-
మూవీ ఇప్పుడే పూర్తయింది. మరి బ్రో మూవీ వివరణాత్మక సమీక్ష కోసం మా సైట్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 02:55 AM July 28, 2023
-
ఎమోషనల్ సీన్స్ ప్లే అవుతూనే ఉన్నాయి మరియు సినిమా గ్రిప్పింగ్ క్లైమాక్స్ వైపు వెళుతోంది.
Date & Time : 02:45 AM July 28, 2023
-
సినిమా ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది, ఇప్పుడు భావోద్వేగ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:40 AM July 28, 2023
-
ఓ దర్శకుడు తెరపై స్పెషల్ అఫియరెన్స్ లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. తేజ్ కుటుంబం యొక్క సన్నివేశాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
Date & Time : 02:35 AM July 28, 2023
-
పవన్ కళ్యాణ్ నుండి మరికొన్ని స్వాగ్ మొమెంట్స్ కి సమయం ఆసన్నమైంది. ఆయన తన పాత బ్లాక్‌బస్టర్ పాటలతో అదరగొట్టారు. ఇది నిజంగా అభిమానులకు పండగ.
Date & Time : 02:30 AM July 28, 2023
-
ఇప్పటికే పాట పూర్తయింది, అనంతరం యాక్షన్ సన్నివేశానికి సమయం ఆసన్నమైంది. ఇంతలో కేతికా శర్మకు ఓ షాకింగ్ నిజం తెలిసింది.
Date & Time : 02:15 AM July 28, 2023
-
సెకండాఫ్ మొదలైంది. కొన్ని కుటుంబ సంబంధిత సన్నివేశాల తర్వాత, మై డియర్ మార్కండేయ పాటకు సమయం ఆసన్నమైంది.
Date & Time : 02:10 AM July 28, 2023
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు, సినిమా డీసెంట్‌గా ఉంది, పవన్ కళ్యాణ్ మరియు సాయి తేజ్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. వీళ్ల కాంబో సీన్స్ చూడటానికి బాగున్నాయి. థమన్ స్కోర్ ఆకట్టుకుంటుంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 01:55 AM July 28, 2023
-
కొన్ని సెంటిమెంట్ సన్నివేశాల తర్వాత, తేజ్ మరిన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు మరియు ఇప్పుడు ఇంటర్వెల్ టైమ్
Date & Time : 01:50 AM July 28, 2023
-
సాయి తేజ్ మేనేజర్‌గా వెన్నెల కిషోర్ సన్నివేశంలోకి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. అనంతరం తేజ్ జీవితంలో ఒక షాకింగ్ సంఘటన జరుగుతుంది.
Date & Time : 01:40 AM July 28, 2023
-
ప్రస్తుతం వస్తున్న అద్భుతమైన ఐకానిక్ పాటకు పవన్ కళ్యాణ్ డ్యాన్స్, స్వాగ్ అయితే ఫ్యాన్స్ ని మంత్రముగ్దులను చేస్తోంది.
Date & Time : 01:30 AM July 28, 2023
-
సాయి తేజ్ మరియు కేతిక శర్మ నటించిన జానవులే పాట తర్వాత, పవన్ కళ్యాణ్ మరియు బ్రహ్మీ మధ్య ఎంగేజింగ్ సన్నివేశం జరుగుతుంది.
Date & Time : 01:20 AM July 28, 2023
-
ఒక చిన్న ట్విస్ట్ తర్వాత, ప్రధాన పాత్రల మధ్య మరిన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ మరియు పంచ్‌లు ఎంతో బాగున్నాయి.
Date & Time : 01:10 AM July 28, 2023
-
పవన్ కళ్యాణ్ మరియు సాయి తేజ్ మధ్య ఫన్నీ ఎపిసోడ్ జరుగుతోంది, మరియు పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతున్నారు.
Date & Time : 01:00 AM July 28, 2023
-
పవన్ కళ్యాణ్ మాస్ అవతార్‌లో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు, ఆయన ఎంట్రీ తో థియేటర్ మొత్తం సందడి నెలకొంది.
Date & Time : 12:55 AM July 28, 2023
-
సాయి తేజ్ మరియు అతని ప్రేమికురాలు కేతికా శర్మ మధ్య కొన్ని సన్నివేశాల తర్వాత, సినిమా హైదరాబాద్ నుండి వైజాగ్‌కి షిఫ్ట్ అవుతుంది. ఇది ఒక ట్విస్ట్ కి సమయం
Date & Time : 12:50 AM July 28, 2023
-
మార్కండేయ పాత్రలో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. అతని కుటుంబంతో కూడిన కొన్ని సన్నివేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
Date & Time : 12:45 AM July 28, 2023
-
హాయ్, 134 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే ప్రారంభమైంది
Date & Time : 12:40 AM July 28, 2023