-
మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 08: 14 AM November 29, 2019
-
ఇప్పుడు సినిమా క్లైమాక్స్ కు చేరుకుంటుంది.నిఖిల్ తాను నిరపరాదిని అని నిరూపించుకొని అసలు నిందితులను పట్టించడానికి అన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నాడు.ఇప్పుడు చేగువేరా సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 08: 05 AM November 29, 2019
-
ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటుగా పోలీస్ కస్టడీలో ఉన్న అర్జున్ ఇంటరాగేషన్ కూడా పూర్తయ్యింది.
Date & Time : 08: 02 AM November 29, 2019
-
ఇప్పుడు వెన్నెల కిషోర్ మరియు మిగతా గ్యాంగ్ మధ్య ఓ బలమైన ఎమోషనల్ సన్నివేశం వస్తుంది.
Date & Time : 07: 56 AM November 29, 2019
-
ఇప్పుడు మరో థ్రిల్లింగ్ ఎపిసోడ్ ద్వారా ఆ సర్టిఫికెట్ల స్కాం కు సంబంధించి మరింత సమాచారం రివీల్ అవుతుంది.
Date & Time : 07: 46 AM November 29, 2019
-
ఇప్పుడు నిఖిల్ లావణ్య మరియు వెన్నెల కిషోర్ ల సాయంతో ఇంకో అనధికారిక స్టింగ్ ఆపరేషన్ మొదలు పెట్టాడు.
Date & Time : 07: 41 AM November 29, 2019
-
ఇప్పుడు బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ మొదలయ్యింది.ఇందులో హీరో మరియు విలన్ మధ్య మరిన్ని ఇన్వెస్టిగేషన్ సీన్లు వస్తున్నాయి.
Date & Time : 07: 27 AM November 29, 2019
-
చిన్న స్కూల్ పిల్లలకు ఆక్సిడెంట్ అయ్యిన సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా వస్తున్నాయి.దీనంతటి వెనుక ఆ ఫేక్ సర్టిఫికెట్ల మాఫియాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 07: 22 AM November 29, 2019
-
ఇంటర్వెల్ అనంతరం నిఖిల్ మరియు విలన్ మధ్య మరింత ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07: 13 AM November 29, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయతే సినిమా డీసెంట్ గా కొనసాగింది.మంచి ట్విస్టులు కథనంతో ఇంటర్వెల్ కు 30 నిమిషాల నుంచి బాగుంది.మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి
Date & Time : 07:02 AM November 29, 2019
-
ఓ ఆసక్తికర ట్విస్ట్ తో సినిమా ఇప్పుడు సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.
Date & Time : 07:00 AM November 29, 2019
-
ఇప్పుడు ఆ స్కామర్స్ కు మరియు నిఖిల్ కు మధ్య కొన్ని ఆసక్తిభరిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:49 AM November 29, 2019
-
ఇప్పుడు నిఖిల్ మరియు అతని స్నేహితులు ఓ ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసే గ్యాంగ్ పై దృష్టి పెట్టారు.ఆ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 06:45 AM November 29, 2019
-
నిఖిల్ ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు.అతని టీమ్ కేసును ఇన్వెస్టిగేషన్ చెయ్యడం మొదలు పెట్టారు.
Date & Time : 06:38 AM November 29, 2019
-
ఇప్పుడు ఊహించని రీతిలో ట్విస్ట్ చోటు చేసుకుంది.ఓ లోన్ ఫోర్జరీ కేసులో నిఖిల్ అరెస్ట్ అయ్యాడు.
Date & Time : 06:24 AM November 29, 2019
-
ఇప్పుడు హిట్ ట్రాక్ కన్నె కన్నె సాంగ్ మొదలయ్యింది.ఈ సాంగ్ లో నిఖిల్ మరియు లావణ్యాల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది.
Date & Time : 06:17 AM November 29, 2019
-
ఇప్పుడు అర్జున్ పాత్ర మరింత మెరుగవుతూ వస్తుంది.ఇదే సమయంలో అర్జున్ బీబీసీ లో జర్నలిస్ట్ గా జాయిన్ అయ్యాడు.
Date & Time : 06:15 AM November 29, 2019
-
ఓ లాయర్ గా వెన్నెల కిషోర్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పుడు ఓ ఫన్నీ టీవీ డిబేట్ సీన్ నడుస్తుంది.
Date & Time : 06:02 AM November 29, 2019
-
నిఖిల్ మరియు లావణ్యలు ఓ స్టింగ్ ఆపరేషన్ లో కలుసుకున్నారు.నిఖిల్ ఫ్రెండ్ గా సత్య కూడా ఇప్పుడే జాయిన్ అయ్యాడు.ఈ నేపథ్యంలో తికమక మకతిక సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 05:58 AM November 29, 2019
-
ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిపోడ్ లోకి వెళ్ళింది.అర్జున్ ఫ్యామిలీ సంబంధిత సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 05:50 AM November 29, 2019
-
అర్జున్ ని అరెస్ట్ చెయ్యాలని అంటున్న నినాదాలతో సినిమా మొదలయ్యింది.కమిషనర్ ఆఫీస్ దగ్గర హీరో నిఖిల్ అర్జున్ లెనిన్ సురవరంగా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 05:49 AM November 29, 2019
-
మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 05:43 AM November 29, 2019
-
హాయ్..149 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 05:40 AM November 29, 2019