-
మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 01:00 PM May 03, 2024
-
ఇప్పుడు సినిమా నిర్మాతలు ఖుష్బూ అలాగే సిమ్రాన్ లు స్పెషల్ క్యామియోలో ఓ డివోషనల్ సాంగ్ తో కనిపిస్తున్నారు.
Date & Time : 12:50 PM May 03, 2024
-
ఇప్పుడు సినిమా క్లైమాక్స్ దిశగా వెళుతుంది. వి ఎఫ్ ఎక్స్, హిప్ హాప్ తమీజా మ్యూజిక్ లు సినిమాలో ఇంప్రెసివ్ గా ఉన్నాయి.
Date & Time : 12:40 PM May 03, 2024
-
ఇప్పుడు సినిమా కాస్త ఎమోషనల్ గా ఎమోషనల్ గా మారింది. సుందర్ సి తమన్నాతో ఉన్న జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నాడు.
Date & Time : 12:25 PM May 03, 2024
-
ఇప్పుడు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలైంది. తమన్నా చావు వెనుక కారణం ఇప్పుడు బయటపడింది.
Date & Time : 12:15 PM May 03, 2024
-
కేజీయఫ్ రామచంద్ర కొన్ని కీలక వివరాలు బాక్ కోసం రివీల్ చేస్తాడు. ఇప్పుడిప్పుడే అన్ని కనెక్షన్ లు కలుస్తున్నాయి.
Date & Time : 12:05 PM May 03, 2024
-
ఇంటర్వెల్ అనంతరం.. వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి పై కొన్ని కామెడీ సీన్స్ తో సినిమా మొదలైంది.
Date & Time : 11:55 AM May 03, 2024
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు సినిమా అక్కడక్కడా ఆసక్తిగానే అనిపించింది. కొన్ని వర్కౌట్ అవ్వని కామెడీ సీన్స్ మినహా మిగతా అంతా పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 11:45 AM May 03, 2024
-
కొన్ని ఆసక్తికర సన్నివేశాలు అనంతరం సినిమా సగానికి చేరుకుంది. ఇపుడు విరామం.
Date & Time : 11:35 AM May 03, 2024
-
ఇప్పుడు సుందర్ కొన్ని కీలక వివరాలు తెలుసుకున్నాడు. ప్రస్తుతం సుందర్ సి, కేజీయఫ్ రామచంద్ర, రాశీ ఖన్నా లపై కొన్ని సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:20 AM May 03, 2024
-
ఇప్పుడు కథనంలో కీలక మార్పు చోటు చేసుకుంది సుందర్ సి తనకి కావాల్సిన ఎన్నో సమాధానాలని ఓ పోలీస్ తో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Date & Time : 11:10 AM May 03, 2024
-
రాశీ ఖన్నాని పడేసేందుకు వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డిలు తెగ ప్రయత్నిస్తున్నారు.
Date & Time : 11:00 AM May 03, 2024
-
ఇపుడు ఇప్పుడు నటి కోవై సరళ కొన్ని అనుమానాస్పద సంఘటనలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇంకోపక్క ఆమెకి వెన్నెల కిషోర్ నడుమ కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి. వారితో పాటుగా శ్రీనివాస్ రెడ్డి కూడా జాయిన్ అయ్యాడు.
Date & Time : 10:50 AM May 03, 2024
-
ఊహించని విధంగా తమన్నా ఆత్మహత్య చేసుకుంది. ఇది సుందర్ సి ఒక షాక్ లోకి నెట్టేసింది.
Date & Time : 10:40 AM May 03, 2024
-
సుందర్ సి ఓ లాయర్ గా ఇప్పుడు పరిచయం అయ్యాడు. అలాగే తమన్నా అతని చెల్లెలిగా కనిపిస్తుంది. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్నట్టుగా సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:30 AM May 03, 2024
-
ఓ యువతిని బాక్ అనే దుష్టశక్తి పట్టి పీడిస్తుంది. ఆమె తండ్రి తనని కాపాడే ప్రయత్నం చేస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:20 AM May 03, 2024
-
హాయ్.. 150 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 10:15 AM May 03, 2024