప్పుడు కొన్ని కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:40 AM September 20, 2019
-
బాలీవుడ్ సీనియర్ నటుడు బొమన్ ఇరానీ ఒక వ్యాపార వేత్తగా పరిచయం అయ్యారు.ఇప్పుడు బొమన్ ఇరానీ మరియు మోహన్ లాల్ ల మధ్య ఒక మీటింగ్ జరుగుతున్న సన్నివేశం వస్తుంది.
Date & Time : 06:37 AM September 20, 2019
-
ఇప్పుడు సూర్య ప్రధాని మోహన్ లాల్ కు పర్సనల్ సెక్యూరిటీగా నియమించబడ్డాడు.
Date & Time : 06:35 AM September 20, 2019
-
మోహన్ లాల్,ఆర్య,సూర్య మరియు సయేషాలు ఇండియాకు తిరిగి వచ్చేసారు.
Date & Time : 06:24 AM September 20, 2019
-
ఇప్పుడు పబ్ లో ఒక పాట వస్తుంది,ఇందులోనే సూర్య ఆ టెర్రరిస్టులను పట్టుకునే మిషన్ లో ఉన్నాడు.
Date & Time : 06:20 AM September 20, 2019
-
ఒక భారీ అటాక్ నుంచి ప్రధాని తప్పించుకున్నారు,ఆ తర్వాత సూర్య మరియు మోహన్ లాల్ ల మధ్య మొట్టమొదటి మీటింగ్ ఇప్పుడు మొదలయ్యింది.
Date & Time : 06:13 AM September 20, 2019
-
ప్రధాన మంత్రి లండన్ లో ఎన్నారైలను అందరిని ఒక చోటికి చేర్చి మీటింగ్ ఏర్పాటు చేసారు,ఇదే మీటింగులో సూర్య మరియు ఆర్యలు కనిపిస్తున్నారు.
Date & Time : 06:10 AM September 20, 2019
-
సూర్య పాత్రకు సంబంధించి ఏదో సస్పెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది.ఇప్పుడు సూర్య లండన్ ప్రయాణం అయ్యాడు.
Date & Time : 06:07 AM September 20, 2019
-
సహజ సేద్యం చేసుకునే ఓ సామాన్య రైతుగా సూర్య పాత్ర కనిపిస్తుంది.
Date & Time : 06:02 AM September 20, 2019
-
మరో టెర్రరిస్టుల దాడిలో హీరోయిన్ సయేషా తండ్రి చనిపోయాడు.ఇప్పుడొక మాస్ సాంగ్ తో హీరో సూర్య పాత్ర కథలోకి ఎంటర్ అయ్యింది.
Date & Time : 06:00 AM September 20, 2019
-
నటుడు ఆర్య పాత్ర, మోహన్ లాల్ కొడుకుగా పరిచయం అయ్యింది.
Date & Time : 05:58 AM September 20, 2019
-
విలక్షణ నటుడు మోహన్ లాల్ ప్రధాన మంత్రి పాత్రలో పరిచయం అయ్యారు.ఇప్పుడు ఆయనపై టెర్రరిస్టులు దాడి చేసిన సన్నివేశం వస్తుంది.
Date & Time : 05:56 AM September 20, 2019
-
హాయ్..165 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 05:55 AM September 20, 2019